Home Breaking కుమారస్వామి రెండో భార్య సినిమా హీరోయిన్ (గ్యాలరీ)

కుమారస్వామి రెండో భార్య సినిమా హీరోయిన్ (గ్యాలరీ)

859
0

కన్నడ నాట ఈ సినిమా హీరోయిన్ హాట్ టాపిక్ అయింది. ఈమె ఎవరో కాదు స్వయానా కర్ణాటక కాబోయే సిఎం కుమార స్వామి రెండో సతీమణి. అందుకే ఈమె చుట్టు ఇప్పుడు జోరుగా చర్చాతి చర్చలు సాగుతున్నాయి. ఆ వివరాలు చదవండి ఆమె తాలూకు అందమైన ఫొటో గ్యాలరీ కింద ఉంది చూడండి.

జెడిఎస్ నేత, కాబోయే సిఎం కుమార స్వామి సినీ హీరోయిన్ రాధికను 2006లో పెళ్లి చేసుకున్నారు. కుమార స్వామికి రాధిక రెండో భార్య. అప్పటికే కుమార స్వామి 1986లో అనిత అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అనితకు, కుమారస్వామికి జన్మించిన బిడ్డ నిఖిల్ గౌడ.

రాధికతో కుమార స్వామికి పరిచయం 2005లో మొదలైంది. తర్వాత ప్రేమగా మారి 2006లో పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. రెండోపెళ్లి విషయాన్ని మాత్రం నాలుగేళ్ల తర్వాత అంటే 2010లో వెల్లడించారు. కుమారస్వామికి, హీరోయిన్ రాధికకు జన్మించిన బిడ్డ షమికా.

రాధిక దాదాపు 32 సినిమాల్లో హీరోయిన్ గా నటించినట్లు కన్నడ సినీ వర్గాల్లో టాక్. అయితే ఆమె ప్రస్తుతం సినీ నిర్మాత గా కొనసాగుతున్నారు. కుమార స్వామి మరో రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో రాధిక పెళ్లి తాలూకు వివరాలు, ఆమె గురించి సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతోంది.

కుమారస్వామి రెండో భార్య రాధిక ఫొటో గ్యాలరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here