చంద్రయాన్ 2 ముహూర్తం ప్రకటించారు

చంద్రయాన్ 2 ను ప్రయోగం మీద ఇస్రో అధికారిక ప్రకటన చేసింది.జూలై 22 మధ్యాహ్నం 2.43 ని. ప్రయోగం జరగుతుంది. ఈ విషయాన్ని ఇస్ట్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్ 2 జూలై 15 జరగాల్సి ఉండింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా వేశారు. రాకెట్ క్యారియింగ్ మిషన్ లో లోపం వచ్చినందున ప్రయోగం వాయిదా పడింది. ఇపుడు జూలై 22 న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేష్ సెంటర్నుంచి ప్రయోగించాలని నిర్ణయించారు. ఇది సెప్టెంబర్ చంద్రుని చేరుకుంటుంది.

Chandrayaan-2 launch, which was called off due to a technical snag on July 15, 2019, is now rescheduled at 2:43 pm IST on Monday, July 22, 2019. #Chandrayaan2 #GSLVMkIII #ISRO

— ISRO (@isro) July 18, 2019

జూలై 11 తెల్లవారు జామున 2.51కి జియో సింక్రొనస్ శటిలైట్ వెహికిల్  మార్క్III (GSLV MKIII) నింగిలోకి ఎగరాల్సి వుండింది. ఒక గంట ముందు సిస్టమ్ ఏదో లోపం ఉందని కనుగొన్నారు. కంబషన్ చేంబర్ కి ఫ్యుయల్ అందాలంటే ట్యాంక్ ల్ వత్తిడి సమానం గా ఉండాలి. అయితే, ఈప్రెజర్ పడిపోతుండం గమనించి, ఒక గంట ముందు కౌంటడౌన్ నిలివేసి ప్రయోగం రద్దు చేశారు.