ఇండియాబుల్స్ లక్ష కోట్ల ఫ్రాడ్, పట్టుకోండి, వదలొద్దంటున్న డా.స్వామి

మరోక నీరవ్ మోదీ తయారయ్యాడు, పట్టుకోండి, దేశం విడిచి పోకుండా అడ్డుకోండని రాజ్యసభ సభ్యుడు డా.సుబ్రమణియన్ స్వామి చెబుతున్నాడు. ఆయన ఈ విషయాన్ని ఏకంగా ప్రధానికి లేఖ రాసి అలర్ట్ చేశారు.
హార్వర్డ్ లో ఆర్థిక శాస్త్రంలో ఆచార్యుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన సుబ్రహ్మమణియన్ స్వామి ఇలాంటి సంచలన వార్తలు వెలుగులోకి తీసుకువచ్చి వారిని ముప్పతప్పలు పెడుతుంటాడు.
దేశాన్ని కుదిపేసిన చాలా సంచలనాత్మక కేసుల వెనక డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాజకీయపలుకుబడి ఉపయోగించి బారీగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకు లనుంచి రుణాలు తీసుకుని వాటిని మళ్లించి, నష్టపోయామని దివాళ ప్రకటించడం చాలా మామూలయిపోయింది.
ఇండియాబుల్స్ హౌసింగ్ఇపుడు ఇదే దారిలో ఉందని, దీనితో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసిన ప్రజలు, అప్పులిచ్చిన బ్యాంకులు ‘ఫసక్ ’ అని సుబ్రమణియన్ స్వామి చెబుతున్నారు.
ఇపుడాయన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రాడ్ గురించి చాలా వివరాలు ఆయన బయటపెట్టారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలంటేనే పెద్ద ఫ్రాడ్ అనే పరిస్థితి వచ్చిన రోజులువి. ఇలాంటపుడు ఆయన ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వేయి కాదు, పది వేలు కాదు,ఏకండా లక్ష కోట్ల ఫ్రాడ్ చేసిందని ఆయన తన దగ్గరున్న సాక్ష్యాధారాలోతో ప్రధాని మోదీకి లేఖ రాశారు.

 

‘విశ్వసనీయం సమాచారం ప్రకారం, అనేక డాక్యుమెంట్లను పరిశీలించాక ఇండియా బుల్స్ కంపెనీ ఆర్థిక దివాళా ప్రకటించే దిశలో కదులుతూ ఉంది. ఈ కంపెనీని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం,బిఎస్ హూడా వంటి కాంగ్రెస్  నాయకులు పెంచిపోషించారు. దీనితో రియల్ ఎస్టేట్ రంగంలో,బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ భారీ అవినీతికి మార్గం ఏర్పడుతుంది. ఈ దివాళా వల్ల ప్రజలకు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కు దాదాపు రు.లక్ష కోట్ల నష్టం వాటిల్లు తుంది,’ అని ఆయన ప్రధానికి రాసిన లేఖలోపేర్కొన్నారు.
ఈ కంపెనీ,దీనికి సహచర సంస్థలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి భారీగా రుణాలు తీసుకుని గురుగ్రామ్, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై తదితర పట్టనాలలో తాము ఏర్పాటుచేసిన 100 బోగస్ సంస్థలకు మళ్లించాయని ఇదే దాదాపు 30 కోట్ల నుంచి 1000 కోట్ల రుపాయల దాకా ఉంటుందని డాక్టర్ స్వామి పేర్కొన్నారు.
ఈ కంపెనీ బ్యాంకులనుంచి రుణాలు పొందడమేకాకుండా పబ్లిక్ నుంచి కూడా ఇన్వెస్ట్ మంట్ల రుూపంలో భారీగా వసూలు చేసి ఇతర సంస్థకు మళ్లించిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, 2G, కోల్ స్కామ్ ల ముడుపులన్నింటిని ఇండియా బుల్స్ నుంచి బయటకు మళ్లించారని, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం రక్షణలో రిజర్వు బ్యాంకు కూడా ఈ స్కామ్ లో తగినపాత్ర పోషించిందని ఆయన ఆరోపించారు.
అందువల్ల ఇండియాబుల్స్ వోనర్ సమీర్ గెహ్లాట్ దేశం విడిచిపోకుండా కట్టడిచేయాలని, సిబిఐ, ఇడి, ఇన్ కమ్ టాక్స్, సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లత్ ఒక స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్ (SIT) వేయాలని డాక్టర్ స్వామి ప్రధానిని కోరారు.