బెట్టింగ్ కేసు: ఆధారాలుంటే ఏమయినా చేసుకోండి

బెట్టింగ్ కేసు విచారణ తంతు మీద కోటంరెడ్డి సెన్సేషనల్ ప్రకటన

 

త సంవత్సరం ఆగష్టు నెలలో ఒకటికి మూడు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాత్ర, ప్రస్తాపన లేదని స్పష్టంగా జిల్లా ఎస్ పి  ప్రకటించారు. 

పోలీసులు ఎలా వేధిస్తున్నారో వివరిస్తూ ఆయన కంట తడిపెట్టారు. చాలా ఆవేశంగా మాట్లాడుతూ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను ఖండించారు. తన మీద పోలీసుల పెడుతున్న మానసిక వత్తిడి వల్ల కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురవుతున్నారని అంటూ తాను అరెస్టుకు భయపడి అజ్ఞాతంలోకి పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇది అబ్దమని చెబుతూ ఇక తాను విచారణ కు హాజరు కానని ఆయన ఖరా కండిగా చెప్పారు.

వారం రోజులకి విచారణలకు రావాలని ఒకటికి రెండు సార్లు నాకు నోటీసులు జారీ చేశారు. అయినా,   ఈ నోటీసులను గౌరవించి, ప్రజా ప్రతినిధిగా నా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆకాంక్షతో విచారణకు వెళ్లి విచారణకు సహకరించాను. ఈ విషయం అందరికి తెలిసిందే.

విచారణ పేరుతొ నానా యాగీ చేశారు.  ఆ తరువాత ఇప్పటి  వరకు, దాదాపు 8 నెలలు, ఆ విషయం  అతీగతీ లేకుండా పక్కన పడేశారు . ఈ విషయం కూడా అందరికి తెలుసు.

ఇపుడు గత  నాలుగు రోజులుగా మళ్ళీ కొత్త డ్రామాలకు తెర లేపారు.  గత సంవత్సరం మార్చి 22వ తారీఖున మరొక కేసు నమోదు అయిందని,  ఈ విషయంలో నన్ను విచారించాలంటూ  మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది.

 ఇది రాజకీయ వేధింపు కోసం జరుగుతున్న విచారణ తప్ప మరొకటి కాక ఏమవుతుంది?  

అందువల్ల విచారణకు నేను హాజరు కాలేనని చెప్పాను. అంతేకాదు,  నా మీద ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకోవచ్చని నేను తేల్చి చెప్పాల్సి వచ్చింది. అయితే, ఈ నెల 14వ తారీఖున విచారణకు హాజరు కావాలని ఈ రోజు నోటీసులు అందించారు.

ఈ నోటీసులను సైతం తిరస్కరించాను.  రాజకీయ ప్రోద్భలంతో జరుగుతున్న ఈ విచారణని పట్టించుకోనని చెప్పాను.  అలాగని పోలీసుల విచారణనని అడ్డుకునే ప్రయత్నం చేయను. కోర్టుకు వెళ్లి స్టే  తెచుకునేది కూడా లేదు.   ముందస్తు బెయిల్ కూడా  పొందను.  ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను.

 రాజకీయ ప్రోద్బలంతో పోలీసులు పెట్టే అక్రమ కేసులను ప్రజా ఉద్యమాలతో, న్యాయపోరాటాలతో ఎదుర్కొంటానని చెబుతున్నాను.

 రాజ్యసభ ఎన్నికల రాజకీయాలలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం  హైదరాబాద్ వెళ్తున్నాను.  రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్లకి ఆఖరి తేదీ ఈ నెల 12. ఎన్నిక ఏకగ్రీవం అయితే 13వ తారీకు నెల్లూరు వస్తాను. అలా కాకపోతే,  ఫిబ్రవరి 23వ  పోలింగ్ పూర్తయ్యాక  24వ తేదీన కు నెల్లూరు తిరిగొస్తాను. ఈ విషయాన్ని మీడియా ముందు బహిరంగంగా ప్రకటిస్తున్నాను.

అంతేకాదు, నేను ఫోన్లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. క్రికెట్ బెట్టింగ్ కేసులో నా మీద ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకోవచ్చు. మీరు పెట్టే కేసులను ప్రజా ఉద్యమాలతో, న్యాయపోరాటాలతో ఎదుర్కొంటాను. ఇలాంటి కేసులు మరో 100 నమోదు చేసినా అదిరేవాడిని కాదు, బెదిరేవాడిని కాదు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాను.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *