క్లాసు రూంలో బాలుడి నోట్లో పేలిన సెల్ ఫోన్

సెల్ ఫోన్ నోట్లో పెట్టుకున్న ఆ బ్యాటరీని కొరకడంతో అది నోట్లోనే పేలింది. దీంతో ఆ బాలుడికి గాయాలయ్యాయి. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన మామిడాల శంకరయ్య, లక్ష్మీల కుమారుడు రాజు. రాజు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ కు వచ్చిన రాజు బ్యాగులో నుంచి సెల్ ఫోన్ తీసుకొని ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్ కు చూపిస్తూ బ్యాటరీని నోట్లో పెట్టుకొని కొరికాడు. అంతే ఫోన్ ఒక్క సారిగా పేలి మంటలు వచ్చాయి.

ఈ ప్రమాదంలో రాజు మూతికి గాయాలయ్యాయి. ఇతరులెవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజు ఇంట్లో వాడని ఫోన్ ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చినట్టు తేలింది. రాజుకు జనగాం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *