అవును, రవి ప్రకాశ్ ను అరెస్టు చేశాం: డీసీపీ సుమతి

:టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసినట్టు బంజారాహిల్స్‌ పోలీసులు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు.

టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు.

రవిప్రకాశ్‌తో పాటు అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏబీసీఎల్‌) మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్‌ మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

ఏబీసీఎల్‌ కంపెనీ చెందిన దాదాపు రూ.18 కోట్ల నిధులను సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్‌ను అదుపులోకి ప్రశ్నించినట్టు తెలిపారు. బోనస్‌, ఎక్స్‌గ్రేషియా పేరుతో కంపెనీ నిధులను స్వలాభానికి వాడుకుని.. సంస్థకు నష్టం కలిగించినట్టు ఫిర్యాదు పేర్కొన్నట్టు వెల్లడించారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, షేర్‌ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. రవిప్రకాశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని డీసీపీ సుమతి తెలిపారు.

ఇది ఇలా ఉంటే, రవిప్రకాష్ కు నాంపల్లి కోర్టు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తర్వాత ఆయనని జడ్జ్ నివాసం నుండి చంచల్ గూడ జైలు కు తరలించారు.రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 9న వాదనలు వింటామని జడ్జి చెప్పారు.

 

జడ్జి..