ఆంధ్రలో మోహన్ బాబుకు ఛెయిర్మన్ పదవి

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కు పదవి లభించింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర  అభివృద్ధి సంస్థ ఛెయిర్మన్ గానియమించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  నామినేటెడ్ పోస్ట్ లను భర్తీచేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మోహన్ బాబు ఈ పదవి లభించింది.
మోహన్ బాబు ఒకపుడు తెలుగు రాజ్యసభ సభ్యుడి గా ఉన్నారు. చంద్రబాబుతో వివాదం కారణంగా ఆ పార్టీ నుంచి దూరం జరిగారు. ఈ మధ్య చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఎన్నికల ముందు వైసిసి తరఫున ప్రచారం కూడా చేశారు.
 మోహ న్ బాబు తో పాటు  కొందరి పేర్లనుకూడా జగన్  ఖరారుచేశారు.  అనుకున్నట్లుగానే    నగరి ఎమ్మెల్యే  రోజాకు ఏపీఐఐసి ఛైర్మ‌న్ పదవి ప్రకటించారు. ఇదే విధంగా సిఆర్ డిఎ ఛెయిర్మన్ పదవికి  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎంపిక చేశారు. ఇదే జాబితా…
మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా వాసిరెడ్డి ప‌ద్మ
సీఆర్డీఏ ఛైర్మ‌న్‌గా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి
ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా మోహ‌న్‌బాబు
ఆర్టీసి ఛైర్మ‌న్‌గా అంబ‌టి రాంబాబు
కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా గ్రంధి శ్రీనివాస్
బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌విని ద్రోణంరాజు శ్రీనివాస్‌
పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా యేసుర‌త్నం
సివిల్ స‌ప్ల‌యిస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్
ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా మోషేన్ రాజు
వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్‌గా మ‌హ్మ‌ద్ ముస్తఫా
ఇత‌ర ఛైర్మ‌న్ల పోస్టుల‌ను జ‌గ‌న్ దాదాపు భ‌ర్తీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా భూమ‌న క‌రుణాక‌ర రెడ్డికి కొత్తపోస్టు సృష్టిస్తున్నారు. ఆయనను రాయ‌ల‌సీమ అభివృద్ది మండలి ఛైర్మ‌న్‌ గా నియమించబోతున్నారు.