ఇది 151 సంవత్సాల కిందటి మాట. అప్పటికింకా ఖగోళ భౌతికశాస్త్రం (యాస్ట్రో ఫిజిక్స్ )అనే మాట రాలేదు.ప్రపంచ వ్యాపితంగా శాస్త్రవేత్తలంతా భూమ్మీద దొరికే వాటినే కనుగొంటున్నారు, వాటిని రకరకాలుగా పరిక్షిస్తున్నారు.
భూమ్మీది లేనిదాన్ని,కేవలం ఖగోళంలో ఉన్నదాని తొలిసారిగా 1868 ఆగస్టు 18న సంపూర్ణ సూర్యగ్రహణం రోజున కనుగొన్నారు.
అదే హీలియమ్ అనే నోబుల్ గ్యాస్. మనిషికి తెలిసిన పదార్థాలలో అత్యంత తెలికయినవాటిలో రెండేది. మొదటిటి హైడ్రోజన్. ఇది విశ్వంలో ఎక్కుగా అంటే 25 శాతం ఉంది. చాలా తెలికయింది కాబట్టి భూమ్మీది నుంచి పారిపోయింది. ఇపుడెక్కడయినా కనిపించిందంటే భూగర్భంలో ఉండే రేడియోధార్మిక పదర్ధాలు విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడిందే.
ఈ హీలియంను కనిపెట్టింది 151 సంవత్సాల కిందట గుంటూరు,మచిలీపట్నంలలో జరిగిన కొన్నిప్రయోగాల్లోనే.అందులో కూడా ముఖ్యమయింది మచిలీపట్నం ప్రయోగమే.
ఇది కూడా చదవండి
ఆశ్చర్యమేమిటంటే అంతవరకు కనిపెట్టిన మూలకాలన్నీ రసాయన శాస్త్రవేత్తల ప్రయోగ శాలలనుంచి వచ్చాయి. ఒక్క హీలియమ్ మాత్రమే సూర్యుని చుట్టూర ఉన్న కరొనా నుంచి ఆరుబయలు ప్రయోగం నుంచి వచ్చింది.
అదెలా జరిగిందో చూద్దాం.
1868 ఆగస్టు 18న సంపూర్ణ సూర్యగ్రహణం ఎదురవుతూ ఉంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రపంచవ్యాపితంగా శాస్త్రవేత్తలలో ఆసక్తి రేకెత్తించింది. సూర్యగ్రహణం సమయంలో భూమికి సూర్యుడికి మధ్య చందమామ వచ్చి చేరి సూర్యు గోళం కనిపించకుడా చేస్తాడు.
Think your friends would be interested? Share this story!
అపుడు కనిపించేది సూర్యునిచుట్టూ ఉన్న ప్రకాశవంతమయిన కరోనా మాత్రమే. మామూలు పరిస్థితుల్లో భగభగ మండే సూర్యుడి తాపం వల్ల ఈ కరోనా కనిపించదు.
అందువల్ల కరోనాను పరిశీలించాలనుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఒక్కటే మార్గం. అదికూడా సూర్యగ్రహణం ఉన్న కొద్ది సేపే సాధ్యం.
దీనివల్లే 1868, ఆగస్టు 18 సంపూర్ణ గ్రహణాన్ని వీక్షించేందుకు గ్రహణం బాగా కనిపించే ప్రాంతాలకు ప్రపంచ శాస్త్రవేత్తలంతా వెళ్లిపోతున్నారు.
దానికి తోడు ఆ యేడాది గ్రహణం 6.47 నిమిషాల కాలం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ సేపుకింద లేక్క. గ్రహణం బాగా కనిపించే మార్గాలలో భారతదేశానికి సంబంధించి మహారాష్ట్ర నుంచి మచిలీపట్నం దాకా ఉంది.
కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మార్గంలో ఉన్న గుంటూరు జిల్లాకు గ్రహణాన్ని పరిశీలించాలనుకున్నారు. మరికొందరు మచిలీపట్నం వెళ్లారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్త పీర్ జూల్స్ సీజర్ జాన్ సెన్ గుంటూరు వెళ్లారు.
ఆయన గుంటూరు వెళ్లేందుకు ఒకపుడు అది ఫ్రెంచ్ పాలన కింద ఉండటం ఒక కారణం. అక్కడ ఇంకా కొంతమంది సంపన్న ఫ్రెంచ్ వ్యాపారస్థులు నివసిస్తూన్నారు. గుంటూరులో ఆయన ఫ్రెంచ్ వ్యాపారస్తుడు జూల్స్ లూ ఫాసియర్ ( Jules Le Faucheur) ఇంటిలో మకాం వేశారు.
ఇదే విధంగా అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున జేమ్స్ ఎఫ్ టెనాంట్ అనే శాస్త్రవేత్త కూడా గుంటూరు కే బయలు దేరారు. నిజానికి ఆయన మచిలీ పట్నం వెళ్లాలనుకున్నారు. సముద్ర తీరాన పొగమంచు ఆకాశంలో మేఘాలు అడ్డువస్తాయేమోననే అనుమానంతో ఆయన కూడా గుంటూరు వైపు మళ్లారు,అక్కడి బ్రిటిష్ ప్రభుత్వం కాంపౌండులో స్పెక్ట్రోస్కోప్, టెలిస్కోప్ లతో తన ఏర్పాట్లు చేసుకున్నారు.
మరొక వైపు మద్రాసు అబ్జర్వేటరీ డైరెక్టర్ గా ఉన్న నార్మన్ పోగ్సన్ తన టీమ్ తో రేపు పట్టణం మచిలీపట్నం వచ్చారు.
సూర్యగ్రహణం రోజున వీళ్లంతా సూర్యడి కరోనా స్పెక్ట్రమ్ మీదే దృష్టి నిలిపారు. స్పెక్ట్రమ్ అంటే క్లుప్తంగా మూలకాల నుంచి వెలువడే వెలుతురు గీతలు.
కరొనా స్పెక్ట్రమ్ లో మొదట జాన్సెన్ కు విచిత్రమేమీ కనిపించలేదు.
అయితే,టెనాంట్ కు మాత్రం ఒక ఆరంజ్ లైన్ స్పెక్ట్రమ్ లో కనిపించింది. అయితే దానిని ఆయన సోడియం D Line అనుకున్నారు.
అయితే, మచిలీ పట్నం మకాం వేసి పోగ్సన్ మాత్రం ఒక చిత్రమయిన లైన్ ను గుర్తించారు. D Line కు సమీపంలో మూడో లైన్ ను చూశారు. ఇది డి లైన్ లాగా లేదు. భిన్నంగా ఉంది. మరిదేంటి అని దీని మీద చర్చ మొదలయింది.
జాన్సెన్ మొదట్లో స్పెక్ట్రమ్ లో విచిత్రమేమి రిపోర్టు చేయకపోయినా కొద్ది రోజుల తర్వాత కరోనా స్పెక్ట్రమ్ లో కనిపించిన కొత్త లైన్ వెనక ఏదో వింత వుందని తర్వాత అనుమానించారు. ఈ విషయాన్నే ఆయన భార్యకు ఒక లేఖ రాస్తూ భారతదేశం నుంచి తానొక నిరంతర గ్రహణాన్ని బంధించి పట్టుకొస్తున్నానని పేర్కొన్నారు.
“They have sent me to observe the eclipse for five minutes, and I am bringing back a perpetual eclipse from India.”
ఇదే సమయంలో నే లండన్ లో నార్మన్ లాకియర్ అనే ఒక ఔత్సాహిక శాస్త్రవేత్త సూర్యూని కరోనాని సూర్యగ్రహణం లేకుండానే స్పెక్ట్రోస్కోప్ ని జాగ్రత్తగా సూర్యుని అంచులనుంచి ఈ కరోనాలోకి జరుపుతూ కూడా పరిశీలించవచ్చని చెప్పారు.
ఆయనకు పోగ్సన్ రిపోర్ట్ కూడా దొరికింది. పోగ్సన్ గుర్తించిన లైన్ ను గతంలో ఎవరూ ఎపుడూ చూడలేదని అనుకున్నారు. ఆ యేడాది అక్టోబర్ ఆయన మరొక శక్తివంతమయిన స్పెక్టోస్కోప్ అందింది. దీనిని ఉపయోగించి సోలార్ అట్మాష్పియర్ మీద దృష్టి నిలిపి దాని ఎమిజన్ స్పెక్ట్ర మ్ తీయగలిగారు.
ఇందులో ఆయనకు కూడా ఫోగ్సన్ కు Sodium D Line సమీపంలో కనిపించిన కొత్త లైనే కనిపించింది. ఇదేమయినా పొరపాటుగా హైడ్రోజన్ దేమో అనే సంశయం పొగొట్టుకునేందుకు హైడ్రోజన్ ను రకరకాల పరిస్థితులో పరిశీలించి చూశారు. చివరకు పోగ్సన్ స్పెక్ట్రమ్ లో కనిపించిన కొత్త లైన్ హైడ్రోజన్ ది కాదని తేల్చుకున్నారు.
1871లో లాకియర్ ఈ లైన్ కచ్చితంగా ఒక కొత్త మూలకం నుంచి వస్తున్నదని, ఇలాంటిది భూమ్మీద ఇంతవరకు కనిపించలేదనే నిర్ణయానికి వచ్చాడు.
ఇది సూర్యుడినుంచి వచ్చింది కాబట్టి గ్రీక్ దేవత హీలియోస్ పేరు మీద ఆయన దీనికి హీలియం అని పేరు పెట్టారు.
అయితే దీనికి గురించి ఆయన ఎక్కడ బయటకు వెల్లడించలేదు. 1871లో బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్సెస్ సమావేశంలో ఈ సంస్థ అధ్యక్షుడు సర్ విలియమ్ థాంప్సన్ లాకియర్ డిస్కవరీని ప్రకటించారు.
లాకియర్ దీని మీద ఒక పేపర్ ని తయారుచేసి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెన్ కు కూడా పంపించారు. జాన్సెన్ ఇండియా నుంచి పంపిన నివేదిక అందిన కొద్ది రోజుల్లోనే లాకియర్ నివేదిక కూడా అందింది.
ఇద్దరి డిస్కవరీ ని ఆమోదిస్తూ 1872లో ఫ్రెంచ్ గవర్నమెంట్ జాన్సెన్ , లాకియర్ లకు సరికొత్త సోలార్ డిస్కవరీస్ అవార్డు ప్రకటించింది.
తర్వాత 1868లో లాకియర్, జాన్సెన్ చేసిన ప్రయోగాల వల్ల హీలియం ఉనికి తెలిసిందని, వారిద్దరికి హీలియం కనిపెట్టిన గౌరవం కట్టబెట్టారు.
నిజానికి కొత్త స్పెక్ట్రల్ కనిపెట్టిన పోగ్సన్ ను ప్రపంచం మరిచిపోయింది. తను కనుగొన్నదాన్ని పోగ్సన్ శాస్త్రవేత్తలు నడిపే జర్నల్స్ కు పంపలేదు. ఆయనేదో ఎవరికీ తెలియని గవర్నమెంట్ పబ్లికేషన్ కు పంపాడు. దీనిని అంతా వేస్ట్ప పేపర్ గా చూస్తున్నారని 1882లో పోగ్సన్ బాధ పడ్డాడు.
పోగ్సన్ ని శాస్త్ర ప్రపంచం మర్చిపోయింది. కారణం ఆయనకు యూనివర్శిటీ డిగ్రీలేకపోవడమని చెబుతారు.
అయతే, ప్రభుత్వంలో కూాడా ఆయనకు అంత మంచి పేరు లేదు. దరుసుగా ప్రవర్తిస్తుంటాని చెడ్డపేరు. దానికితోడు భారతీయులు మీద చిన్న చూపుండేది. అయితే, పోగ్సన్ పరిశీలించి కొత్త లైన్ గురించి నార్మన్ లాకియర్ తన జ్ఞాపకాలు లో ప్రస్తావించి ఆయన పేరు గుర్తుండేలా చేశారు. ఇది వేరే విషయం.
ఇంతకీ ఈ లైన్స్ గోడవేమిటి?
1959 లో గుస్తఫ్ కీర్ఖాప్ & రాబర్ట్ బున్సెన్ ( యూనివర్శిటీ ఆఫ్ హైడెల్ బెర్గ్,జర్మనీ) అనే శాస్త్ర వేత్తలు ప్రకృతిలోని మూలకాల స్పెక్ట్రల్ లైన్స్ గురించి అధ్యయనం చేస్తున్నారు. ఒకసారి మాన్ హీమ్ పట్టణంలో ఒక ఆగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ చెలరేగిన మంటల మీదకు వాళ్లు తమ స్పెక్ట్రోస్కోప్ లను సరదాగా మళ్లించి మంటలను పరిశీలించారు. ఇందులో స్ట్రాన్సియమ్ , బేరియమ్ స్పెక్ట్రమ్ కనిపించింది అంటే బిల్డింగులో ఈ పదార్థాలున్నాయని లెక్క. దీనినిబట్టి వారు సూర్యుని వెలుతురు స్పెక్ట్రమ్ ను పరిశీలించి సూర్యునిలో ఉండే మూలకాలమిటో కనుగొనవచ్చని అనుకున్నారు. దీనికి ముందు శాస్త్రవేత్తలు మరొక విషయం కనుగొన్నారు. ప్రతి మూలకం వేడిగా ఉన్నపుడు ఒక రంగును, చల్లగా ఉన్నపుడు నలుపు ను విడుదల చేస్తాయి. వేడి మీద విడుదల చేసే స్పెక్ట్రమ్ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు సోడియం పసుపు పచ్చ రంగుని విడుదల చేస్తే కాపర్ బ్లూ గ్రీన్ రంగుని విడుదల చేస్తుంది. అప్పటికే భూమ్మీద దొరికిన మూలకాల స్పెక్ట్రమ్ ను తయారుచేసి ఉంచారు. అందుకే పోగ్సన్ కు కనిపించిన కొత్త లైన్ రంగు (ఆరంజ్) ఈ జాబితాలో లేదు. అందువల్ల ఇది కేవలం సూర్యునిలో మాత్రమే ఉందని హీలియం అని పేరు పెట్టారు. అదీ సంగతి. అప్పటినుంచి సూదూర విశ్వంలో ఏముందో కనుగొనేందుకు స్పెక్ట్రమ్ ద్వారా వెదకడం మొదలు పెట్టారు. ఇక్కడే యాస్ట్రో ఫిజిక్స్ మొదలయింది.
(మీకీ స్టోరీ నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి)