రెండు రోజుల్లో రు.900 తగ్గిన బంగారు ధర… ఎందుకో తెలుసా?

భారతదేశంలో బంగారు ధరలు రెండో రోజున కూడా తగ్గాయి.
దీనితోమందగించిని బంగారు రిటైల్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది. మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ (MCX) లో బుధవారంనాడు గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.3 శాతం పడిపోయి పది గ్రాముల ధర రు. 36,811 కు చేరింది.
నిన్న , ఈ రోజు కలసి బంగారు పదిగ్రాముల ధర మొత్తంగా రు. 900 తగ్గింది. గత నెలతో పోలిస్తే బంగారు ధర మూడువేల తగ్గింది. గత నెల ఇదే రోజును పది గ్రాముల ధర రు. 39,885 ఉండింది. గత నెల మీద వెండి ధర రు. 51,489 నుంచి రు. 7400 తగ్గింది.
ఢిల్లీ స్పాట్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారు ధర రు.58 తగ్గి రు.38,140 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారు ధర సోమవారం నాడు ఔన్స్ ధర 1.6శాతం పడిపోయింది ఈ రోజు మరొక 0.1 శాతం తగ్గి 1,470 కు చేరింది.
ఇదే విధంగా వెండి ధరలు కూడా తగ్గాయి. ఎంసి ఎక్స్ లో వెండి ధర 3 శాతం తగ్గి అంటే సుమారు రు.1400 తగ్గి రు. 44,056 కు పడిపోయింది.
అమెరికా-చైనా ట్రేడ్ చర్చల మీద విశ్వాసం పెరగడంతో డాలర్ బలపడింది, దీనితో బంగారు ఆకర్షణ కొద్దిగా మసక బారింది. ఈ చర్చల ప్రభావం వల్ల బంగారు ధర ఔన్స్ 1420 డాలర్లకు పడిపోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. డాలర్  బలపడటంతో  ఇన్వెస్టర్లు బంగారు వైపు చూడటం తగ్గించారు.
అంతర్జాతీయమార్కెట్ లో బంగారు ఔన్స్ ధర  1500 డాలర్లు దాటుతుందనుకున్న సమయంలో సోమవారం నాడు అందరినీ ఆశ్చర్య పరుస్తూ ధరలు పడిపోవడం మొదలుపెట్టాయి. మంగళ వారం నాడు కొనసాగాయి. ఈ ట్రెండ్ ఎంతవరకు పోతుందో నని పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అమెరికా చైనాలు వాణిజ్య చర్చలను వాషింగ్టన్ లో వచ్చే పున: ప్రారంభించనున్నాయి. ఈ రెండు దేశాలు ఎక్కడో ఒక చోట రాజీ అవుతాయని చాలా మంది భావిస్తున్నారు.