తిరుపతికి వస్తున్న ప్రధాని, ‘హోదా‘ప్రకటన గుర్తుచేసిన రఘవీరా

ప్రధానికి  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి బహిరంగ లేఖ
దేశ ప్రధానిగా రెండవసారి భాద్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోదీ గారు తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి జూన్ 9 వ తేదీన వస్తున్నారని తెలిసింది. మోదీ గారికి స్వాగతం తెలుపుతున్నాను.
ఈ సందర్భంగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధాని మోదీ గారికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను..
సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే తిరుపతి వెంకన్న దేవుని సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా 10 ఏళ్ళు అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కారణాలు ఏమైనా, బాధ్యులు ఎవరైనా ఏపీకి హోదా అమలు కాలేదు..
5 సంవత్సరాలు గడిచి పోయాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు.
కనుక మీకు మరోసారి తిరుపతిలో 5 ఏళ్ల క్రితం మీకు ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ ఏపీకి హోదా ను అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున విజ్ఙప్తి చేస్తున్నాను. (పై ఫోటో నరేంద్రమోదీ 2014 లో తిరుపతిలో ప్రసంగించిన సభలోనిది)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీకి ప్రత్యేక హోదా అమలు అనేది తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశం గా చెపుతున్నారు. కావున ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ గారిని తిరుపతి లో కలిసి మరోసారి హోదా అమలును విజ్ఙప్తి చేసి సాధించాలని కోరుతున్నాను.
ధన్యవాదాలతో
ఎన్. రఘువీరారెడ్డి.
అధ్యక్షుడు, ఏపీసీసీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *