తెలంగాణలో చీకటి పాలన: జర్నలిస్ట్ నేతల ఆగ్రహం

మేడ్చల్ కలెక్టర్ ఈనాడు జర్నలిస్ట్ అక్రిడేషన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జర్నలిస్ట్ నేతలు ఖండించారు. వారు విడుదల చేసిన ప్రకటన కింద ఉంది…

ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే అక్రెడిటేషన్ రద్దు చేస్తారా?
-జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ అణిచివేత చర్యలను ఖండిస్తున్నాం.
————————————-
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసాడన్న నెపంతో మేడ్చల్ జిల్లా ఈనాడు ప్రతినిధి భానుచందర్ రెడ్డి అక్రెడిటేషన్ కార్డును రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ చర్యను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తీవ్రంగా ఖండిస్తోంది.తెలంగాణలో జర్నలిస్టులపై ప్రభుత్వ అణిచివేత రోజు రోజుకు పెరిగి పోతుందనడానికి ఇటీవలకాలంలో ఇది రెండవ సంఘటన.మొన్న జగిత్యాలలో జర్నలిస్టులపై కేసులు పెట్టారు.ఇవాల మేడ్చల్ లో ఏకంగా జర్నలిస్టు అక్రెడిటేషన్ ను రద్దు చేశారు.జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ అణిచివేత రోజు రోజుకు పెరిగి పోతుంది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను సహించబోమని హెచ్చరిస్తున్నాం. ఈ చర్యలు చీకటి రోజులను గుర్తు చేస్తున్నట్లుగా భావిస్తున్నాం. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
From,
Mamidi Somaiah, President,
B.Basavspunnaiah
General Secretary, TWJF.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *