2010 అమిత్ షా అరెస్టు, 2019 చిదంబరం అరెస్టు … చాలా పోలికలున్నాయ్…

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని అరెస్టు చేయించి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చిదంబరం మీద 2010 నాటి తన  అరెస్టును గుర్తు చేశారు.  అదెలాగంటే…
గతంలో ఒక సారి మాజీ గుజరాత్ హోమ్ మంత్రి అమిత్ షాని సిబిఐ అరెస్టు చేసింది. అమిత్ షా కు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి అంత్యంత సన్నిహితుడు. హోమ్ మంత్రి. సిబిఐ కేసు వల్లే ఆయన మంత్రి పదవి వదలుకోవలసి వచ్చింది.
ఇది 2010 జూలై 25 న (ఆదివారం నాడు) జరిగింది. చాలా నాటకీయ పరిణామాల అనంతరం సిబిఐ అహ్మదాబాద్ లో అమిత్ షాని అరెస్టు చేసింది.
ఇది కూడా చదవండి :
చిదంబరం చేసిన నేరం ఏమిటి?
అపుడు అమిత్ షా అరెస్టును తప్పించుకునేందుకు నాలుగు రోజులు పరారయ్యారు.  అమిత్ షా సోరాబుద్దీన్  అనే వ్యక్తిని  ఫేక్ ఎన్ కౌంటర్ చంపించిన కేసులో చిక్కుకుని ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించారు. అమిత్ షా మీద సిబిఐ చార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేసింది. ఇక అరెస్టు మిగిలింది.
ఈ విషయం పసిగట్టిన అమిత్ షా అరెస్టు తప్పించుకునేందుకు   అజ్ఞాతంలోకి వెళ్లారు.నాలుగు రోజుల తర్వాత బిజెపి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రత్యక్షమయ్యారు. విలేకరుల సమావేశంలో తన మీద వచ్చిన ఆరోపణలన్నింటిని ఖండించారు. అపుడు కేంద్ర హోం మంత్రి ఎవరనుకుంటున్నారు…  పి. చిదంబరం.
సోరాబుద్దీన్  ఎన్ కౌంటర్ కేసులో సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేయగానే ఆయన నరేంద్రమోదీ ప్రభుత్వం నుంచి రాజీనామా చేశారు.
అరెస్టు చేశాక షా ని సిబిఐ అధికారులు గాంధీనగర్ లోని సిబిఐ ఆఫీసుకు తరలించారు.
అపుడు షా ని తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టులో పట్టుబట్టలేదు.
షా మీద ఉన్న ఆరోపణలు : మర్డర్, కిడ్నాపింగ్, డబ్బు అక్రమవసూలు, సోరాబుద్దీన్ ఎన్ కౌంటర్, అతని భార్య కౌసర్ బీ హత్య కు సంబధంచిన మరి కొన్ని కేసులు.
అరెస్టు తర్వాత షాని అహ్మదాబాద్ లోని సబర్మతీ జైలు కు తరలించారు.
తన మీద కేసులన్నింటిని కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తూ ఉందని షా ఆరోపించారు.
సర్ఖేజ్ నియోజకవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికయిన షా 2002 నుంచి నరేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.
షా , చిదంబరం కేసుల్లో పోలికలు…
1.ఇద్దరు అరెస్టును తప్పించుకునే అజ్ఞాతంలో ఉన్నారు.
2. అజ్ఞాతం నుంచి ఇద్దరు పార్టీ కార్యాలయాల్లోకి వచ్చి తమ కేసులను అక్రమంగా రాజకీయ దురుద్దేశంతో బనాయించారని చెప్పారు.
2. ఇద్దరు కేసులు ‘కుట్ర’ అని ఆరోపించారు.
తేడా… అపుడు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేశాక అమిత్ షాని అరెస్టు చేసింది. ఇపుడు సిబిఐ ఇంకా చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. తమ మీద చార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు అని కార్తీ చిదంబరం ప్రశ్నిస్తున్నారు. సిబిఐ దగ్గిర ఆధారాలు లేవని ఆయన చెబుతున్నారు.
ఇపుడు  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.

(అయితే, సిబిఐ మినిస్ట్రీ ఆఫ్ పర్సొనెల్, పబ్లిక్ గ్రీవెన్సెస్అండ్ పెన్షన్స్ (Ministry of personnel, public grievances and pensions DOPT) శాఖ కింద ఉంటుంది. ఈ శాఖను పర్యవేక్షించేంది ప్రధాన మంత్రియే. అయితే చిదంబరం, షాలు  చాలా పలకుబడి ఉన్న మంత్రులు.  కాబట్టి ఈ శాఖను ప్రభావితం చేయగలరేమో.)

https://trendingtelugunews.com/what-is-the-inx-media-case-that-is-troubling-p-chidambaram/