జనగామ రోడ్డు ప్రమాదంలో యాంకర్ లోబోకు గాయాలు (వీడియో)

ప్రముఖ టివి యాంకర్, విచిత్రమైన వేషధారణతో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న లోబో (మహ్మద్ కయీమ్) కు జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి.

కారులో లోబో ప్రయాణిస్తున్న క్రమంలో ఆటో, కార్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లోబోకు స్వల్ప గాయాలు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన లోబో వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *