ముందస్తు వేళ టిఆర్ఎస్ కు బిగ్ షాక్

జాతక ఫలాలు అద్భుతం.. సంఖ్యాశాస్త్రం అమోఘం.. సర్వే ఫలితాలు కిరాక్.. అందుకే గులాబీ దళపతి  కేసీఆర్  సమర భేరి మోగించారు.

2018లో ఎన్నికలు జరిగితే ఎదురే లేదని నమ్మారు కేసీఆర్. క్యాలెండర్ లో తేదీ మారితే పదవీ గండం తప్పదేమో అని అసెంబ్లీ రద్దు చేసుకున్నారు.

తెలంగాణ వచ్చినా ఆశించిన రీతిలో ఉద్యోగాల నియామకం జరగలేదు. దీనితో లక్షల మంది నిరుద్యోగులు టిఆర్ఎస్ మీద మంట తో ఉన్నారు. ఉద్యోగులు సైతం కాక మీదున్నారు. కౌలు రైతులు భగభగ మండుతున్నారు.

ఈ పరిస్థితుల్లో గులాబీ నేతలకు ఏదో ఒక మూల అనుమానం షురూ అయింది.  గెలుస్తామా.. బోర్లా పడతామా అని. సరిగా ఇదే సమయంలో సర్వే కింగ్ గా పేరొందిన లగడపాటి గులాబీ పార్టీ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.

తెలంగాణలో లగడపాటి తాజా సర్వే ఫలితాలు ఇవే అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నది. వైరల్ గా మారిన లగడపాటి సర్వే రిపోర్ట్ కింద ఉంది చూడండి.

వైరల్ గా మారిన లగడపాటి సర్వే ఇదే

లగడపాటి సర్వేలు ఇప్పటి వరకు ఇంచుమించుగా వాస్తవికతను చెప్పాయి. ఆయన సర్వే కు మంచి రేటింగ్ ఉంది. ఇప్పుడు లగడపాటి సర్వే ప్రకారం గులాబీ పార్టీ బొక్కబోర్ల పడటము ఖాయంగా కనబడుతుంది.

ఈ సర్వేలో టిఆర్ఎస్ కు జస్ట్ 39 సీట్లు, కాంగ్రెస్ కు 61 సీట్లు వస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉండగా మేజిక్ ఫిగర్ 60 వస్తే చాలు. అయినా కాంగ్రెస్ కు ఒకటి ఎక్కువే వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయంగా చెబుతున్నది లగడపాటి సర్వే.

లగడపాటి సర్వే పై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అది అసలు లగడపాటి సర్వే కానే కాదు.. ఫేక్ సర్వే అని టిఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నయి.

అది నిజంగా లగడపాటి సర్వే నే అని విపక్షాలు చెబుతున్నాయి. ఆ సర్వే పై ఇప్పటివరకు లగడపాటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక అది నిజంగా లగడపాటి సర్వే అయితే మాత్రం దాన్ని నమ్మాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో టీఆరెస్ అధికారంలోకి వస్తుంది అని లగడపాటి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి సర్వే ఇలా ఉంది.

లగడపాటి సర్వే పై టీఆరెస్ నేత మహబూబ్ నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. లగడపాటి తెలంగాణలో సర్వే చేయడమేంటి అని మండిపడ్డారు. కావాలంటే ఆయన ఆంధ్రాలో సర్వే చేసుకోవాలి అని చురకులు అంటించ్చారు.

శ్రీనివాస్ గౌడ్ మాటలు చూస్తుంటే లగడపాటి సర్వే నిజమే అని టిఆర్ఎస్ అంగీకరించింది అని తేలిపోయింది అని చెప్పవచ్చు. లగడపాటి తెలంగాణలో సర్వే చేయడమేంటి అని ప్రశ్న వేసిండంటే ఆ సర్వే నిజమైనదే అని చెప్పకనే చెప్పారు.

మొత్తానికి 100 సీట్లు గ్యారెంటీ 80 కి తగ్గవు అని ఉహలోకంలో విహరిస్తున్న గులాబి పెద్దలకు ఈ సర్వే గుబులు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు పై తొందరపడ్డమా అని ఆ పార్టీలో అంతర్మథనం షురూ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *