భర్తకి డ్రగ్స్-మరిదితో రొమాన్స్, గిల్టీ ఫీలింగ్ లో హీరోయిన్ సంగీత

ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం మూవీలో నటించి తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సంగీత. ఈమధ్య తెలుగు సినిమాలలో కనిపించటం లేదు. తమిళ, మలయాళ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ కొనసాగిస్తోంది. తాజాగా తాను నటించిన ఓ వివాదాస్పద చిత్రంపై స్పందించింది. తనకి ఇష్టం లేకుండానే ఉయుర్ అనే తమిళ చిత్రంలో నటించాల్సి వచ్చిందట. కానీ తాను ఇప్పటి వరకు నటించిన సినిమాలకంటే అందులో చేసిన పాత్రే ఎక్కువ పేరు తెచ్చిందని చెప్పుకొచ్చింది.

ఉయుర్ సినిమాలో తండి ఒక బోల్డ్ క్యారెక్టర్. భర్తకి డ్రగ్స్ ఇచ్చి మరిదితో రొమాన్స్ చేసే ఓ మహిళ పాత్ర. ఈ క్యారెక్టర్ చేస్తానో లేదో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అలాంటి ఓ కేసు గురించి తనకి చెప్పారట. మంచి ఉద్దేశంతో ప్రేక్షకులకు అవగాహన కల్పించే ఇలాంటి పాత్రలు చేయమని సూచించటంతో సినిమాలో నటించటానికి ఒప్పుకుందట.

అయితే దర్శక, నిర్మాతలకు ముందుగానే ఎక్స్‌పోజ్ చేయనని, అసభ్యకర సన్నివేశాలలో నటించనని చెప్తే వారు అంగీకరించారు. కానీ సినిమా మొదలయ్యాక నిర్మాతలు కాస్త ఎక్స్‌పోజ్ చేయమని కోరారు అందుకు సంగత ఒప్పుకోకపోవడంతో కొన్ని విభేదాలు వచ్చాయి. ఆ సినిమా మొత్తం వివాదాలతో నడిచింది. ఎందుకు ఈ మూవీ ఒప్పుకున్నానో అనిపించేది. చివరికి ఎలాగోలా ఆ సినిమా పూర్తి అయ్యింది. కానీ అయిష్టంతో చేసిన ఆ పాత్రకే మంచి గుర్తింపు వచ్చిందని చెప్పింది.

తర్వాత సినిమా చూడటానికి తల్లితో కలిసి థియేటర్ కి వెళ్లిన సంగీతకి చాలా ఇబ్బందిగా అనిపించిందట. మరిదితో రొమాన్స్ చేసే సీన్స్ నచ్చలేదు తనకి. నేనేనా ఇలా చేసింది అని సినిమా పూర్తి అవకుండానే బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ మా అమ్మ బలవంతంతో మొత్తం సినిమా చూడాల్సి వచ్చిందని చెప్పింది సీనియర్ నటీమణి సంగీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *