ఒకనాటి మెదక్ లోక్ సభ అభ్యర్థి మీద విద్యాబాలన్ బయోపిక్

ఈ తరానికి శకుంతలా దేవి గురించి పెద్దగా పరిచయం ఉండదు.

ఆమె గుణింతాల మాంత్రికురాలు. అమె చేసే లెక్కలు ఎవరికీ అంతుబట్టేవి కాదు. ఒక సంఖ్యలో ఎన్ని అంకెలున్నాసరే, వాటి హెచ్చింపులు, కూడికలు తీసివేతలు, క్యూబ్ రూట్లు, ఇలా ఏవయినా సరే అలవోకగా చెప్పేది.
అత్యంత వేగాంగా చేప్పేది. ఈ విషయంలో అపుడే  అమెరికాలో మార్కెట్లోకి  వచ్చిన పర్సనల్ కంప్యూటర్ ను కూడా ఆమె ఓడించారు.
లెక్కలప్రదర్శనలో ఆమె జవాబును నోట్ చేసుకునేందుకు కూడా వీలుకానంత స్పీడ్ గా ప్రశ్నలకు సమాధానం చెప్పేది. ఇలాటి శకుంతలా దేవి మీద ఇపుడు బయోపిక్ రాబోతున్నది
ఆమె కన్నడిగ. అయినా సరే, తెలంగాణతో ఆమెకు కొంత అనుబంధం ఉంది.
1980లో ఇందిరాాగాంధీ మెదక్ నుంచి పోటీ లోక్ సభ కు పోటీ చేశారు.  ఉత్తరాదిన రాయ్ బరేలి నుంచి , దక్షిణాదిన మెదక్ నుంచి పోటీ చేశారు. అప్పటికింకా ఎమర్జన్సీ చెడ్డపేరు ఇందిరాగాంధీని వీడలేదు.  ఎమర్జన్సీ చెడ్డ పేరు వల్లే 1977 లో ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో  ఆమె ఓడిపోయారు. జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే, ఆ ప్రభుత్వం ఏక్కువ కాలం ఉండలేదు.
1980 జనవరిలో ఎన్నికలు జరిగాయి. అపుడు ఇందిరాగాంధీ  మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. గెలిచారు. అయితే, చాలా మంది మేధావులు ఇందిరాగాంధీని  ఎమర్జన్సీని వ్యతిరేకించారు. అలాంటి వారిలో శకుంతలా దేవి ఒకరు.  ఇందిరాగాంధీని ఓడించండని చెప్పేందుకు ఆమె మెదక్ నుంచి పోటీ చేశారు.  ఇందిరా గాంధీ ప్రజలను మళ్లీ మోసపుచ్చుతున్నారని, తాను దీని అడ్డుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆమె పోటీ చేశారు.
అయితే, ఓడిపోయారు. ఆ ఎన్నికలలో శకుంతలా దేవికి 6514 వోట్లు అంటే 1.47 శాతం మాత్రమే పోలయ్యాయి. ఇది వేరేకథ… అసలు విషయానికొస్తే…
ఇపుడయితే సూపర్ కంప్యూటర్లు, అవి ఇవీ అన్ని వచ్చేశాయి గాని, కంప్యూటర్ల తొలినాళ్లలో ఆమె కంప్యూటర్ ని ఓడించి రికార్డు నెలకొల్పారు.
అందుకే ఆ ఆరోజుల్లో ఆమెను మానవ కంప్యూటర్ అన్నారు. తల కాయనిండా కోట్లున్నా, ఆమె తొలినాళ్ల జీవితంలో అన్నీసున్నాలే. ఆమె ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. పెద్దగా చదువుకోలేదు, చదువు స్కూల్ దాటి రాలేదు. అయితే, మానవ కంప్యూటర్ అయిపోయి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.
ఇపుడామె జీవితంలో ఒడిదుడుకుల మీద బయోపిక్ వస్తున్నది. తీయాలనుకుంటున్నదెవరో కాదు, ప్రఖ్యాత నటి విద్యాబాలన్. ఈచిత్రానికి అనూ మెనన్ దర్శకత్వం వహిస్తారు
ఆమె జీవితం ఒక వైపు ఉత్తేజకరంగా ఉంటుంది, మరొక వైపు విషాదం, వైఫల్యాలు. ఈ రెండింటి మధ్య సాగిన ఆమె అంకెల జీవితయాత్ర సినిమాతెరక్కడం మంచివార్త. 2020 లో ఈ టైం కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు ఆమె చెప్పారు
శకుంతలా దేవి నవంబర్ 4, 1929 న బ్రిటిష్ ఇండియాలోని మైసూర్ సంస్థానంలో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్ కంపెనీలో వైర్ మీద నడిచే సాహసం చేసే ట్రెపీజ్ కళాకారుడిగా,సింహాలను ఆడించేవాడిగా, గారడివాడిగా పనిచేసేవాడు.
ఒక రోజు కూతురితో కలసి సరదాగా పేకాడుతున్నపుడు ఆయన ఆమె లో ఉన్న టాలెంట్ ను గుర్తించారు. అమ్మాయితో పేకాడితే తనెపుడూ వోడిపోతున్నాడు, ఎలా?
ఆ ఆమ్మాయి ఏ కార్డు ఏమిటో గుర్తుపెట్టుకుంటున్నందున తాను ఈజీగా వోడిపోతున్నట్లు తండ్రి గుర్తించాడు. ఈ అమ్మాయిలో అంకెలకు సంబంధించిన  గొప్ప శక్తి ఉందన్న విషయం ఇలా సరగా ఆడే పేకాటలో బయటపడింది.
శకుంతాల దేవి జటిలమయిన గణిత సమస్యలను అయిదేళ్ల వయసులోనే పరిష్కరించడం మొదలుపెట్టింది. ఆరో ఏటనే గుణింతాల ప్రదర్శన ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆమె మొట్టమొదటి అంకెల క్రీడా ప్రదర్శన మైసూరు విశ్వవిద్యాలయంలోఅనేక మంది ప్రొఫెసర్ల, విద్యార్థులు ఎదుట ఇచ్చారు.
అంతే, ఇక ఆమె వెనక్కి తిరిగి చూల్లేదు. శకుంతాల దేవి అంకెలతో ఆడుకునే చోద్యం వార్త ప్రపంచమంతాప్రాకింది. ప్రంపచంలోని అనేక పేరు మోసిన విశ్వవిద్యాలయాలలో ప్రదర్నన లిచ్చింది. విదేశాలలో ఆమె ప్రదర్శనలు చూసిన శాస్త్రవేత్తలు నొరెళ్ల బెట్టి ఆమెను‘ మెంటల్ కాలిక్యులేటర్ ’అన్నారు. 1950లో యూరోప్ పర్యటనకు వెళ్లారు. 15వ యేట తండ్రితో కలసి లండన్ స్థిరపడ్డారు. 1976లో ఆమెన్యూయార్క్ లో ఇచ్చిన ప్రదర్శనలో188,132,517 క్యూబ్ రూట్ ను 20 సెకండ్ల లోపే గణించారు.
‘ఆమె 188,132,517 క్యూబ్ రూట్ నే కాదు, అలాంటి ఏ ప్రశ్న కైనా, ప్రశ్న వేసేందుకు పట్టిన టైం కంటే తక్కువ టైంలోనే సమాధానం చెబుతారు. గత శతాబ్దంలో ఏదైని ఒక డేట్ ఇస్తే ఆమె టకీమని ఆరోజేమిటోచెప్పాస్తారు,’ అపుడు న్యూయార్క్ టైమ్స్ రాసింది.
1977లో డల్లాస్ లోని సదరన్ మెధడిస్ట్ యూనివర్శిటీలో 201 అంకెలున్న ఒక నెంబర్ 23వ రూట్ ని 50 సెకండ్లలో చెప్పారు. అదే నంబర్ ను గణించేందుకు అపుడు బాగా పేరున్న యూనివాక్ 1101 కంప్యూటర్ కు 62 సెకండ్లు పట్టింది. అంటే కంప్యూటర్ ఆమెకంటే 12 సెకండ్లు వెనబడిందన్నమాట. యూనివాక్ అనేది అమెరికాలో విడుదలయిన మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్. ఆమె గణనాలు ఎంత పొడవైయినవంటే, అవి తప్పో ఒప్పో తెలుసుకోవడానికి ప్రత్యకకంప్యూటర్ కోడ్ రాయాల్సివచ్చేంది.
1980లో లండన్ లోని ఇంపీరియల్ కాలేజీలో ఇచ్చిన ప్రదర్శనలో 13 అంకెలున్న నంబర్ ను 28 సెకండ్లలో హెచ్చించారు. ఈ క్యాల్ క్యులేషన్ వల్లే 1982లో ఆమె గీన్నీస్ రికార్డుల బుక్ లోకి ఎక్కారు.
1988లో ఆమె గణిత ప్రతిభను బెర్క్ లీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం సైకాలజీ ప్రొపెసర్ అర్థర్ జెన్సెన్ అధ్యయనం చేశారు.
ఆయన ఎన్నోరకాలుగా ఆమె గణిత శక్తిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. 61,629,875 క్యూబ్ రూట్ ను కనుక్కోమన్నారు.170,859,375 కు 7 రూట్ ను చెపమన్నాడు. ప్రెసర్ జెన్సెన్ కు దిమ్మతిరిగిపోయింది. ఎందుకంటే, ఆమె చెప్పిన సమాధానాన్ని ఆయన నోటుబుక్కులో రాసుకోవడం కూడా కష్టమయింది. అంతస్పీడుగా రూట్ లను లెక్కించింది.
1965 లో ఆమెఇండియా తిరిగొచ్చారు. కోల్ కత్తా కు చెందిన ఐఎఎస్ అధికారి పరితోష్ బెనర్జీని వివాహమాడారు. అయితే, 1979లో వారు విడాకులు తీసుకున్నారు.
తర్వాత జ్యోతిషంలో సెటిలయిపోయారు. అనేక వంటల పుస్తకాలు, పజిల్స్ రాశారు. 2013 ఏప్రిల్ 21, 83 వ యేట బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *