రాత్రికి రాత్రి ‘దేశ్ కి నేత’ అయిపోయిన కెసిఆర్

వెనక ఎం జరిగిందో తెలియదు. ఏం జరగబోతున్నదో తెలియడం లేదు. 24 గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ్ కి నేత అయిపోయారు. నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ధర్డ్ ఫ్రంట్ రావాలన్నారు. బిజెపి,కాంగ్రెసేతర ఫ్రంట్ అన్నారు. అవసరమయితే తానే నాయకత్వం వహిస్తా అన్నారు. అంతే, 24 గంటల్లో హైదరాబాద్ దేశ్ కి నేత కెసిఆర్ నినాదాలతో అట్టుడికిపోయింది. అన్ని జిల్లాలనుంచి వచ్చిన వాహనాలతో బేగంపేట రోడ్లు జామ్ అయిపోయాయి.  మంత్రులు, ఎమ్మెల్యేలు కోటా ప్రకారం జనాన్ని తీసుకు వచ్చారు. ఎవర్ బట్టీ పట్టించినట్లుగా అందరికి ఒక టే స్లోగన్ దేశ్ కి నేత కెసిఆర్ స్లోగన్.  1984లో ఎన్టీఆర్ కేంద్రం మిధ్య అన్నారు. ఇపుడ ఆమాట అనలేదు కాదు కెసిఆర్ రాష్ట్రాలనుంచి కేంద్రాన్ని తరియేమాలని అన్నారు. ఈ రోజు ప్రగతిభవన్ కు తరలి వచ్చిన వేలాది మంది పార్టీ కార్యకర్తుల నుద్దేశించి కెసిఆర్ చేసిన ప్రసంగం ఇది.

పది లక్షల ప్రయాణమైనా, ఒక్క అడుగుతోనే మొదలవుతుందని.. తనను పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల దీవెనలు ఉంటే ఈ దేశానికి ఓ కొత్త దశ దిశ చూపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ‘పరిస్థితులు వచ్చినప్పుడు నాయకుడు పుడతాడు. మార్పునకు నాయకత్వం వహించడానికి నేను సిద్ధమే. దేశంలో కొత్తగా వచ్చేది మూడో కూటమి కాదు. అదే ప్రధాన కూటమి కావచ్చు.’ అంటూ శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం దానికి కొనసాగింపుగా మరింత స్పష్టతనిచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయన తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘భారతదేశం 70 సంవత్సరాల ప్రయాణం సాగించిన తర్వాత ఈ దేశం ఎటు పోతోంది.. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏంటి? అనేవి ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్న కేవలం ఓ నాలుగు మాటలు చేబితే ఉదయం నుంచి భారతదేశం నలుమూలల నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ్‌బంగా నుంచి మమతాబెనర్జీ ఫోన్‌ చేశారు. ‘కేసీఆర్‌ తమ్ముడూ నువ్వు ఏం చెబితే అలాగే ముందుకెళ్దాం’ అన్నారు. ఝార్ఖాండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరన్‌ సైతం మద్దతు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కూడా కొందరు ఎంపీలు ఫోన్‌ చేశారు. దీని బట్టి ఈ దేశంలో కాంగ్రెస్‌, భాజపా నేతృత్వంలో పాలనావ్యవస్థ దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది.’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మనం ఏమన్నా మన్ను తింటున్నామా?
‘‘ఒక్క చిన్న మాట మనం ఆలోచిస్తే.. దేశంలో రైతుల ఆత్మహత్యలు.. 70 ఏళ్ల తర్వాత ఎందుకు జరుగుతున్నాయి. నీళ్లు లేవా? 70వేల టీఎంసీలు ఉన్నాయి. చాలా విషయాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటాలు తేల్చరు. ‘అమెరికాలో అలా ఉంటుంది. జర్మనీలో ఇలా ఉంటుంది’ అని జిందగీ మొత్తం వినాలా.. జర్మనీ వాడు బంగారం తింటున్నాడా? అమెరికా వాడు వెండి తింటున్నాడా? మనం ఏమన్నా మన్ను తింటున్నామా.. ఏం జరుగుతోంది. దేశాన్ని ఎన్ని విధాల విభజన. దేశం అంటే ప్రజలు. ఏ కులం అయితే ఏంటి? ఏ మతం అయితే ఏంటి? అందరూ బాగుండాలి. ప్రజలను వేరు చేసి ప్రజలకు జరగాల్సింది జరగడం లేదు. రాజకీయ ఆటలాడుతున్నారే తప్ప వాస్తవ దృక్పధంతో పనిచేయడం లేదు. నాకు వయసు కూడా సహకరించే పరిస్థితి లేదు. నాకు పనిలేక కాదు. ఏడాదిన్నర పోతే కోటి ఎకరాలు నీరు వస్తుంది. మన బాధ పోతుంది. రాత్రింబవళ్లూ అద్భుతంగా పనిచేస్తున్నారు.’’

హిమాలయాల అవతల వాళ్లు.. ఇవతల మనం

‘‘ఈరోజు దేశం గురించి ఆలోచిస్తే ఏ మారుతుంది. కాంగ్రెస్‌ మీద కోపంతో భాజపాకు ఓటేశాం. ఏం జరిగింది. నాలుగేళ్లలో ఓ రైతులకా.. నిరుద్యోగులకా.. ఎవరికేం జరిగింది. మళ్లీ వీళ్ల మీద కొపమొస్తే వాళ్లొస్తారు. కొత్తగా ఏమన్నా మారుతుందా.. చైనా 24 ఏళ్లలోనే అమెరికా తర్వాత అత్యంత బలమైన దేశంగా రూపొందింది. హిమాలయాల అవతల వాళ్లున్నారు. ఇవతల మనమున్నాం. నిన్న దిల్లీ పోయినప్పుడు కొందరితో మాట్లాడితే చైనాలో అక్కడ కానూన్‌ వేరే ఉంది అన్నారు. నీ కానూన్‌ నువ్వు మార్చుకో. ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో ఇంకొకరో దేశంలో ఏది ఉన్నా ప్రజలకోసమే కదా. సింగపూర్‌లో ఏముంది. వాళ్లు తాగే నీళ్లు కూడా వాళ్లవి కావు.’’

రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తున్నారు!
‘‘జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు కూడా దిల్లీలో డబ్బులు వేసే ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఆరోగ్య విధానం, విద్యా విధానం, వ్యవసాయ విధానం, రాష్ట్రాలకు అప్పగించాలి. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ రాష్ట్రాలకు అప్పగించాలి. దిల్లీలో పెత్తనం పెట్టుకుని చిల్ల మల్లర రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తున్నారు.’’

‘‘కేంద్ర ప్రభుత్వానికి దవాఖాన, మున్సిపల్‌ మోరీల వద్ద ఏం పని? వాళ్లు చేయాల్సిన పని చేయరు. విదేశీ వ్యవస్థ, ఆర్మీ, నేషనల్‌ హైవేస్‌ మీద పనిచేయాలి. ఈ రోజు అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సుప్రీం కోర్టు ఉంటుంది. సిటీ కమిషనర్‌.. నగర మేయర్‌ కింద పనిచేస్తారు. ఎవరి జీడీపి వారికి ఉంటుంది. రాష్ట్రాల మీద పెత్తనం ఉండదు. కానీ, ఈ రోజు రిజర్వేషన్లు ఇవ్వాలి. తెలంగాణలో అధిక శాతం దళితులు, గిరిజనులు, ముస్లింలు ఉన్నారు. ఒకటే దేశం రెండు రాజ్యాంగాలు ఉంటాయా? 85 శాతం రిజర్వేషన్ల ప్రజలకు 50లోపు ఎలా ఇస్తాం. ఎలా సాధ్యమవుతంది? రిజర్వేషన్లు ఎక్కడిస్తాం? కొన్ని రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్నవారు కూడా బాధపడుతున్నారు. ఏదీ తేల్చరు. ఏదీ తెగదు. ఏదీ జరగదు.’’

14ఏళ్ల అయింది!

‘‘మన కృష్ణా, గోదావరి నదీ జలాల నీళ్ల లెక్కలు తేల్చడానికి 2004లో బ్రిజేష్‌ ట్రెబ్యునల్‌ వేశారు. 14 ఏళ్లు అయింది. ఇప్పటికీ తేల్చలేదు. నది నీళ్ల పంపిణీకి 14 ఏళ్లా? లెక్కల్లేవా? గేజ్‌లు లేవా? ఈ దిల్లీనా ప్రజలకు కావాల్సింది. దేశంలో 3.20లక్షల మెగావాట్లు విద్యత్‌ ఉత్పత్తి అవుతోంది. దేశం వాడుకుంటుందా? భారతదేశంలోని కరెంటు భారతీయులు వాడరు. అనేక ప్రవేటు సంస్థలు ఝార్ఖండ్‌లో మూతపెట్టుకున్నారు. రెండో పక్క కొన్ని రాష్ట్రాల్లో చీకట్లు ఉన్నాయి. చేసింది ఏముంది రైతులకు. అందరికీ పెంచుతారు జీతాలు. సబ్బులు, నూనెలు, చక్కెర ధర పెరుగుతుంది. రైతు పండించే ధాన్యం మద్దతు ధర మాత్రం పెరగదు. ఎవరు అవునన్నా కాదన్నా దేశం బతికేది వ్యవసాయం మీద. లెక్కలు చెబుతారు. ఎవరో ఆర్థిక వేత్త జీడీపీ అని చెబుతారు. భారతదేశంలో అదిపెద్దగా ఉన్న జనాభా ఉన్న రైతాంగ సంక్షోభంలో కూరుకుపోతుంటే.. ఇప్పుడు కూడా.. ఏమన్నా మాట్లాడితే జైల్లో పెడతామంటూ బెదిరిస్తున్నారు. జైలుకు భయపడితే కేసీఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడడతాడా? దగా చేసినవాళ్లు, కుంభకోణాలు చేసిన వాళ్లుకు భయం ఉంటుంది. మేం నిటారుగా ఉన్నాం. కొందరిని పట్టుకుంటే భస్మమవుతారు. ఎవరైనా మాట్లాడితే నిందలు వేయడం.. వెటకారం చేయడం కాదు. ఒక పద్ధతిగా మాట్లాడాలి.’’

ఈ దేశ ప్రజానీకానికి తెలంగాణ మార్గదర్శకం  కావాలి

‘‘ఈ దేశ ప్రజానీకానికి ఓ అద్భుతమైన మార్గదర్శనం చూపిస్తాం. ఆ పని ఈ దేశానికి జరిగితే దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. నేను దిల్లీకి వెళ్లాక 12వ పంచవర్ష ప్రణాళికలు అమలైతే వాటిని చదివా. వాస్తవానికి నేను ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి పెద్ద అభిమానిని భూ సంస్కరణ చట్టం తెచ్చి పేదలకు గుడిసెలు వేయించి కొన్ని కార్యక్రమాలు తెస్తే గొప్ప నాయకురాలని పొంగిపోయా. కానీ, పెద్దగా జరగలేదు. దాని తర్వాత రాజీవ్‌గాంధీ వచ్చారు. నేను బాగా ఆశపడ్డా. మోదీగారితో నేను చాలా సార్లు మాట్లాడా. రైతులకు, గిరిజనులకు చేయాలని అడిగాను. తర్వాత వెళ్లినప్పుడు ఫసల్‌బీమా యోజన తెచ్చామని చెప్పారు. అది కూడా బాగాలేదు. ప్రతి ఒక్కరి దగ్గర ప్రీమియం తీసుకుంటారు. పంట పాడైతే మాత్రం డబ్బులు రావు. రైతుల ఆత్మహత్యలు అనే మాట ఎప్పుడు బంద్‌ కావాలి. కనీస మద్దతు ధర రూ.500 పెంచమంటే ఎందుకు పెంచరు. ఇది జరగాలంటే ఈ దేశంలో ఒక మార్పు రావాలి. మార్పు రావాలంటే ఎక్కడో చోట మొదలవ్వాలి. అది తెలంగాణ నుంచే ప్రారంభమైంది. వంద శాతం మనం విజయం సాధిస్తాం. రేపు బ్రహ్మాండమైన పద్ధతిలో దేశం ముందుకెళ్తుంది. కచ్చితంగా మీ ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తాం. ఈ సందర్భంగా మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. త్వరలో ఏకాభిప్రాయం ఉన్న నేతలతో మాట్లాడతా. ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులతో మాట్లాడి ఈ దేశానికి అవసరమైన ఓ చక్కటి ఎజెండా తయారు చేసి ముందుకుపోదాం. ఇప్పటికైనా ఈ రెండు జాతీయ పార్టీలు పంథా మార్చుకోవాలి.’’

ఉపన్యాసాలు, కథలు చెబితే పేదరికం పోదు

‘‘చైనాలో అయినప్పుడు.. మన దగ్గర ఎందుకు కాదు. దేశంలో పేదరికం పోవాలంటే కథలు, ఉపన్యాసాలు చెబితే పోదు. జపాన్‌,చైనా, సింగపూర్‌ ఎలా పైకొచ్చాయో ఈ దేశం కూడా అలా పైకి రావాలి.ధైర్యం, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వందశాతం వచ్చి తీరుతుంది. రైతాంగానికి రూ.8వేల పెట్టుబడి, పారిశ్రామికవేత్తలకు రాయితీ దేశంలో ఎక్కడా ఇవ్వటం లేదు. రైతుల గురించి ఆలోచించే పరిస్థితి రావాలి. అనేక వర్గాల విషయంలో మారాలి.’’

నిజమైన ఫెడరలిజం రావాలి
‘‘నాన్‌ కాంగ్రెస్‌.. నాన్‌ బీజేపీ కూటమి ఏర్పాటు కావాలి. శక్తి తయారు కావాలి. ఈ దేశానికి నిజమైన ఫెడరలిజం రావాలి. అధికారాలు రాష్ట్రానికి అప్పజెప్పి లిమిటెడ్‌ అధికారాలు కేంద్రం వద్ద ఉంటేనే దేశం బాగుపడుతుంది. తెలంగాణలో ప్రారంభమైన ఈ ప్రస్థానం యావద్దేశం చుట్టుముడుతుంది. మీ ఆశీస్సులతో కేసీఆర్‌ వందశాతం విజయసాధిస్తాడని చెబుతూ మీ అందిరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై తెలంగాణ జై భారత్‌ ’’ అంటూ ప్రసంగం ముగించా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *