మంత్రి హరీష్ ను ముగ్గులోకి గుంజిన కాంగ్రెస్ పొన్నం

కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన ముచ్చట చెప్పారు. పొన్నం తెలంగాణ సర్కారుపై పదునైన రాజకీయ విమర్శలు చేస్తూనే మంత్రి హరీష్ రావును ముగ్గులోకి గుంజుకొచ్చారు. ఇంతకూ ఆ ముచ్చటేందబ్బా అనుకుంటున్నారా? మీడియా సమావేశంలో పొన్నం ఏం మాట్లాడారో.. పూర్తి వివరాల కోసం చదవండి స్టోరీ.

ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించిన కేసిఆర్ కేవలం ఆర్టీసి కార్మికులను మాత్రం బెదిరించారు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టీసి కార్మికులు శక్తివంచన లేకుండా పనిచేస్తూ సంస్థను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయినా ఆర్టీసి నష్టాలకు వారినే బాధ్యులుగా చేయాలని చూడడం సరికాదన్నారు. కేవలం ఆర్టీసి కార్మికులు తమ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా మంత్రి హరీష్ రావును నియమించుకున్నారు కాబట్టే ఆర్టీసి కార్మికుల మీద కేసిఆర్ పగ పట్టిండని పొన్నం ఎద్దేవా చేశారు. ఆ ఆర్టీసి కార్మికులు ఒకవేళ కేసిఆర్ కొడుకు కేటిఆర్ ను కానీ, ఎంపి కవితను కానీ గౌరవాధ్యక్షులుగా నియమించుకుంటే వారిపై ఇంతగా పగ సాధించేవాడా అని పొన్నం నిలదీశారు. హరీష్ రావు మీద కేసిఆర్ కు ఉన్న కోపంతోనే ఆర్టీసి కార్మికులను బెదిరిస్తున్నారన్నది పొన్నం వాదన.

ఇక మీడియా సమావేశంలో అనేక అంశాలపై పొన్నం స్పందించారు. ఆయన మాటల్లోనే చదవండి. కేసీఆర్ నియంతలాగా మాట్లాడుతున్నారు. ఆర్ టి సి కార్మికులను బెదిరించే విధంగా కేసీఆర్ మాట్లాడడాని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్ టి సి కార్మికులు అంటే కేసీఆర్ కు కానీ, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి కానీ ఏమాత్రం పట్టింపు లేదు. కేసిఆర్ బంధువు కాబట్టే రిటైర్ అయినా రమణారావు ను ఆర్ టి సిఎండి గా కొనసాగిస్తున్నాడు. కార్మికులు సమ్మె చేస్తామంటే చేసుకుంటే చేసుకపో అని బెదిరిస్తావా కేసీఆర్. వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ దిట్ట. ఆర్ టి సి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా హరీష్ ఉండడం వల్లే కేసీఆర్ కి కోపం. కె టి ఆర్,కవితను గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. 44 శాతం ఫిట్మెంట్ కార్మికులు పోరాటం చేస్తే ఇచ్చావు. ఆర్ టి సి ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టొలో పెట్టారు. కేసీఆర్ కు ఆర్ టి సి కార్మికులు రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలి.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. స్వామిగౌడ్ ను మంత్రి చేస్తానని చెప్పారు. ఉద్యోగుల కోసం ఉన్న ట్రిబ్యునల్ ను ఎందుకు ఎత్తివేసినవు. ఆనాడే రోశయ్య 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగుల సంఘ నాయకులు పదవుల కోసం ఆరాటపడుతున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు కేసీఆర్ కు తొత్తులుగా మరిపోయారు. కేసీఆర్ చెంచాలతో మీటింగ్ పెట్టుకున్నారు. జిల్లాల నుండి వచ్చిన ఉద్యోగులను సమావేశానికి ఆహ్వానించలేదు. ఉద్యోగసంఘ నాయకులను తప్పుపడుతున్నాం. కేసీఆర్ కు తాబేదారులుగా మరిన ఉద్యోగసంఘాలు, ఆ సంఘాల నాయకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వెంటనే మీ సంఘాలను ముసుకోండి. ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వానికి భజన చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను, బదిలీల సమస్యలను పరిష్కరించాలి. కొందరి ఉద్యోగులను  మాత్రమే బదిలీ ఎందుకు చేశారు. ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *