FLASH… FLASH 3 రోజుల ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా, మోదీ కర్నాటక డ్రామా ఫెయిల్

కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం ఫెయిలంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలలో 104 సీట్లు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన బిజెపి ముఖ్యమంత్రి యడ్యూరప్ప సభలో బలపరీక్షకు నిలువ లేక పోయారు. ఈ మధ్యాహ్నం 3.30కు సభ సమావేశమయింది. ప్రోటెం స్పీకర్ బోపయ్య సభను ప్రారంభించారు. తర్వాత బలనిరూపణకు ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అవకాశమిచ్చారు.  అయితే, సభలో తనకు బలం లేదని అంగీకరిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు యడ్డీ ప్రకటించారు. తాను రాజ్ భవన్ వెళ్లుతున్నట్లు ప్రకటించారు. సభ వాయిదా పడింది.

మూడు రోజులు సీఎం గా ఉన్న యడ్యూరప్ప…..కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలయిందని, బిజెపి కి ప్రజలు తీర్పు ఇచ్చారని, తాను ఎంతో సేవ చేయాలనుకున్నానని చెబుతూ ఉద్వేగ ప్రసంగం చేసి రాజీనామాకి సిద్ధమయ్యారు.

తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం లో విజయం సాధించిన కాంగ్రెస్ ,జెడిఎస్ పార్టీలు. గాలి జనార్ధన్ రెడ్డి గనులరారాజుల వున్నా కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను కొనలేక పోయారు. అంతేకాదు, వారి వ్యూహాలన్నింటికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బయటపెడుతూ వచ్చింది. ఢిల్లీ నుంచి మోదీ, అమిత్ షాలు కర్నాటక నాటకాన్ని తుదవరకు నడిపించలేకపోయారు.

ఈ రోజు అసెంబ్లీ సమావేశాలను సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు లైవ్ ప్రసారం చేసి ఎలాంటి అవకతవకలు జరుగకుండా కట్టుదిట్టం చేశారు.

యడ్యూరప్ప ప్రసంగం విశేషాలు

నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని మోడీగారు అమిత్ షా గారు ప్రకటించారు.సాధారణంగా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు. అయితే, నా విషయంలో బిజెపి భిన్నంగా ప్రవర్తించి గౌరవించింది.

ఆరోజు నుంచి నేను‌ చిత్తశుద్ధితో అన్ని నియోజక వర్గాలు తిరిగీ అన్ని సమస్యలూ తెలుసుకుని వచ్చాను

నాపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి నా నమస్సులు

రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రేమతో.. మోడీగారి ప్రస్థానాన్ని చూసి ఆదరించి మాకు 104 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు

మాకన్నా తక్కువ సీట్లు ఇవ్వడమే జనం కాంగ్రెస్, జెడిఎస్ లను తిరస్కరించడానికి నిదర్శనం

మా నాన్నమీదొట్టు నేను సీఎం కాను అని కుమారస్వామి అస్తమాను అనడం ప్రజలకు చిరాకు తెప్పించాయి

జనాదేశాలకి విరుద్ధంగా ఈ రెండు పార్టీలు ప్రభుత్వం‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం బాధాకరం

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగొచ్చినా మాకు ప్రజాసేవ చేసుకునే భాగ్యం దక్కకపోవడం మా దురదృష్టం

గత ఐదేళ్ళలో ఇంత మొండి, మొరటు సీఎం తీసుకున్న నిర్ణయాలకు నీరు రాలేదు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు

అది చూసే నేను నా సర్వస్వాన్ని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేద్దామనుకున్నాను

రైతులకు మంచి చేద్దామనుకున్నాను. ప్రజలకు మంచి చేద్దామనుకున్నాను

నేను రాగానే శుద్ధ మంచినీళ్ళు అందిందాం అనుకున్నా

సిద్ధరామయ్య ప్రజలతో కన్నీళ్ళు పెట్టించాడు. నేను అవి తుడుద్దామనుకున్నాను

నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని మోడీగారు అమిత్ షా గారు ప్రకటించారు

ఎన్నో ఆందోళనలు, పోరాటాలు చేశాం. కానీ సిద్ధరామయ్య ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదు

ఆరోజు నుంచి నేను‌ చిత్తశుద్ధితో అన్ని నియోజక వర్గాలు తిరిగీ అన్ని సమస్యలూ తెలుసుకుని వచ్చాను

నా కడ ఊపిరి వరకూ నా రైతులు, నా ప్రజలు గర్వంగా ఆనందంగా బ్రతకడానికి అంకితం చేస్తున్నాను

మొన్న రాగానే లక్షన్నర లోపు రైతు అప్పులను రుణమాఫీ ద్వారా తీర్చేశాను. ప్రయత్నం వృధా అయిపోయింది

ప్రజలు నెమ్మదిగా జీవించాలి.‌ రైతులు ఆనందంగా ఉండాలి.

నాపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి న నమస్సులు

రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రేమతో.. మోడీగారి ప్రస్థానాన్ని చూసి ఆదరించి మాకు 104 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *