మీడియాను బహిష్కరించిన ముఖ్యమంత్రి

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి మీడియా మీద తెగ కోపమొచ్చింది.

తనకుమారుడు నిఖల్ పోటీచేస్తున్న మండ్యలోక్ సభ ఎన్నికల్లో జెడి ఎస్ కు సరైన రీతిలో కవరేజ్ ఇవ్వలేదని ఆయన నిరాశ చెందారు. దీనికి నిరసనగా తాను మీడియాను బాయ్ కాట్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.

మండ్య లో ఆయన కుమారుడి మీద కర్నాటక రెబెల్ స్టార్ గా పేరున్న అంబీరీష్ భార్య సుమలత పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే. అక్కడ ప్రచారమంతా సుమలత చుట్టే తిరిగింది. దానితో మీడియా ఆమె మీదే ఎక్కువ దృష్టినిలిపింది. ఇది ఏమాత్రం కుమారస్వామికి నచ్చలేదు.

‘నేను మీడియా బాయ్ కాట్ చేయాలని నిర్ణయించాను. ఏంచేస్తారో చేసుకోండి. ఏ రివ్యూ చేసుకుంటారో, ఏం చర్చ పెట్టుకుంటారో మీ ఇష్టం.ఎంజాయ్. నేనయితే మీడియాను బాయ్ కాట్ చేస్తున్నా,’అని ప్రకటించారు.

ఎఐసిసి కర్నాటక ఇన్ చార్జ్ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విశేషాల గురించి వాకబుచేసినపుడు ఆయన ఈ సమాధానం చెప్పారు.

ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి కుమారుడని కూడా చూడకుండా సుమలతకు విపరీతంగా ప్రాముఖ్యం ఇవ్వాడాన్ని ఆయన ఖండిస్తున్నారు. మండ్య నియోజకవర్గంలో మీడియా సమలత పక్ష పాతంతో ఉందని ఆయన విమర్శించారు.
మండ్యలో నిఖిల్ సుమలతనుంచి తీవ్రమయిన పోటీ ఎదుర్కొంటున్నారని, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన సులమతా అంబరీష్ బాగా ముందున్నారనే మేసేజ్ తో మీడియాలో కథనాలు రావడం ఆయనకు నచ్చ లేదు.
అందుకే ఈ కోపం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *