తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్, 6 కొత్త ముఖాలు

తెలంగాణ కేబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11.30 నిమిషాలకు కేసీఆర్ కేబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. మీనమేషాలు లెక్కించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కెసిఆర్, కేబినేట్ విస్తరణ మాఘ శుద్ద పౌర్ణమి రోజు మంచిదని భావించినట్లు తెలుస్తోంది. కావున ఆరోజే రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.

దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో బేటి అయ్యారు. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన అందజేసినట్టు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రెండు నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరుతో టిఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చింది.

డిసెంబర్ 13న సీఎం గా కేసీఆర్, హోం మంత్రిగా మహ్మూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మిగతా మంత్రుల నియామకం జరగలేదు. గత రెండు రోజులుగా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి సీఎం కేసీఆర్ సమాలోచనలు చేశారు. ఫాం హౌస్ లో ఆయన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మంత్రి వర్గం పై ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సారి కేబినేట్ లో పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.

జిల్లాల వారీగా మరియు సామాజిక వర్గాల వారీగా మంత్రి వర్గంలో అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. గత రెండు నెలలుగా ఉన్న ఉత్కంఠకు కేసీఆర్ తెర దించారు. ఈ సారి పూర్తిగా సీనియారిటిని పక్కకు పెట్టి పార్టీకి విధేయులుగా పని చేసే వారికే పెద్ద పీట వేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మంత్రి వర్గంలో ముందుగా 10 మందిని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇందులో నలుగురు పాత వారు కాగా 6గురు కొత్త వారు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

మంత్రులుగా వీరికే చాన్స్

కడియం శ్రీహరి
ఈటల రాజేందర్
జగదీశ్వర్ రెడ్డి
ఎర్రబెల్లి దయాకర్ రావు
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కొప్పుల ఈశ్వర్
వేముల ప్రశాంత్ రెడ్డి
పద్మా దేవేందర్ రెడ్డి

హరీష్ రావు, కేటిఆర్ లకు ఈ దఫాలో బెర్తు ఖాయమవుతుందా లేక మరో దఫాలో బెర్తు ఖాయమవుతుందా అనే దాని పై స్పష్టత లేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *