పదివేల ఒంటెలను చంపేస్తున్న ఆస్ట్రేలియా, వాటి వెనక ఇండియా కథ ఉంది!

ఆస్ట్రేయలియా కొన్ని ప్రాంతాలలో కరువు తాండవిస్తా వుంది. నీటికి కటకట మొదలయింది. ఎంత కటకట  అంటే, అక్కడ ఉండే ఒంటెలు కూడా ఇపుడు బరువయ్యాయి. వేల సంఖ్యలో కరువు ప్రాంతాలలో ఉండే ఒంటెల విపరీతంగా నీళ్లు తాగేస్తే  మనుషులకు నీళ్లు లేకుండా పోతాయని ప్రజల్లో,ప్రభుత్వంలో ఆందోళన మొదలయింది. దీనికి పరిష్కారం ఒంటెలను చంపేయడమే అనుకుంది. సుమారు 10వేల ఒంటెలను చంపేయలని నిర్ణయించారు. ఒంటెలు గుంపులు గుంపులుగా ఎడారి ప్రాంతాలనుంచి సమీపంలోని గ్రామాలకు మీద పడి ఉన్న నీళ్లన్నీ తాగస్తే ఎలా? ఆస్ట్రేలియా కరువు తో ఒక పక్క, మరొక వైపు  అడవులు అంటుకుని తెగ కష్టాలుపడుతూ ఉంది. ఇలాంటపుడు వేలకు వేల ఒంటెలు గ్రామాల దాడి చేస్తే అక్కడి గ్రామీణ  ప్రాంతాలలో నీళ్లు లేక ప్రజలు చస్తాారు. అందుకని ఒంటెలను ఏరిపడేయాలనుకుంటూఉంది. ఆస్ట్రేలియాలో ఒంటెలబెడద చాలాఎక్కువ. నిజానికి ఒంటె ఆస్ట్రేలియా నేటివ్ కాదు.అయినా సరే   ప్రపంచంలో ఒంటెలు ఎక్కువగా ఉండే దేశం ఆస్ట్రేలియాయే. ఒంటెలను చంపేందుకు APY (Anangu Pitjantjatjara Yankunytjatjara)  స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఒంటెల ఊచకోత బుధవారం నాడు మొదలయింది. అయిదురోజుల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో మొత్తంగా పది, పన్నెండు లక్షల దాకా ఒంటెలున్నాయని చెబుతారు.  వీటిసంఖ్య ప్రతి ఎనిమిది/తొమ్మిది సంవత్సరాలకు రెట్టింపవుతూ ఉంది. ఇవన్నీ సుమారు 3.3 మిలియన్ల చదరపు కిలో మీటర్ల పరిధిలోవిచ్ఛలవిడిగాతిరుగుతూ ఉంటాయి.
ఇంతకీ ఈ ఒంటెలు ఆస్ట్రేలియాకు ఎలా వచ్చాయి?
ఆస్ట్రేలియాలో ఎడారులు ఉన్న ఒంటెలు లేవు. 19 శతాబ్దంలో ఈ బ్రిటిష్ వాళ్లు ఈ ఖండాన్ని ఆక్రమించుకుంటున్నపుడు ఇక్కడి ఎడారులలో తిరగడం కష్టమయింది. ఎడారి దాటిపోయి, అటుపక్కనున్న ప్రాంతాలలో బ్రిటిష్ జెండా ఎగరేయాలి. విపరీతమయిన ఉష్టోగ్రత ఉండే ఈ ఎడారిలో ప్రయాణించడం కష్టంగా ఉంది. వారి గుర్రాలు ఆస్ట్రేలియా ఎడారుల్లో ఎందుకు పనికిరాకుండా పోయాయి.
ఇలాంటపు ఇండియా లో ఉన్న బ్రిటిష్ వారి ద్వారా వాళ్లకి ఒంటెల గురించి తెలిసింది. పశ్చిమ ఇండియా రాజస్థాన్ థార్ ఎడా రి నుంచి ఆఫ్గనిస్తాన్ దాకా ఎడారుల్లో ప్రజలు ఒంటెల మీద స్వారీ చేస్తూ హాయిగా ప్రయాణిస్తున్నారని తెలిసింది. అపుడు ఇండియా, ఆఫ్గనిస్తాన్ నుంచి ఒంటెలను దిగుమతి చేసుకున్నారు. ఇలాగే అరేబియా నుంచి కూడా కొన్ని ఒంటెలొచ్చాయి.
