కొడుకుల లోన్ గురించి జూపల్లి ఏమంటున్నారో తెలుసా?

జూపల్లి కొడుకులు ఇపుడేం చేస్తున్నారో తెలుసా?

పెద్దోళ్లు బ్యాంకులోన్ తీసుకుంటారు. అందమయిన,అంతు చిక్కని , అర్థంకాని పేరుతో కంపెనీ తెరుస్తారు. ఎవరో పెద్దాయన పేరు చెబితేనో, ఫోన్ చేస్తేనో బ్యాంకులు పరిగెత్తుకుంటూ లోన్ లిస్తాయి. తర్వాత రెండు జరుగుతాయి- ఒకటి కొద్ది రోజులకి కంపెనీ బోర్డు నుంచి తప్పుకోవడం. ఎదైనా జరిగితే, నాకు కంపెనికి సంబంధం లేదు, నేనెపుడో బోర్డునుంచి తప్పుకున్నా అని బుకాయించడం. రెండో పద్ధతి, బ్యాంకును మళ్లీ   బురిడీ కొట్టించేందుకు వడ్డీ మాఫీ చేయాలని ఇన్ ఫ్లు యన్స్ చేయడం, అంత లోను కట్టలేను, వన్ టైం సెటిల్ మెంట్ చేసుకుంటానని ఎవరో పెద్దాయనతో ఫోన్ చేయించడం, లేదా పలుకుబడి ఉపయోగించడం.

( అసలు లోన కథ ఇక్కడుంది https://trendingtelugunews.com/trs-ministers-sons-default-on-86-crore-sbi-loan/)

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణా రావు కొడుకులు అరుణ్ వరుణ్ ఇపుడు ఇదే పనిలో ఉన్నారు. లోన్ తీసుకుకుని ఎగ్గొట్టారని పత్రికల్లో వచ్చి యాగీ కావడంతో ఇపుడు వాళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఎంటంటే వడ్డీ మాఫీ చేయండి అని బ్యాంకుతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అంతేకాదు, కష్టాల్లో ఉన్నాం, ఒన్ టైం సెటిల్ మెంట్ చేసుకుందాం అంటున్నారు. ఎట్ల తీసుకున్నా వడ్డీ మాఫీ కింద, వన్ టైం సెటిల్ మెంట్ కింద, బ్యాంకు కు బాకీ ఉన్న రు. 86 కోట్ల లో ఒక 10 కోట్ల తగ్గినా … భలే మంచి చౌకబేరమే కదా.

వడ్డీ మాఫీ, వన్ టైం సెటిల్ మెంట్ కోసం అరుణ్  అండ్ వరుణ్ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని స్వయాన మంత్రి జూపల్లి వెల్లడించారు.

ఆయన  విలేకరులతో మాట్లాడుతూ  ఈ విషయం చెప్పారు.

అంతే, కొడుకులకు తనకు సంబంధం లేదని, వాళ్లు స్వతంత్రంగా జీవిస్తున్నారు, నాకు వాళ్ల లోన్ కు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. ( ఇది చాలా పాత చింతపండు పచ్చడి లాంటి వాదన)

లోన్ పేరు చెప్పి నేనెందుకు రాజీనా మా చేయాలని అన్నారు.

‘‘నాకొడుకులు దేశం విడిచిపోలేదు. కంపెనీని వేరేవారికి అమ్మారు. అయినా లోన్ కు తమదే బాధ్యత అన్ని చెప్పారు. వరుణ్ తన వాటా కింద వచ్చిన లోన్ తీర్చేశారు. బ్యాంక్ లోన్ తీరుస్తానని నా కొడుకు బ్యాంక్ కి లెటర్లు ఇచ్చారు. అంతేకాదు, వడ్దీమాఫీ చేయాలని, వన్ సెటిల్ మెంట్ కు ఒప్పుకోవాలని కూడా బ్యాంక్ కు కోరారు. సిబిఐ వాళ్లకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. నాకొడుకుఢిల్లీ వెళ్లి సిబిఐ అధికారులను కలిశాడు. నోటీసు గురించి వాకబు చేశాడు. ఎలాంటి నోటీసుపంప లేదని సిబిఐ వారు చెప్పారు.’’ అని జూపల్లి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *