పాస్ ఫెయిల్ భయం భూతంలా ఆవహించరాదు: భాగ్యలక్ష్మి కాలేజీ కథలు

(గంజి భాగ్యలక్ష్మి*)
చదువుకోవడమంటే గొంగళిపురుగు నుండి సీతాకోకచిలుకగా మారడం.
అనేకసార్లు నిర్మోచనాలు మనకు మనమే జరుపుకుని
రూపవిక్రియ చెందాలి.బలంగా,భరోసాగా,ఆదర్శంగా
నేను ఒక‌ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న రోజులవి…పీజీ పూర్తి చేసుకుని నా అధ్యాపక వృత్తిని మొదలు పెట్టి అది మూడో సంవత్సరం.
కో ఎడ్యుకేషన్… అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా నాకు ఉండదు.‌.ఉండే టైమ్ లో అందరితో ఫ్రెండ్లీ గా ఉండేదానిని.వారి వారి భావాలు ,బాదలు,కుటుంబ నేపథ్యాలు,లక్ష్యాలు ఇలా నాతో పంచుకునే వారు.
ఎలా మాట్లాడాలి,బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి,సమాజంతో ఎలా మసులుకోవాలి అన్ని విషయాలు చెప్పేదానిని..అందుకే కాబోలు విద్యార్థులు అందరూ నా క్లాస్ ఇష్టపడేవారు…
ఆ తరగతిలో అమ్మాయిలలో
ఒక‌ అమ్మాయి ‌ఉంటుండే….పేరు సునిత.తనని చూస్తే ఎందుకో ఎవరిలో కలవడం ఇష్టం లేకుండా ఉన్నట్టుగా ఉండేది.
ఈ సోర్టీ నచ్చితే facebook లో like చేయండి follow చేయండి
ఒక రోజు నేను కాలేజికి వెల్లగానే నా దగ్గర కు పరుగెత్తుకుంటూ వచ్చింది ఏడుస్తూ.నేను గాబరా గా అడిగాను సునితా ఏమయిందిరా అని. మేడం నేను చదువు మానేస్తాను మేడం ‌‌‌అన్నది.ఏంటి ఇంటిలో ఏమయినా ప్రాబ్లమా? అడిగాను.కాదు మేడం అంది.
సరే మొదట ఏడుపు ఆపు.రిలాక్స్ అవ్వు.ఆ తర్వాత చెప్పు అన్నాను.
ఆ అమ్మాయి చెప్పింది విని నేను షాక్ అయ్యాను…అంతే కాదు కాస్త అసహనం కలిగింది..ఇంతకీ ఆ అమ్మాయి చెప్పిన కారణమేంటో తెలుసా?
క్లాసులో ఒకబ్బాయి తన నోట్స్ అడిగాడట.అంతమందిలో నన్నే ఎందుకు అడిగాడుమేడం? నాకసలే అబ్బాయిలు అంటే భయం. మనసులో ఏదో పెట్టుకుని అడిగాడు.అన్నది ముఖం ముడుచుకుని.
అదేంటమ్మా క్లాస్ మేట్ ఒక నోట్స్ అడిగితే ఇంతగా నెగెటివ్ ఆలోచిస్తున్నావు ఎందుకు అన్నాను.సరే నేను మాట్లాడతాను నీవు క్లాస్ కి వెల్లు అని చెప్పాను.
ఆ అబ్బాయిని అబ్సర్వ్ చేస్తే అతను మంచి పిల్లోడు. ఆ అబ్బాయే కాదు క్లాస్ లో అందరూ మంచి వారే…ఆ అమ్మాయిని అబ్సర్వ్ చేయడం మొదలు పెట్టాను.ఇంట్రావర్ట్ అయిన తనని పదే పదే మాట్లాడిపించే దానిని.
ఒకసారి నాగార్జునసాగర్ టూర్ వెల్లాము ఆ క్లాస్ స్టూడెంట్స్ తోనే..లాంచ్ లో నాగార్జున కొండకి వెల్లాము.లాంచ్ దిగి నడుస్తూ అందరూ హ్యాపీగా నడుస్తున్నాము..నా చుట్టూ కొంతమంది స్టుడెంట్స్.అప్పటికే కొంతమంది మ్యూజియం చేరారు.బౌధ్ద స్థూపాలు,అవన్నీ చూస్తున్నారు.ఈ అమ్మాయి నాతో ఉంది.. కాసేపు కూర్చున్నాము నేను,తను ఇంకా కొద్దిమంది పిల్లలు.తర్వాత ఆ అమ్మాయితో అన్నాను నేనిక్కడె కూర్చుంటాను నీవు ఈ సోమేశ్ తో వెల్లు అని చెప్తూ ఆ అబ్బాయికి కూడా సునితని జాగ్రత్తగా మ్యూజియం కి తీసుకుని వెల్లు అని…అయిష్టంగా వెల్లింది తను..తర్వాత నేనూ వెల్లాను .ముఖం మాడుచుకుని ఏడుస్తూ మేడం మీరు కావాలనే నన్ను పంపారు కదా అన్నది.ఏమయిందమ్మా అంటే అబ్బాయిలంటే భయం అని మళ్లీ అదే మాట.
భుజం మీద చేయి వేసి నడుస్తూ మాటల్లో పెట్టాను.సునీతా నీ లక్ష్యం ఏంటి ?అని అడిగా.
టీచరవుతా మేడం అన్నది.గుడ్ అన్నాను..
తర్వాత ఆలోచన లు నన్ను వదలలేదు.చదువు అంటే ఏమిటీ? పుస్తకాలు చదవడమే నా.ఒకరితో ఒకరు కమ్యునికేట్ కాలేని వారు చదివి రేపు ఎలా ఏమి ,ఎవరిని ఉద్దరిస్తారు..
చదువుకోవడం అంటే మన భావాలను,హృదయాలను ఆలోచనలను విశాలం‌చేసుకొవడం.సంకుచిత భావాలను వదిలివేయడం.చదువు కోవడం అంటే పురోగమనం చెందడం. ఒక్క‌సునీతనే కాదు చాలా మంది సునీతలున్నారు.వారి చుట్టూ ఒక సర్కిల్ గీసుకుని దానిలో ఉంటూ ,బయటకు వచ్చే ప్రయత్నం చేయరు కదా,చుట్టూ ఉన్నవారిని అందులోకి లాగే ప్రయత్నం చేస్తారు.ప్రతిదీ నెగెటివ్ గా చూస్తూ ఉంటే అడుగు ముందుకు వేయగలమా?..
చూస్తుండగానే వారి డిగ్రీ పూర్తి అయ్యింది. సమ్మర్ హాలిడేస్.
జూన్ లో ఒక రోజు ఆ అమ్మాయి నుండి నాకు ఫోన్ వచ్చింది.. మేడం నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.

ఈమె ఎవరో తెలుసా? తెలంగాణ మోటివేషనల్ సూపర్ స్టార్ !

మీరంటే నాకు చాలా ఇష్టం .అందుకే మీతో మాట్లాడి చనిపోదని కాల్ చేసాను అని.నా మైండ్ కాసేపు బ్లాంక్..వెంటనే తేరుకుని తనతో అన్నాను.నేను ఇష్టం కదా నేను చెప్పేది విను..నీతో మాట్లాడాలి వస్తున్నా అని ఫోన్ పెట్టేసి నా టూ వీలర్ తీసుకుని పక్కనే 20 km ఉన్న వారి ఊరికి వెళ్లాను..
ఆ అమ్మాయి ఒక్కతే ఉంది.
తల్లిదండ్రులు వ్యవసాయ పనిమీద వెల్లారు.రెండు గంటల సేపు తనతో ఉన్నాను.తన ప్రాబ్లమ్ ఏంటి అంటే బి.ఇడి సీట్ వస్తదో రాదో..రాకుంటే అందరూవెక్కిరిస్తారు కదా అందుకే చనిపోతా అంటది. నీ లక్ష్యం టీచర్ కావడం అన్నావు.ఇంత పిరికిగా ఆలోచిస్తూ ,ప్రతిదీ సమస్యగా
ఊహచుకుంటూ నీవేమి చేస్తున్నావో నీకు తెలుసా?

ఈ అబ్బాయిని అలా వదిలేసి ఉంటే ఏమయ్యేది… భ్యాగ్యలక్ష్మి కాలేజీ కథలు

వీరు మాట్లాడితే తప్పు,వారు నవ్వితే తప్పు ఇలాంటి పిచ్చి ఆలోచనలతో జీవితాన్ని డీల్ చేయలేకపోతున్నావు..నీ ఆలోచనా విధానం మారాలి..నీవు మంచి టీచర్ వి కావాలి…దైర్యం చెప్పి వచ్చాను.ప్రతిరోజూ ఫోన్లో కాసేపు మాట్లాడి ఆ అమ్మాయిలో మార్పు తీసుకుని‌ రాగలిగాను…
ఆ తర్వాత ఒకసారి కలిసింది.బి.ఇడి చేసింది. డిఎస్సీ సాధించింది.. టీచర్ అయ్యింది. ఇపుడు తను మారడమే కాదు..విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తుంది…చదువంటే పట్టాలు పుచ్చుకోవడం కాదు..మనసు ఒక పుష్పం లా విచ్చుకోవడం….అపుడే జీవితం పరిమళాలు వెదజల్లుతుంది.
చాలా మంది ని చూస్తుంటాము .మనచుట్టూ ఎందరరినో.చదువులో ముందుంటారు కానీ సమాజాన్ని అర్థం చేసుకోవడం లో కానీ, ఎదుటివారిని అర్థం చేసుకోవడం లో కానీ ముందుండరు.చివరకు తమకేమి కావాలో కూడా తమకే తెలీదు.మనం పరిపూర్ణంగా మారాలి అంటే కొన్ని భయాలు,సంకోచాలు,సంకుచితాలు వదలాలి..అపుడే విజేతగా నిలబడగలము.

(*గంజి భాగ్యలక్ష్మి, ఖమ్మం డిగ్రీ కాలేజీలో జువాలజీ లెక్చరర్. మోటివేషల్ స్పీకర్, కవయిత్రి)