1958లో విక్టోరియన్ ఎక్సఫ్లోరేషన్ కమిటీ ఇండియా ధార్ ఎడారి ప్రాంతం నుంచి ఒంటెలను దిగుమతిచేసుకోమని జార్జ్ లెండెల్ అనే గుర్రాల వ్యాపారికి సలహా ఇచ్చింది. ఇండియా నుంచి వచ్చిన ఒంటెలతోనే 1860లో రాబర్ట్ ఒ హరా, విలియమ్ జాన్ అనే అన్వేషకులు మొట్టమొదటి సారి ఒంటెల సాయంతో ఆస్ట్రేలియాలో ప్రయాణం సాగించారు. అప్పటి నుంచి దాదాపు 20వేల ఒంటెలు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించాయి.
ఒంటెలతో పాటు ఒంటెలు తోలే వాళ్లను కూడా తెచ్చుకున్నారు. వీళ్లంతా ముస్లింలు. ఇందులో కొంతమంది ఇండియా నుంచి వచ్చినా, ఆస్ట్రేలియా తెల్లవాళ్లు ఒంటెలు తోలే వాళ్లందరికి ఒకటే పేరు పెట్టి ఆఫ్గన్లు పిలిచేశారు. 1870-1920 మధ్య నిరాటటంకంగా ఇండియా, ఆఫ్గనిస్తాన్, అరేబియాలనుంచి ఒంటెలు దిగమతిచేసుకున్నారు.
ఇలా ఒంటెలతో పాటు  కేమెలీర్స్ (ఒంటెలు తోలేవాళ్లు)ను అస్ట్రేలియా దిగుమతి చేసుకుంది. ఈ ఒంటెలు ఒక సారి నీళ్లు తాగితే మళ్లీ వారాల తరబడి నీళ్లు ముట్టుుకోకుండా భగ్గున ఎండలు మండే ఎడారిలో విపరీతమయిన బరువు మోస్తూ ప్రయాణించడంతో ఖండాన్నంతా సులభంగా కలియతిరగగలిగారు. ఆస్ట్రేలియాను బ్రిటిష్ వాళ్లు తమ కాలనీగా డెవెలప్ చేసుకోవడంలో ఈ ఒంటెలది, ఒంటెలు తోలేవారిది చాలా కీలకపాత్ర.
మోటారు వాహనాలు, రైల్లు చివరకు బండ్లుకూడా లేని రోజులలో బ్రిటిష్ వాళ్లకు దొరికిన ఏకైక రవాణా సాధనం ఒంటే అయింది. వులెన్ను, నీళ్లను, టెలిగ్రాఫ్ స్తంభాలను, రైల్వే స్లీపర్లను, టీ, పొగాకు ఈ ఒంటెలతోనే రవాణా చేయించారు. ఇక్కడ అక్కడి అదివాసీలకు కూడా బయటి దేశాలనుంచి ఒంటె బాగా నచ్చింది.ఒంటె వెండ్రుకలను వాళ్లు ఆటబొమ్మల తయారీ లో వాడుకునేవారు. ఇలా అస్ట్రేలియా ఆర్థికాభివృద్ధిలో, సంస్కృతిలో ఒంటె ఒక విడదీయరాని అంశమయిపోయింది.
ఇలాగే ఆఫ్గన్ అనే మాట కూడా ఆస్గ్రేలియా భాషలోకి చొచ్చుకుపోయింది. ఇపుడు ఎడిలైడ్ నుంచి డార్విన్ దాకా నడిచే లగ్జరీ ట్రెయిన్ పేరేంటో తెలుసా? ది ఘన్ (The Ghan). ఈ ఘన్ ఏమిటో కాదు, ఆఫ్గన్ లోని ఘన్.
అయితే, 1930లో ఒంటెల పరిశ్రమ తలకిందులయింది. రైలు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) రావడంతో ఏకకాలంలో ఎంతయిన లగేజీ మోసుకుపోయేందుు వీలయింది. దీనితో ఒంటెల పనితీరిపోయింది.
40 డిగ్రీల సెంటిగ్రేడ్ ను కూడా తట్టుకునే శక్తి వున్నా, ఒంటెలు పెరుగుతున్న రవాణా అసవరాలు తీర్చలేని పరిస్థితి వచ్చింది. అపుడు ఉన్న ఒంటెలన్నింటినీ అలా గాలికి వదిలేశారు. ఆ ఒంటెలే ఈ ఏడు దశాబ్దాలలో ఇలాపెరిగి పెరిగి ఇపుడు పదిలక్షలకు చేరుకున్నాయి.
వీటిని జనాభాను తగ్గించేందుకు చాలా చర్యలుతీసుకున్నారు. 2013లో ఫీరల్ కేమెల్ మేనేజ్ మెంట్ ప్రాజక్టు (Feral Camel Management Program) ఏర్పాటుచేసిన 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 1.60లక్షల ఒంటెలను చంపేశారు. ఇంత దారుణంగా ఒంటెలను హతమార్చడానికి బాగా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ విధానం మీద తీవ్ర విమర్శలొచ్చాయి.

(ఈ స్టోరీ నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి)