చంద్రబాబూ, ఎక్కడ, ప్లీజ్ ఒక్కసారి కనిపించవూ…

గత 12 రోజులుగా సీఎం చంద్రబాబు పేరు పత్రికల్లో తెగ కనబడుతూ ఉంది. టివిలో దద్దరిల్లి పోతూ ఉంది. ఆయన కేంద్రం మీద ఆగ్రహం వ్యక్తం చేశాడని, బడ్జెట్ మీద అసంతృప్తితో మండిపడుతున్నారని ఒకటే గోల.  రాష్ట్రానికి న్యాయం జరిగే దాకా లోక్ సభ, రాజ్యసభ వెల్ లోనుంచి బయటకు రావద్దని, ‘పోరాటం’ సాగించాలని, తాడో పేడో తేల్చాలని అదేశాలు ఇచ్చారని పత్రికల్లో రాస్తున్నారు. టివిలో చెబుతున్నారు.  బిజెపితో ఇక తెంచుకుంటాడని, ఇందులో భాగంగా ఆయన మొదట ఇద్దరు మంత్రులను కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు లాగేసి ప్రధాని మోదీని క్రైసిస్ లోకి నెడతారని ఒకటే ఉహాగానాలు. ఇంత ప్లాన్ తో ఉన్నా ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి అంటే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటినుంచి  ఆయన టివిలో ఒక్క సారి కూడా ఈ అసంతృప్తి, ఆగ్రహం ప్రదర్శించలేదు. ఒక్క సారి కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏమిటో చెప్పనేలేదు. బడ్జెట్ లో ఏమిలేదో, ఆయనేమి కావాలనుకుంటున్నారో వివరించనేలేదు. అందుకే ప్రతిపక్ష వైసిసి పార్టీ , బాబు, చంద్రబాబూ, ఒకసారి కనిపించి, ఈ అసంతృప్తి ఆగ్రహం ఎందుకోవివరించవూ  అని అడుతున్నారు.

మనిషి కనబడటం లేదు, ఆయన గొంతు వినబడడం లేదని వైసిపి నేత జోగి రమేష్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  ఆయన ఆందోళన ఎందుకంటే…

** రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే స్పందించాల్సిన చంద్రబాబు ఎందుకు మీడియా, ప్రజల ముందుకు రావడం లేదు?

** టీవీ లో లీక్ లు ఇస్తున్నారు కానీ ఆయన తెర ముందుకు రావట్లేదు, భయమెందుకు?

** 12 రోజులుగా చంద్రబాబు ఎక్కడ అని ప్రజలు వెతుకుతున్నారు

** బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా, టీడీపీ ఎంపీలు సిగ్గు లేకుండా సన్మానాలు చేయించుకుంటున్నారు

** పార్లమెంట్ ముందు పగటి వేషగాళ్ల మాదిరి వేషాలు వేశారు, వీరికి నంది అవార్డులు, చంద్రబాబు కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

**  రాష్ట్రానికి ఏం సాధించారు అని ఊరేగింపులు, సన్మానాలు

** చంద్రబాబూ ఎందుకు బయపడుతున్నావ్, మోడీ జైల్లో వేస్తాడు అని భయమా

**టీడీపీ ఎంపీలను గాడిదలపై ఊరేగించి చీపుర్లతో సన్మానించాలి

**టీడీపీ ఎంపీలను ప్రతి నియోజకవర్గంలో నిలదీయాలి

**చంద్రబాబు ఇకనైనా బయటికి రా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *