Home English కోటీశ్వరుల క్లబ్ నుంచి అనిల్ అంబానీ అవుట్, ఖేల్ ఖతమేనా?

కోటీశ్వరుల క్లబ్ నుంచి అనిల్ అంబానీ అవుట్, ఖేల్ ఖతమేనా?

353
0
SHARE

మొన్న మొన్నటి దాకా ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో వెలిగిపోయిన అనిల్ అంబానీ బిలియనీర్స్ క్లబ్ సభ్యత్వం పొగొట్టుకున్నారు.

2008లో ఆయన సామ్రాజ్యం విలువల 42 బిలియన్ డాలర్లు. అపుడాయన ప్రపంచంలోని సంపన్నులలో ఆరో స్థానంలో ఉండే వారు.  ఈ పదకొండేళ్ల ఆయన ఓడలు బండ్లయ్యాయి. ఇపుడాయన ప్రయాణించే విమానం ధర కంటే ఆయన ఆస్తి కొద్దిగా ఎక్కువ.

ఆయన ఆర్థికసామ్రాజ్యం విలువ ఇపుడు కేవలం 523 మిలియన్ అమెరికన్ డాలర్లే. ఇది కూడా ఆయన తాకట్టుల్ పెట్టిన షేర్ల తో కలిపి. ఈజూన్ పదకొండు నాటికి తాకట్టులో లేని ఆయన ఆస్తుల విలువ కేవలం 109 మిలియన్ అమెరికాడాలర్లే. అంటే రు. 765 కోట్లే అన్నమాట.

ఇదేమంత పెద్ద ఆస్తి కాదు. ఆయన ప్రయాణించే బంబార్డియర్ గ్లోబల్ ఎక్స్ ప్రెస్ జెట్ విమానం ధర కంటే రెండు రెట్లే ఎక్కువ.

నాలుగు నెలల కిందట ఆయన నాయకత్వంలోని ది రిలయన్స్ గ్రూప్ విలువ రు. 8000 కోట్లుగా అంచనా వేశారు. అయితే, అప్పులు చెల్లించలేకపోవడంతో ఆయన తాకట్టు పెట్టిన షేర్లన్నింటిని రుణదాతలు సొంతం చేసుకున్నారు.

తన జాయింట్ వెంచరయిన రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఎసెట్ మేనేజ్ మెంట్ ను అమ్మేయడంతో ఆయన ఆస్తుల విలువ అమాంతంపడిపోయింది. ఆయన ఆస్తి కుంచించుకుపోవడానికి మరొక కారణం, ఆయనకు చెందిన షేర్లన్నీంటిని అప్పుల కింద రుణదాతలు సొంతం చేసుకోవడమో లేక మార్కెట్ ధరలు పడిపోవడమోనని నిపుణులు అంటున్నారు.

మొత్తానికి అనిల్ అంబానీ పతనానికి చేరువలో ఉన్నారు. 2018 మార్చి నాటికి ఆయన తలకాయ మీద ఉన్న అపులు తడిసి మోపడయిన రు. 1.7లక్షల కోట్లుకు చేరుకున్నాయి.

ఆస్తులన్నీ అమ్మేసి కడితే రుణ భారం తగ్గుతుందేమోగాని ఆయన సామ్రాజ్యం కుప్పకూలిపోతున్నది. గత పద్నాలుగు నెలల్లో రు. 35 వేల కోట్ల రుణాలు అంటే 24,800 కోట్ల అసలుమొత్తం, రు. 10,600 కోట్ల వడ్డీ చెల్లించినట్లు చెబుతున్నారు.

ఇపుడు అనిల్ అంబానీ మొత్తం ఆస్తంతా కలిపి అన్న ముఖేష్ అంబానీ ఇల్లు ‘యాంటిల్లా’ అంత విలువ కూడా చేయదని చెబుతున్నారు. ముఖేష్ అంబానీ ఇంటి విలువ దాదాపు 2 బిలియన్ అమెరికా డాలర్లు….