శ్రీను వైట్ల చిత్రం టైటిల్ లోగో విడుదల,అది మాత్రం సీక్రెట్

దర్శకుడు శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్‌లో మరో సినిమా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `ఢీ` సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.గత కొంత కాలంగా ఇద్దరూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నరు.
ఈ నేపధ్యంలో తమ సూపర్ హిట్ కి సీక్వెల్ అయితే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారు.  ఈ సినిమాకు `డబుల్‌ డోస్‌` (ఢీఢీ) అనే టైటిల్‌ను నిర్ణయించి  టైటిల్ లోగోను విడుదల చేశాడు.
పెద్దన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని పేర్కొన్నాడు. `24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ` బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
అయితే ఢీ సినిమాలో శ్రీహరి మరో కీలకమైన పాత్రను పోషించారు. ఇప్పుడు ఆ పాత్రను పోషించేది ఎవరనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.
దర్శకుడుగా శ్రీను వైట్ల…ఏ స్దాయికి వెళ్లారో అందరికీ తెలిసిందే. చాలా కాలం పాటు సక్సెస్ కు చిరునామాగా వెలిగారు. కామెడీ సినిమాలంటే శ్రీను వైట్లే చేయాలనే నిర్ణయానికి స్టార్స్ వచ్చే స్దాయికి వచ్చారు. అయితే కాలం తిరగబడింది.
తను మొదలెట్టిన ఫార్ములానే రొటీన్ గా మారి వరస ఫ్లాఫ్ ల వర్షం కురిపించేసింది. దానినుంచి కోలుకుందామని చేసిన ఏ సినిమా ఆడలేదు. రవితేజ తో చేసిన అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్ తర్వాత ఆయన గ్యాప్ తీసుకున్నారు.
అయితే ఇప్పుడు ఓ మరో హిలేరియస్ ఎంటర్టైనర్ రెడీ చేసుకుని రంగంలోకి దూకబోతున్నట్లు సమాచారం. అయితే శ్రీను వైట్లకు డేట్స్ ఇచ్చే హీరో ఎవరు. ఇంకెవరు మంచు విష్ణు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఖరారు చేసారు విష్ణు.
దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్‌లో  ‘ఢీ’ సినిమా ఒక కుదుపు. అప్పటిదాకా సాదా సీదాగా నడిచిన కెరీర్ ఒక్కసారిగా జెట్ స్పీడుని ఢీతో అందుకుంది. ఆ సినిమా  శ్రీను వైట్లని పూర్తి బిజీ చేసేసింది. అలాగే 2007లో వచ్చిన ఈ సినిమా మంచు విష్ణు కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే, 13 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోంది.
‘‘కొన్ని వేల మంది సినీ ప్రేమికులకు ‘ఢీ’ ఒక ఫేవరేట్ ఫిలిం. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్, క్రూ అందరి జీవితాలు మారిపోయాయి.
ఆ సమయంలో సినిమాల్లో కొత్త ఒరవడికి ఈ చిత్రం కారణమైంది. ‘ఢీ’ కంటే గొప్పగా ఏం తీయగలం?’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *