Home ట్రెండింగ్ న్యూస్ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి మృతి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి మృతి

254
0
SHARE

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు ఈ నెల 10 బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు కన్ను మూశారు.

ఆయన మరణవార్త తెలుసుకున్న బీజేపీ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆయన మరణవార్తతో కుటుంబంలోనూ, బీజేపిలోను విషాద ఛాయలు అలుముకున్నాయి. 1985, 1989, 1994 లలో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బాల్ రెడ్డి. 2018 లో రాజేంద్రనగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పొందారు.

జనాల మధ్య సింహం నడచి వస్తుంది అంటే అది ఖచ్చితంగా ” గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి గారు” అని తెలంగాణ ప్రజానీకానికి తెలుసు అంటారు ఆయన అభిమానులు. తమ ప్రియతమ నేత ఇక లేరని తెలిసి అభిమానులు కలత చెందుతున్నారు.