చిక్కు ముడి వీడింది, జిమ్మాస్టిక్స్ పిడుగులిద్దరు దొరికారు!

లక్షలాది మంది ట్విట్టరులచేత, 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ జిమ్మాస్టిక్స్ బంగారు ‘లేడి’ చేత చప్పట్లు కొట్టించుకున్నజిమ్మాస్టిక్స్ చిచ్చర పిడుగులిద్దరు కనిపించారు.
వారిద్దరు కలకత్తాకు చెందిన విద్యార్థులని మొదట వారి వీడియోని ట్వీట్ చేసిన డాక్టర్ ఎమ్ వి రావు (IAS, 1988, WB) మళ్లీ ట్వీట్ చేశారు.
అద్భుతంగా రోడ్డు మీద జిమ్మాస్టిక్ విన్యాసం చేసిన అమ్మాయి పేరు లవ్ లీ, అబ్బాయి పేరు అలి.
కలకత్తా గార్డెన్ రీచ్ లోని సంఘమిత్ర విద్యాలయలో ఏడవ తరగతి చదువుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులంతా వారి ఆచూకి కోసం ఆత్రంగా చూస్తున్న నేపథ్యంలోస్కూల్ టీచ రొకరు డాక్టర్ రావ్ కు పోన్ చేసి వాళ్లిద్దరు తమ పాఠశాల పిల్లలని చెప్పారు.
డాక్టర్ రావు పిల్లల ఆచూకి తెలుసుకున్నారు. వారికి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నానని ఆయన ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు చెప్పారు.
డాక్టర్ రావు కలకత్తాలోనే ఉంటారు కాబట్టి ఆ పిల్లల సమస్య తీరిపోతుంది. డాక్టర్ రావ్ టాలెంట్ ఉన్నవారందరికి కొండంత అండ. ఆయనెక్కడ పనిచేసినా ఆక్కడ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ధీమాగా ఉంటారు. వాళ్లలోని కష్టించే స్వభావానికి  తన ఇన్నొవేషన్ జోడించి ఆద్భుతాలు సృష్టించే సామాజిక మాంత్రికుడు డాక్టర్ రావు. లవ్ లీ, అలీలు అభిరుచి ఏమిటో తెలియదు. డాక్టర్ రావు అండలో వాళ్లు నిశ్చింతగా ముందుకుసాగిపోవచ్చు.

నిన్నటి కథ…
ఇద్దరు పిడుగుల కోసం కేంద్ర మంత్రి వేట… మీకు కనబడితే చెప్పండి…
మీకి విషయం తెలుసా, భారత దేశంలో ట్రిట్టరులంతా ఇద్దరు పిల్లలకు కోసం వెదుకుతున్నారు. వాళ్లిద్దరు చిచ్చరపిడుగులు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.ఒక రోజు స్కూలు కు పోతూన్ననపుడో వస్తూన్నపుడో రోడ్డు మీద అద్భుతమయి పల్టీ విన్యాసం చేశారు. దీన్నెవరో పర్ ఫెక్ట్ గా వీడియాతీశారు. దాని క్లిప్పొకటి డాక్టర్ ఎమ్వీ రావ్ అనే తెలుగుఐఎఎస్ ఆఫీసర్ కంట బడింది.
డాక్టర్ టాలెంట్ వెదికిపట్టి సానబట్టి మెరిసేలా చేయడంలో దిట్ట. ఈ తెలుగు ఐఎఎస్ ఆఫీసర్ బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలో ఒక నిశబ్ద విప్లవం తీసుకొస్తున్నారిపుడు. ఆయన వీడియోని సింపుల్ గా ట్విట్లర్లో వదిలేశారు.
అంతే, అది భూమండలమంతా ప్రదక్షిణ చేసింది. వీడియో చూసిన  11 లక్షల మందిలో రుమేనియా ఒలింపిక్ రాణి నాడియా కొమనేచ్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజూ కూడా ఉన్నారు. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ జిమ్మాస్టిక్ విజేత. అపుడే అమెకు పర్ ఫెక్ట్ 10 అని పేరొచ్చింది. ఈ పిల్లల జిమ్మాస్టిక్ స్కిల్ చూసి దిమ్మతిరిగినా నాదియా This is Awesome అని ట్వీట్ చేశారు.
దీనిని కిరెన్ రిజిజూ కూడా చూశారు. అంతే ఆయన వాళ్లని పట్టుకునేందుకు వేట ప్రారంభించండని ఆదేశించారు.
నిజానికి What a perfect picture! Future Gymnasts in Making అని MV Rao ట్వీట్ చేశారు. 24 గంటల్లో ఇది మంత్రి కంటపడింది.ఆగస్టు 16 నుంచి ఈచిచ్చర పడిగుతల కోసం గాలింపు మొదలయిది. ఆగస్టు 29న రుమేనియా ఒలింపిక్ రాణి కొమనేచ్ కంట పడింది.
ఈ పిల్లల్లో టాలెంట్ ముడిసరుకుంది. ఎవరైనా వీళ్లని పట్టుకొని వస్తే వీళ్లని జిమ్మాస్టిక్ అకాడెమీ చేర్పిస్తానని కిరెన్ రిజ్జూ ట్వీట్ చేశారు. దీనితో వీడియో ఇంకా పాపులర్ అయింది. ఇపుడ National Sports Day హ్యాష్ ట్యాగ్ తో తిరుగుతూ ఉంది.
కొమనేచ్ ట్వీట్ చూశాక రిజిజూ మరొక సారి స్పందించారు. నాదియా కొమనేచ్ కూడా ఈ వీడియోకు స్పందించడం చాలా సంతోషంగా ఉంది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ లో పర్ ఫెక్ట్ 10 సాధించారు. తర్వాత మరొక ఆరు ఫర్ ఫెక్ట్ టన్స్ సాధించి మూడు బంగారాలు గెల్చుకున్నారు. ఈపిల్లలను నా దగ్గిరికి తీసుకురండని అందరికి చెప్పానని రిజ్జూ ట్వీట్ చేశారు.