“‘సి.ఎం.పి.ఎఫ్” డబ్బుల లెక్కలు చెప్పడానికి మీకేం కష్టమైతుంది?

తల్లి కడుపు లాంటి సింగరేణి బొగ్గు బాయిలల్లో  పని చేస్తున్న కార్మికులు  రోజుకు దాదాపు “‘ రెండు లక్షల టన్నుల “” బొగ్గును వెలికి తీస్తున్నారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి కొద్దిగా తక్కువైతే వెంటనే రివ్యూ మీటింగ్ లు జరుగుతాయి. మరుసటి రోజు నుండి పనులు చేయాలని , కార్మికులను ఒత్తిడి చేయడము , పురమాయించడము జరుగుతుంది.

కార్మికులు ఉద్యోగులు నెలలో 1 వ తారీకు నుండి 30. లేదా 31 వరకు వరకు డ్యూటీలు చేస్తారు. నైట్ షిప్ట్ డ్యూటీనైతే మరుసటి రోజు ఉదయం 7/ఏడు గంటల వరకు అంటే ?? పస్ట్  తారీకు నాటి ఉదయం ఏడు గంటల  వరకు  డ్యూటీ చేస్తారు. కార్మికుల,ఉద్యోగుల జీతము చిట్టీలు/ వేతనా జాబితాలు మూడో తారీకున ఉదయం 11 గంటల వరకు  ఇస్తారు.

కాని సి.ఎం.పి.ఎఫ్ డబ్బుల లెక్కల చిట్టీలను ఎప్పుడూ లేట్ గానే ఇస్తున్నారు. మార్చి 31 — 2017 వరకే సి.ఎం.పి.ఎఫ్ డబ్బుల వివరాల జాబితాను ఇచ్చినారు. ఇంకా ఏప్రిల్ 1–2017 నుండి మార్చి 31 — 2018 వరకు డబ్బుల వివరాల చిట్టీలను ఇవ్వవలసి ఉన్నది. ఇంకో మూడు నెలలు గడుస్తే 2018—- 2019 ఆర్ధిక సంవత్సరం బాపతు సి.ఎం.పి.ఎఫ్ డబ్బుల వివరాలను తెలియచేసే చిట్టీలను ఇవ్వాలి. కాని  ఇప్పటి వరకు ఇవ్వలేదు.

సింగరేణి బొగ్గు గని కార్మికుల, ఉద్యోగుల భవిష్య నిధి/ సి.ఎం.పి.ఎఫ్ డబ్బుల వివరాలను  మరియు సి.ఎం.పి.ఎస్ ( కోల్ మైన్శ్ పెన్శన్ స్కీం ) లెక్కలను చూడడానికి, సకాలములో సక్రమముగా ఇవ్వడానికి హైదరాబాద్ లో ఒక ఆపీస్, కొత్తగూడెం లో ఒక ఆపీస్ , గోదావారిఖని లో ఒక ఆపీస్ ఉంటుంది. ఇందులో రీజనల్ కమీషనర్ లు ,అసిస్టెంట్ కమీషనర్ లు ఉంటారు. ఇంకా సిబ్బందితో పాటుగా సకల సౌకర్యాలు కలగి ఊంటాయి. కాని సి.ఎం.పి.ఎఫ్ జాబితాలను సకాలములో సింగరేణి కార్మికులకు ఉద్యోగులకు ఇవ్వడము లేదు.

కొల్ కత్తాలో  తేది25/6/2015 జరిగిన ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ లో తీర్మానించిన ప్రయోజనాలను కూడా కార్మికులకు ఉద్యోగులకు వర్తింపచేయలేదు.ప్రతి కార్మికుడి/ ఉద్యోగి సి.ఎం.పి.ఎఫ్.డబ్బుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయలేదు. భవిష్య నిధి డబ్బులపై నెలవారిగా వడ్డీని చెల్లించడము లేదు.  సి.ఎం.పి.ఎస్ డబ్బుల వివరాల ను రాతపూర్వకముగా ఇంకా తెలుపలేదు.

కాబట్టి —+++ సి.ఎం.పి.ఎఫ్ రీజనల్ కమీషనర్ లు చొరవచూపి సింగరేణి కార్మికులకు ఉద్యోగులకు సకాలములో డబ్బుల వివరాల జాబితాలను ఇవ్వాలని , నెల వారీగా వడ్డీని చెల్లించాలని కోరుచున్నాము.

మెరుగు రాజయ్య

సింగరేణి ఉద్యోగ సంఘ నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *