గూగుల్ సెర్చ్ లేక పోతే జీవితం స్తంభించి పోతుంది.
ఎమడిగినా, ఎపుడడిగినా, ఎన్ని సార్లడిగినా లేదని చెప్పకుండా విసుగు విరామం లేకుండా అడిన ప్రశ్నకు ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో సమాధానాలందించేది గూగుల్ సెర్చ్ ఇంజిన్.
గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు అంత మంత్ర శక్తి నిచ్చింది బెంగుళూరుకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్… అంటే నమ్ముతారా?
అవును నిజం.
ఇపుడాయన అడిగిన పదాలను బట్టి కాదు, మీ మనుసులో ఏముందో కనిపెట్టి వాటికి తగ్గట్టు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
రోజురోజుకు పెరిగిపోతున్న ఆన్ లైన్ కంటెంట్ లో మీకు అవసరమయినది వెదుక్కునేందుకు గూగుల్ ఒక ఆల్గోరిథమ్ తయారుచేసింది. అపుడు గూగుల్ ఎన్నిరకాలుగా మారిపోతున్నదో చెప్పలేం.
మీకు కా వలసింది స్పష్టంగాఅడిగినా అస్పష్టంగా అడిగినా గూగుల్ మీరు అడిగిన పదాలను బట్టి సమాచారాన్ని పట్టుకొచ్చి మీ ముందు పడేస్తుంది. అంతే కాదు, మీరడిగిన ప్రశ్న ప్రకారం తను పట్టుకొచ్చిన సమాచారంలో ఏదేది ఎంత మేరకు దగ్గరగా ఉందో ర్యాంకింగ్ కూడా ఇస్తుంది.
*గూగుల్ సెర్చ్ స్టాటిస్టిక్స్ చూస్తే కళ్లు తిరిగిపోతాయి.
*సెర్చ్ ఇంజిన్ మార్కెట్ షేర్ లో గూగుల్ వాటా 90.46 శాతం.
*గూగుల్ సెర్చ్ కోసం వచ్చిన వాటిలో ఎక్కడా సెర్చ్ చేయనివి 15 శాతం కొత్త వి, అంతకు ముందు ఎక్కడా ఎపుడూ సెర్చ్ చేయనివి.
*గూగుల్ సెకన్ కి 63 వేల సెర్చెస్ చేస్తుంది. అంటే నిమిషానికి 3.8మిలియన్ సెర్చెస్, 228 మిలియన్ , గంటకి సెర్చెస్…ఏడాదికి 2 ట్రిలియన్ సెర్చెస్.
*గూగుల్ మార్కెట్ విలువ 739 బిలియన్ డాలర్లు.
*ప్రతి రోజు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మనిషి కనీసం 3 లేదా 4 సార్లయిన ఏదో ఒకటి సెర్చ్ చేస్తుంటాడు సగటున.
*మీరడిగిన దాన్ని అందించే ముందు గూగుల్ 200 అంశాలను పరిగణనలోనికి తీసుకుంటుంది.
*2017లో గూగుల్ ప్రకటనల ద్వారా వచ్చిన రాబడి 95.4 బిలియన్ డాలర్లు. అది 2016 కంటే 25 శాతం ఎక్కువ.
గూగుల్ ఇంతవరకు మీరు టైప్ చేసే ఇంగ్లీష్ పదాలను బట్టి సెర్చ్ రిజల్ట్స్ ను పట్టుకొచ్చి మీ ముందు కుప్పపోస్తుంది. అయితే సాధారణంగా గూగుల్ అని అడిగే క్వెరి పదాలన్నీ ఇంగ్లీషువే అయి ఉంటాయి.
ఇంగ్లీష్ లో సెర్చ్ చేయాల్సి వచ్చినపుడు భాష రాని వాళ్లకు చాలా సమస్యలుంటాయి. స్పెలింగ్ తప్పు కావచ్చు. మనసులో ఉన్నదానికి ధీటైన ఇంగ్లీష్ మాట దొరక్కపోవచ్చు. అపుడు సెర్చ్ ఫలితం సరిగ్గారాదు.
సరైన సెర్చ్ పదం వాడకపోతే మీరునుకున్నది రాదు. అందువల్ల గూగుల్ మీ ప్రశ్నలను కరెక్టుగా అడిగే కొత్త మార్గాన్ని అన్వేషిస్తూ ఉంది.
ఇంగ్లీష్ వాళ్లు వాడినట్లు ఇంగ్లీషేతరులు ప్రశ్నలు వేయలేరు. ఉదాహరణకు టైర్ మార్చాలనుకుందాం. దీనికి ఇంగ్లీష్ వాళ్లు tyre replacement అంటారు. మిగతావాళ్లంతా Tyre change చేయాలంటారు. ఇలాగే కరెన్సీ వ్యవహారానికి వచ్చినా డాలర్లను రుపాయల్లోకి మార్చుకోవాలని (change) కొందరంటారు.కరెక్టుగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్లు కన్వర్ట్ (Convert) చేసుకోవాలంటారు.
Replacement, change, conversion పదాలు మారితే, సెర్చ్ ఫలితాలు కూడా మారిపోతాయి.
అందువల్ల ఇంగ్లీష్ తెలియని వాళ్లు తప్పుగా టైప్ చేసినా, సందర్భాన్ని (Context)ని గుర్తించి మీ ప్రశ్నకు సరైన పదాలు అందించి ప్రశ్నను సరిచేస్తుంది.
గూగుల్ ఇక ముందు మీరడిగిన పదాల మీద మాత్రమే అధార పడకుండా, మీరడిన మాటల అధారంగా మీ మనుసులో ఏముందో అంటే మీరేం వెదకాలకుంటున్నారో పసిగట్టి ఫలితాలను పట్టకొస్తుంది.
ఇది కూడా చదవండి
అభినందన్ వర్థమాన్ పాక్ సైన్యానికి ఎలా చిక్కాడో తెలుసా? హిందూస్తాన్ టైమ్స్ కథనం
గూగుల్ మరొక సమస్య గురించి ఆలోచిస్తూ ఉంది. మీరడిగే ప్రశ్నలకు గూగు ల్ సరైన సమాధానం చెప్పడం లేదు ఉదాహరణకు Who is the Prime Minister of India అనే ప్రశ్నకు గూగుల్ సూటిగా సమాధానం చెప్పలేదు. చెప్పకుండా ఏం చేసింది, ఈప్రశ్నలో ఉన్న పదాల అధారంగా 29,10,00,000 రెస్పాన్సెస్ ను పట్టుకొచ్చింది. ఇలాంటి సమస్యకు కూడా గూగుల్ పరిష్కారం కనుగొనాలనుకుంటున్నది.
మిషన్ లర్నింగ్, అర్టిపిషల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ నెట్ వర్క్ అధారంగా మీ భాషను బాగా అర్థం చేసుకునేలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నారు.
కొసమెరుపు: బెన్ గోమ్స్
గూగుల్ అంటేనె సెర్చ్. సెర్చ్ అంటే ఒక మంత్ర శక్తిలాంటిది. మీరేదడిగినా ఇచ్చే దేవత లాంటి సెర్చ్ ఇంజన్. గూగుల్ కు ఈ శక్తి ప్రసాందించిందెవనుకుంటున్నారు- ఒక భారతీయ కంప్యూటర్ ఇంజినీర్. ఆయన పేరు బెన్ గోమ్స్ (Ben Gomes).
ఇపుడు గూగుల్ లో సీనియర్ వైస్ ప్రెశిడెంట్. గోవాకు చెందిన కుటుంబంలో బెన్ గోమ్స్ టాంజానియాలో జన్మించారు.అయినా ఆయన చదువుకున్నదంతా బెంగుళూరులోనే. ఆయన తండ్రి టాంజానియాలో పని చేసేవారు.బెన్ కంప్యూటర్ సైన్స్ లో అమెరికాలో పిహెచ్ డి చేశారు. మొదట సన్ మైక్రోసిస్టమ్స్ లో కొద్ది కాలం పని చేశాక 1999లో కంపెనీ ప్రారంభమయిన కొన్ని నెలల్లోనే గూగుల్ లో చేరారు. గత ఏడాది కంపెనీ సీనియర్ వైస్ ప్రెశిడెంట్ అయ్యారు.
నిజానికి గూగుల్ సెర్చ్ అంటేనే బెన్ గోమ్స్.గూగుల్ లో సెర్చ్ చేసేందుకు మీరు ప్రశ్నని టైప్ చేస్తున్నపుడు అటోమేటిక్ గా గూగులే కొన్ని సూచనలు చేస్తుంది. ఇదంతా బెన్ గోమ్స్ సృష్టే.
సెర్చ్ ఇంజిన్ కు, దానిని వాడే వ్యక్తికి ఉండే అనుబంధమే గూగుల్ అంటే. వీరిద్దరి మధ్య మంచి అవగాహన కుదిరించి, వినియోగం దారుడి మనుషులోని మర్మం కనుగొనే పనిని గూగుల్ సంస్థాపకుడు లారీ పేజ్ , సెర్గీ బ్రిన్ లు బెన్ గోమ్స్ కు అప్పగించారు.
గూగల్ వినియోగదారులను నడిపిస్తూంటే, గూగుల్ సెర్చ్ ని నడిపిస్తున్నది బెన్ గోమ్స్.ఆయనకు చిన్నపుడు సైన్స్ పట్ల మక్కువ కలిగేందుకు కారణం సెయింట్ జోసెఫ్ బాయ్స్ స్కూల్లో కెమిస్ట్రీ బోధించిన టీచర్ చటర్జీ అని ఆయన అడిగిన వాళ్లందరికి చెబుతుంటారు.మొదట్లో కెమిస్ట్రీమీద మక్కువ వున్నా, తర్వాత స్కూల్ చదువు అయిపోయేటప్పటకి ఆయన ప్రోగ్రామింగ్ వైపు మళ్లాడు.
బెన్ గోమ్స్ (Ben Gomes) అని గూగుల్ లో సెర్చ్ చేస్తే 0.61 సెకన్ లో 5,12,00,000 రిజల్ట్స్ వచ్చాయి. అంటే బెన్ గోమ్స్ రెండు పదాలు నెట్ లో ఎంత వ్యాపించాయో చూడండి
ఇది కూడా చదవండి
ఆగస్టు 15, 1947: స్వాతంత్య్ర దినానికి ముహూర్తం పెట్టిందెవరు?