ఇంగ్లీష్ నేర్చుకోవడంతో ఆయన జీవితం కొత్త మలుపు తిరిగింది.
చైనా కు చెందిన అలీబాబా ఇ-కామర్స్ సంస్థ ను స్థాపించెందెవరో తెలుసుగా?
జాక్ మా. ప్రపంచంలోని ధనవంతుల్లో ఆయనకొరు. ఆయన జీవితం నిండా వైఫల్యాలే. అన్ని వైఫల్యాలు ఎవరికీ ఎదురయి ఉండవు. ప్రతి ప్రయత్నంలో వైఫల్యమే. ప్రతి వెంచర్ లో వైఫల్యమే. ఆయన జీవితం వైఫల్యాల సంకలనం. అయితే ఈ జీవితయాత్రను ఆయన అలాగే ఎక్కడో ఒక చోటో వయాసిస్ ఉంటుందని కొనసాగించాడు పట్టుదలతో. అదే చివర అలీబాబ అయింది. సక్సెస్ స్టోరీ కావడానికి ముందు ఆయనకెదురయిన ఫెయిల్యూర్ చూస్తే బలహీనులకు కళ్లు తిరుగుతాయ్.
ఆయన వైఫల్యాలు ప్రాథమిక పాఠశాలతో మొదలయి యూనివర్శిటీ దాకా నిరాటంకంగా కొనసాగాయి. ప్రయిమరీ స్కూల్ లో రెండు సార్లు ఫెయిలయ్యాడు. మిడిల్ స్కూల్లో మూడు సార్లు ఫెయిలయ్యాడు. యూనివర్శిటీలో ఎంట్రన్స్ మూడు సార్లు ఫెయిలయ్యాడు. పోలీసు ఉద్యోగానికి అప్లై చేస్తే … అక్కడా ఫెయిలయ్యాడే. చివరకు ఉద్యోగం KFC కి వెళితే వాళ్లూ తిరస్కరించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తే…ఏమయిందోతెలుసా.. పదిసార్లు ‘పోబే ’ అని వాళ్లు తిప్పికొట్టారు.ఇపుడాయన ప్రపచంలో నూరు మంది most influential వ్యక్తులలో ఒకరు.
చైనా కల్చరల్ రెవల్యూషన్ కాలంలో… గడ్డురోజులలో ఒక పేద కుటుంబంలో జాక్ మా పుట్టాడు.
అయితే, జాక్ మా సక్సెస్ కు ఇంగ్లీష్ నేర్చుకోవడమే కారణమనవచ్చు. లేదా ఇంగ్లీష్ నేర్చుకోవడమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది. చైనాలో ఇంగ్లీష్ వినబడేదేకాదు. జాక్ మా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాడు. హాంగ్ జో (Hangzhou) పట్టణానికి వచ్చాడు. అమెరికా పర్యాటకులుండే హోటళ్ల దగ్గిర తచ్చాడుతూ వాళ్లని వూర్లో టూర్ కొట్టిస్తూ వాళ్లదగ్గిర నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అపుడే ఆయన పేరు ఇంగ్లీష్ జాక్ (Jack) అయింది. ఆయన అసలు పేరు మా యూన్ (Ma Yun).
మ్యాథ్స్ చదవాలనుకుంటే ఎంట్రన్స్ లో ఒక శాతం మార్కులు రావడం లేదు. అందుకని ఆయన ఇపుడు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని Hangzhou టీచర్స్ ఇన్ స్టిట్యూట్ లో ఇంగ్లీష్ కోర్సులోచేరాడు. అక్కడ చదివాక కూడా ఆయన 30 ఉద్యోగాలకు అప్లై చేశాడు. ఒక్కదానికి కూడా సెలెక్ట్ కాలేదు. చివరకు ఎక్కడ ఉద్యోగం రాకపోవడంతో..చివరి అస్త్రం ఇంగ్లీష్ ప్రయోగించాడు. చిన్నదైనా ఇంగ్లీష్ టీచర్ గా నెలకు 12 డాలర్లకు కొలువుకు కుదుర్చుకున్నాడు. ఇదే ఆయన జీవితంలో తొలి ఉద్యోగ విజయం. అయితే, ఫెయిల్యూర్స్ ఆయన్ని వెంటాడం మానలేదు.
ఇంగ్లీషే చివరకు తనకు ఇలా దారి చూపిస్తుందని ఆయనెపుడూ కలకనలేదు.
ఇక ఇంగ్లీష్ ద్వారానే పైపైకి రావాలనున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ బిజినెస్ సర్వీసెస్ బిజినెస్ మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో ఆయనకు ఆమెరికా యాత్ర భాగ్యం లభించింది. అక్కడ అపుడు ఆయన ఇంటర్నెట్ అనేది పరిచయమయింది. ఇంటర్నెట్ ఆయనను ఆకట్టుకుంది. ఒక రోజు ఆయన ఆన్ లైన్ సెర్చ్ లో ఉన్నపుడు చైనీస్ బీర్ ఎక్కడ ఆన్ లైన్ కనిపించలేదు. దీనితో ఆయన చైనీస్ బీర్ ఇతర సరుకుల కోసం ఒక ఇంటర్నెట్ పేజీ తెరవాలనుకున్నాడు. తెరిచాడు. ఇది సూపర్ హిట్ అయింది.
ప్రపంచంలో అన్ని మూలలనుంచి చైనా వస్తువులను విక్రయించే బిజినెస్ లో భాగస్వాములవుతామని రిక్వెస్టు లొచ్చాయి. చివర ఆయన ఒక ప్రభుత్వ కంపెనీతో కలసి జాయింట్ వెంచర్ మొదలుపెట్టారు. ఇది ముందుకుసాగలేదు.
తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఎకనమిక్ కోఆరేషన్ లో ఉద్యోగానికి కుదిరాడు. 1999లో ఆయన ఉద్యోగం కూడా వదిలేసి 17 మంది మిత్రులను పోగేసుకుని ఆన్ లైన్ మార్కెటింగ్ బిజినెస్ మొదలుపెట్టాడు. దీనికి ఫండింగ్ కోసం అమెరికా వెళ్లాడు. ఇది లాభసాటి బిజినెస్ కాదు, ఐడియా బాగా లేదని అంతా రిజెక్ట్ చేశారు. అయితే, ఆయన నిరుత్సాహపడలేదు.
ఫండింగ్ కోసం పడరాని పాట్లు పడ్డాడు.చివరకు గోల్డ్ మన్ శాక్స్ (5 మిలియన్ డాలర్లు) , సాఫ్ట్ బ్యాంక్ (20 మిలియన్ డాలర్లు) నుంచి ఫండ్ వచ్చింది. అయితే, అలీబాబా కంపెనీకి బిజినెస్ లేదు. మొదటి మూడేళ్లు నష్టాలే. తర్వాత కంపెనీ దాదాపు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. దీనితో మిత్రుల మధ్య విబేధాలొచ్చాయి. ఒక్కొక్కరే బయటకు పోవడం మొదలుపెట్టారు. అయితే, దీనితో నిరుత్సాహపడకుండా, మిగిలిన వాళ్లతో ముందుకు సాగాడు.
చైనాలో ఇ-బే (eBay) లాగా ఆన్ లైన్ బిజినెస్ ప్రారంభించాడు. అంతే, తిరిగిచూల్లేదు. అయిదేళ్లలో e-Bayని చైనానుంచి తరిమేశాడు. యాహూ నుంచి వచ్చిన ఫండింగ్ తో అలీబాబా అంతర్జాతీయ మార్కెట్ లోక వచ్చింది. మార్కెట్ ను జయించేసింది. ఇపుడు అలీబాబా లేని దేశం లేదు. ఇ-కామర్స్ రంగమూ లేదు.