వైసిపి ఎంపిల రాజీనామా ఆమోదం

మా రాజీనామాలు ఆమోదం పొందాయి
హోదా కోసం ప‌ద‌వుల‌ను త్యాగం చేశాం
ఉప ఎన్నిక‌ల‌లో ప్ర‌జ‌ల తీర్పును కోరుతున్నామని,ప్ర‌జ‌లే న్యాయ నిర్ణేత‌లు అని  రాజీనామా చేసిన వైసిపి ఎంపిలు
మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర ప్ర‌సాద్‌, మిథున్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, మేక‌సాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ప్రకటించారు.

ఈ రోజు స్పీక‌రు సుమిత్ర మ‌హాజ‌న్‌ను క‌లిశామని , ఆమె
ఏమిటి మీ నిర్ణ‌యం అని ఆమె అడిగారని చెబుతూ
ఎలాంటి దాప‌రికం లేదు,
రాజీనామాల‌ను ఆమోదించాల‌ని కోరామని వారు చెప్పారు.
పున‌రాలోచించుకోవాలని కూడా స్పీకర్ మహాజన్ చెప్పారని వారు తెలిపారు.

రీక‌న్‌ఫ‌ర్మేష‌న్ లేఖ‌లు రాగానే ఆమోదిస్తాన‌ని స్పీక‌రు చెప్పారని కూడా వారు వెల్లడించారు.
దీనితో
రాజీనామాల వ్య‌వ‌హారం పూర్తి అయిన‌ట్లే,
మా గురించి చంద్ర‌బాబు ఏదేదో మాట్లాడుతూ
త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఉప ఎన్నిక‌ల‌కు వెళుతున్నాం.
ప్ర‌జ‌లు ఎలా తీర్పు ఇస్తారో చూద్దాం
ఏప్రిల్ 6న రాజీనామాలు చేశాం
హోదా కోసం రాజీనామాలు చేశాం
ప‌ర్య‌వ‌సానాల‌ను లెక్కించ‌లేదు.
టీడీపీ నేత‌లు డ్రామాలు వేస్తోంది.
అన్నీ ప్ర‌జ‌లు చూస్తున్నారు
చిత్త‌శుద్దితో పోరాడుతున్నాం
హోదా సాధించే దాకా పోరాడుతాం
ఉ ప ఎన్నిక‌లు వ‌స్తాయి
హోదా ఎంత బ‌లంగా ఉందో తెలుస్తుంది

వైయ‌స్సార్‌సీపీ నేత‌లు వ‌ర ప్ర‌సాద్ ,మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఇలా అన్నారు.
‘‘ప‌చ్చ కామెర్ల రోగికి లోక‌మంతా ప‌చ్చ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.
అదే వైఖ‌రి టీడీపీలో క‌నిపిస్తోంది.
ఉద్య‌మానికే ఊపిరి పోసింది వైయ‌స్సార్‌సీపీ
హోదా కోసం పోరాడుతుంటే వారు మాపై బుర‌ద జ‌ల్లుతున్నారు..
రాజ‌కీయంగా ఎదుర్కోలేక లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు
హోదామాట చంద్ర‌బాబు నోటి నుంచి రాలేదు
ఎవ‌రు డ్రామాలో వేస్తున్నారోప్ర‌జ‌ల‌కు తెలుస‌పు
చంద్ర‌బాబుకు ధైర్యం గ‌న‌క ఉంటే
ఫిరాయింపుదారుల‌తో రాజీనామాలు చేయంచ‌మ‌నండి
ముగ్గురు ఎంపీల‌ను తీసుకున్నారు
ఎన్నిక‌ల‌కు మేము భ‌య‌ప‌డ‌లేదు.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *