పోలవరం మీద ఆసక్తి వెనకేముంది? : స్పీకర్ కోడెలకు కెవిపి గమ్మత్తు లేఖ

7-9-2018 తేదీ ఏపి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు రాజ్య‌స‌భ స‌భ్యులు కె.వి.పి రామ‌చంద్ర‌రావు ఉత్త‌రం రాసారు..

8-9-2018 తేదీన ఏపిసిసి రాష్ట్ర కార్యాల‌యం ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్ నుంచి స్పీక‌ర్ కు కె.వి.పి రాసిన ఉత్త‌రం ను మీడియాకు విడుద‌ల చేశారు..

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఖర్చును విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నేను హై కోర్ట్ లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో కేంద్రం కౌంటర్ ఇంకా వేయలేదని నేను మీకు 5 సెప్టెంబర్ న రాసిన లేఖలో తెలిపి ఉన్నాను. కానీ, కాకతాళీయం గా అదే రోజు అంటే 05.09.2018న కేంద్ర జలవనురుల శాఖ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది, మా తరపు న్యాయవాదికి కేంద్రం తరుపున హైకోర్టులో ఫైల్ చేస్తున్న కౌంటర్ కాపీ ని ఇచ్చినట్లు గా మా న్యాయవాది నిన్న నాకు తెలిపి ఉన్నారు. కాబట్టి మీకు ఈ విషయం తెలియచేయడం నా ధర్మం గా భావించి ఈ లేఖ ద్వారా తెలియ చేస్తున్నాను.

ఇదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేవలం “మెమో అఫ్ అప్పీయరెన్సు” తో సరి పెట్టకుండా.. విభజన చట్టం ప్రకారం, ఆ తరువాత యూపీఏ కాబినెట్ 01.05.2014 న తీసుకొన్న నిర్ణయం ప్రకారం పోలవరం పూర్తి ఖర్చు ను కాస్ట్ ఎస్క్ లేషన్ భారం తో పాటు, 2013 నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాసాల పై అయ్యే అదనపు ఖర్చు తో సహా కేంద్రమే భరించేలా ఆదేశించి ఆంధ్ర ప్రదేశ్ కు న్యాయం చేయమని కౌంటర్ దాఖలు చేస్తే.. ఆ కేసు త్వరగా విచారణకు వచ్చి రాష్ట్రానికి అనుకూల ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది.

నేను ఇప్పటికే పలు లేఖల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని..ఈ కేసులో రాష్ట్రం తరుపున కౌంటర్ వేయించవలసినదిగా కోరి ఉన్నాను. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎందుకో పోలవరం విషయంలో ఈ అదనపు భారాన్ని రాష్ట్రంపై వేయడం తో పాటు, ప్రాజెక్ట్ ఖర్చు ను ముందు రాష్ట్ర నిధులనుంచి భరించి తరువాత కేంద్రం నుంచి రీయింబర్సు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి కారణమేమిటో వారికే తెలియాలి. ఇక పోలవరం విషయంలో ఈ మధ్య మీకు కూడా “ఆసక్తి” పెరిగి పోలవరం త్వరగా పూర్తి అవ్వాలని ఆశిస్తున్నట్లు కనబడుతున్నది కాబట్టి.. ఈ అదనపు ఖర్చు భారం రాష్ట్రంపై పడకుండా పోలవరం త్వరగా పూర్తిఅవ్వడానికి “రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల విషయంలో” రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తారని ఆశిస్తూ..

భవదీయుడు

(డా. కె.వి.పి.రామచంద్ర రావు)

—-

శ్రీ కోడెల శివప్రసాద్ గారు,
గౌరవ సభాపతి, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ,
శాసనసభా ప్రాగణం, వెలగపూడి, గుంటూరు జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *