రేపో మాపో చంద్రబాబును కలవనున్న ‘జెడి’ లక్ష్మినారాయణ, ఎందుకో?

ఎన్నికలపుడు ఎన్నో విచిత్రాలు ఎదురువుతుంటాయ. అలాంటి వాటిలో ఒకటి ఇపుడు ఆంధ్రలో ఎదురవుతూ ఉంది. సిబిఐ జెడిగానే ఇంకా పేరున్న లక్ష్మినారాయణ టిడిపిలో చేరాలనుకోవడం.

మహారాష్ట్రకు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ అయిన జెడి లక్ష్మినారాయణ బిజెపిలో చేరతారని ఆమధ్య  కొన్నాళ్లు వార్తలొచ్చాయి.

లేదు, ఆయన మాజీ ఐఎ ఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్ సత్తా పార్టీతో కలసి పని చేస్తారని కూడా తర్వాత వార్తలొచ్చాయి.

ఒక దశలో ఆయన జనసేనలో జాయినవుతారని అన్నారు.

అది ఇది కాదు, ఆయన ఏకంగా సొంత పార్టీ పెడతారని చెప్పారు. ఆ వుద్దేశంతోనే లక్ష్మి నారాయణ ఆంధ్రప్రదేశ్ లో బాగా పర్యటించి, విద్యార్థులతో, యువకులతో , రైతులతో చర్చలు జరిపారు. వారిని చైతన్య వంతులను చేశారు.అవినీతి లేని సమాజం కోసంయువకులు నడుంబిగించాలని పిలుపునిస్తూ వచ్చారు. దీనితో ఆయనేదో కొత్త పార్టీ పెడుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే, తాజా సమాచారం ఏమిటంటే , ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారట. అంతేకాదు, నియోజకవర్గం కూడా ఖరారుచేయించుకున్నారట. టిడిపి వర్గాల్లో వినబడుతున్న కథనం ప్రకారం ఆయనకు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం కేటాయించారు.

ఇది మంత్రి గంటా శ్రీనివాస్ నియోజకవర్గం. అయితే, ఆయనను అక్కడి నుంంచి మంత్రి నారా లోకేశ్‌ ను పోటీ చేయించే విషయాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అయితే, జెడి లక్ష్మినారాయణ పార్టీల చేరాలనుకోవడంతో లోకేష్ ను విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గానికి పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసుల్ని దర్యాప్తు చేస్తూ జగన్ ను అరెస్టు చేసి లక్ష్మినారాయణ తెలుగు నాట హీరో ఆయ్యారు. జగన్ అరెస్టును ఆయన ను జాతీయ వార్తలకెక్కించింది. ఆతర్వాత ఆయన తన సొంత క్యాడర్ అయిన మహారాష్ట్ర కు వెళ్లిపోయారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతో ఆయన ఐపిఎస్ కు రాజీనామా చేశారు. ఆంధ్రలో విపరీతంగా పర్యటించారు.

లక్ష్మీనారాయణ, భీమిలి ఎమ్మెల్యే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. అక్కడ జెడి టిడిపిలోకి వచ్చే అంశం చర్చకు వచ్చిందని సమాచారం. రేపోమాపో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *