అమ్మాయి ముద్దు.. జగన్ కు షాక్ (వీడియో)

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లిన ప్రతి సందర్భంలో వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాళ్లు మొదలుకొని పండు ముదుసలివారి వరకు అభిమానంతో వారి నుదిటిపై ముద్దులు పెట్టడం సహజం. వారితో ఆప్యాయంగా మాట్లాడుతారు. అనురాగం పంచే ఉద్దేశంతో వారికి ముద్దులు పెడతారు. ఈ తరహా కల్చర్ ఓదార్పు యాత్రతో జగన్ షూరు చేశారు.

అయితే ప్రస్తుతం జగన్ పాదయాత్రలో భాగంగా ఒక అమ్మాయి జగన్ తో సెల్ఫీ దిగింది. తర్వాత ఆ అమ్మాయి నుదురు మీద జగన్ ముద్దు పెట్టాలనుకునేలోపే ఆమె వచ్చి జగన్ చెంప మీద ముద్దు పెట్టేసింది. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఊహించని ‘ముద్దుతో’ జగన్ కూడా షాక్ కు గురయ్యారు.  తర్వాత ఆ అమ్మాయి అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. వీడియో కింద ఉంది మీరూ చూడండి. సుదీర్ఘకాలం పాదయాత్రలో జనగ్ జనం యూత్ మనసు చూరగొంటున్నారనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *