పార్లమెంటులో చాలా మంది బల్ల గుద్ది, గట్టిగా ఆరచి తాము చెప్పేది నిజమని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది సభ వెల్ లోకి వెళ్లి కార్యకలాపాలను అడ్డుకుని తమ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అవతలి పక్షాన్ని ఒప్పించాలన్న ఆశయం కంటే, గట్టిగా మాట్లాడాలనే ఉద్రేకం ఇందులో ఎక్కువగా ఉంటుంది.
సూదిని జైపాల్ రెడ్డి (1942 జనవరి 16- 2019 జూలై 28) దీనికి భిన్నంగా చాలా సౌమ్యంగా, ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా, భాషను బాణంలాగా ప్రయోగించి, రూలింగ్ పార్టీని బంధించే వాడు. ఉక్కిరి బిక్కిరి చేసేవాడు.
ఈ సంప్రదాయం పాటించిన బిజెపియేతర పార్లమెంటేరియన్ లలో జైపాల్ రెడ్డిచివరి వాడు. ఆయనతో పార్లమెంటేరీ మేధావులు అనే తరం అంతరించిపోయింది.
ఇక ముందు పార్లమెంటులో జైపాల్ రెడ్డి లాంటి మేధావి కనబడరు. ఎందుకంటే, జైపాల్ రెడ్డి పాలిటికల్ ఫిలాసఫర్. రాజకీయంగా బాగామాట్లాడే వాళ్లు రావచ్చు. ఫిలాఫర్లు రావడం కష్టం.
జైపాల్ రెడ్డి రాజీపడని హేతువాది. సెక్యులర్. ఆయన విమర్శలు నిస్సంకోచంగా ఉంటాయి. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడు ఆయన్నికూడా జైపాల్ రెడ్డి వదలి పెట్టేవాడు కాదు.
పార్లమెంటులో రెండు రకాల ప్రసంగాలుంటాయి. ఒకటి తిట్టు లేద భజన. రెండోది వాదం. జైపాల్ రెడ్డి వాదాన్ని తన మార్గంగా ఎంచుకున్నాడు. తార్కికంగా ప్రంసగించేవాడు. వితండం ఉండేది కాదు.
సాధారణంగా పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ సభ్యలు తమ నేత మెప్పు కోసం ప్రసంగిస్తుంటారు. ట్రెజరీ బెంచెస్ వాళ్లు ప్రధాని కంటపడేలా ప్రసంగిస్తారు. వీళ్ల ప్రసంగాలన్నీ ఒక పొగడ్తలు, మరొక వైపు తెగడ్తలు ఉంటాయి.
జైపాల్ రెడ్డి ఇలా కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో ప్రసంగించే వాడు.
జైపాల్ రెడ్డి రాజకీయనాయకుడి లాంటి ఫిలాసఫర్ ని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అని కుదించడం ఆయన్ని పూర్తిగా అర్థంచేసుకోవడం కిందికి రాదు.
మైకులు విసిరేస్తూ పైపైకి దూషించడం కాకుండా,రాజకీయ అక్రమాల, ప్రజాస్వామ్య పతనం ఫౌండేషన్ తాకేలా ఆయన ప్రసంగాలు ఉండేవి. అందుకే అర్థం చేసుకున్నవాళ్లని ఆయన ప్రసంగాలు విపరీతంగా బాధించేయి.
నాటి ప్రధాని వాజ్ పేయి కూడా చాలా సార్లు జైపాల్ ప్రసంగంతో తట్టుకోలేకపోయి, ఆయన అంగవైకల్యం మీద కూడా కామెంట్ చేశారు. జైపాల్ రెడ్డి ప్రసంగాలు ఒక తాత్వికంగా ఉంటాయి. తన వాదనతో రూలింగ్ పక్షంలో తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ కల్గించేవాడు.
ఇపుడు పరిణామం చెందుతున్న పార్లమెంటరీ రాజకీయాలలో ఇమడలేననే భావం ఆయనలో చాలా రోజుల కిందటే వచ్చింది. ఈ పరిణామాన్ని ఆయన మనస్పూర్తిగా ఆహ్వానించాడు, ఈ పరిణామం అనివార్యం అన్నాడు.
ఆ పరిమాణం ఎమిటంటే దేశంలో రాజకీయాలు సార్వజనీనం కావడం. మండల్ రాజకీయాల తర్వాత అట్టడుగు ప్రజల ప్రతినిధులకూడా పార్లమెంటులోకి వస్తారు. ఇదొక పరిణామం. దీనితో పార్లమెంటు స్వరూపంమారిపోతుందని ఆయన ఎపుడో గ్రహించారు. దీనినే commonization of Parliamentary democracy అని ఆయన అన్నారు.
‘పూర్వం విదేశాలలో చదువుకుని వచ్చిన న్యాయవాదులు, లేదా జాతీయోద్యమంలో పాల్గొన్న వారు పార్లమెంటుకు వచ్చే వాళ్లు. అందుకే వాళ్ల ప్రసంగాలు కూడా అదేస్థాయిలో ఉండేవి. అందులో సాధారణ ప్రజలకు పనికొచ్చే కంటెంట్ తక్కువ. దేశంలో రాజకీయలు విశాలమవుతున్నాయి. రిజర్వేషన్ల వల్ల చట్ట సభల్లోకి అన్ని వర్గాల ప్రజలు, చదువు పెద్దగా లేని వాళ్లు వస్తున్నారు. వాళ్లు పార్లమెంటులోకి నిత్యజీవితంలోని సమస్యలను తీసుకువచ్చారు.ఇది గొప్పపరిణామం కాదని ఎలా అనగలం. దీనికి నిత్యజీవితంలో వాడేభాష ను ప్రయోగిస్తున్నారు. అందువల్ల పార్లమెంటులో అపుడపుడు పరుష పదజాలం, గొడవలు జరుగుతాయి. ఇది అనివార్యం’ అని ఆయన ‘ వార్త’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
రాజకీయాలు సార్వజనీనం అవుతున్నపుడు తన లాంటి వాళ్లకు చోటు దొరకదని కూడా గమనించారు. ఆయన ఓటమి నిజానికి రాజకీయాల సార్వజనీనం పీక్ లో ఉన్నపుడు జరిగింది.
తెలంగాణ ఉద్యమం తర్వాత ఆయన పార్లమెంటరీ రాజకీయాలకు దూరంకావడం మొదలయింది.
అందుకే తానెపుడూ బహిరంగంగా మాట్లాడని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాల్సి వచ్చింది. గాంధీభవన్ లో కూడా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేశారు. ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద గురి పెట్టడం మొదలు పెట్టారు.
ప్రతి విషయం కొద్ది రోజులే వెలుగులో ఉంటుంది. తర్వాత ఎక్సపయిర్ అయిపోతుంది.చారిత్రకాంశంగా మిగిలిపోతుంది.
జైపాల్ రెడ్డి కూడా గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాన్ని మొన్న మొన్నటి దాకా మోసుకువచ్చారు. ఇంద్రజిత్ గుప్తా, గురు దాస్ దాస్ గుప్తా, గీతా ముఖర్జీ, అశోక్ మిత్రా వంటి వారు ప్రాతినిధ్యం వహించిన ఎక్స పయిర్ అయిపోతున్న మహోతన్న సెక్యులర్ పరంపరంలో ఆయనే చివరి వాడు. ఆయన తరహా రాజకీయాలకు ఇపుడు చోటు లేదు.
ఆగస్టు 18,2003న లోక్ సభ వాజ్ పేయి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిని అప్పటి ప్రతిపక్ష నేత సోనియా గాంధీ ప్రతిపాదించారు.
చర్చలో జైపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మొత్తం చర్చలో జైపాల్ రెడ్డి ప్రసంగమే హైలైట్. ఆయన ప్రసంగంలోని కొన్ని అంశాలను మాత్రం ఇక్కడ యధావిధిగా uneditedగా ఉదహరిస్తున్నాం.
MR. SPEAKER: Shri Jaipal Reddy, if you do not stand up and speak, I will have to announce another Member’s name. You will have to speak now.
SHRI S. JAIPAL REDDY (MIRYALGUDA): Mr. Speaker, Sir, I rise to support the No-Confidence Motion moved by the Leader of the Opposition, Shrimati Sonia Gandhi. This I do, not in a desiccating debating mode but with a view to conveying one consuming concern to the people outside about the numerous shortcomings and atrocious wrongdoings of this Government.
Sir, the most cardinal aspect of this Government in my considered view is its fascistic character, and the fascistic character has two faces: One is the Hitlerite face, as part of which certain groups are targeted, which is now called ethnic cleansing; the other is the nakedly corrupt and brazenly authoritarian aspect. Today, I wish to deal with the second aspect, namely, the outrageously opportunistic and oppressive nature of this Government…
For want of time, I will not deal with the first face. This is a Ministry which is held together through a mighty chain of mutual blackmail. You have Ministers who are facing charge-sheets and you have Ministers who are facing grave charges. They are holding one another to reciprocal ransom. That is the secret of the numerical strength of this Government. This is a scam-ridden Government. The scams have been enumerated by our leader in the morning. I do not want to go into all that. They are monumental and multitudinous. For want of time, I propose to focus on one or two such things. Nothing illustrates the degeneracy and depravity of this Government as Tehelka expose. This expose produced the effect of an earthquake in New Delhi on March 13, 2001. The epicentre of this earthquake was the NDA and it produced many tremors. First, it was a culture shock. I am referring to all this because the memory of the people is short and the memory of leaders of the NDA is even shorter. Therefore, I would like to recapitulate some of these basic facts. I want to refresh their memory. National leaders were seen accepting money literally on camera. That was a culture shock.
2
SHRI S. JAIPAL REDDY : Therefore, I would say, Sir, it is not only a story of bribery; it is a story of trickery, it is a story of treachery, it is story of tyranny..… (Interruptions)I will come to that, Sir. …
In the meantime, 9/11 took place; the World Trade Centre was struck; the Pentagon was struck by terror. It was a terrible, terrible bane for America and the world. But may I also tell you that it was a terrific, terrific boon for Shri George Fernandes! What was a bane for the world turned out to be a boon for Shri George Fernandes.
Lo and behold! Shri George Fernandes returned to the Cabinet and Tehelka became a George-centric issue. Who made Tehelka a George-centric issue? It is the Prime Minister of India who by taking Shri George Fernandes into the Cabinet has made Tehelka a George-centric issue. Shri George Fernandes does not even know who his enemies are. Of course, we are his enemies. But he has many in his own ranks. Anyway, this is what happens to all those who conspire with the fascist forces!
When Shri George Fernandes returned, what was the impression? Every leading newspaper wrote about it. I did not bring them because I did not want to waste the time of the House. Shri Advani’s latest intellectual icon is Shri Amitabh Bachchan. Unfortunately he is not mine. I can read the editorials whose writers are not necessarily my intellectual icons. Almost every newspaper condemned the re-induction of Shri George Fernandes. It is not only a case of condonation of corruption, but a case of coronation of corruption; I repeat, it was a case of coronation of corruption. It signalled sanction for shamelessness. It is an epic example of enthronement of effronteey!
3
What has happened to the legendary integrity of this Government headed by a veteran Prime Minister? How come not a single FIR was filed? Military personnel were suspended, Defence officials were suspended, but no middlemen was approached by either the CBI or by the police, or by the Income Tax Department or by the Enforcement Directorate. How can there be two standards? How can one standard be applied to poor military personnel and how can another standard be applied to middlemen? Politicians of the ruling party and middlemen were treated with equal impunity by this Government. So, we do not know whether politicians of NDA are middlemen or middlemen in Delhi are politicians of NDA.
4
So, this is the point that I am making – I know I have taken much of my party’s time more than the time of the House – this is the kind of immorality that is represented by this Government. In my view, this Ministry represents a miasmic mix of immorality, impudence and impunity. I am absolutely persuaded that the people of India are dissatisfied with the all-round malperformance of this Government. Since, we cannot throw out this Government, we request Shri Advani to give effect to his great idea of having synchronised poll; and to go in for polls in November, people will defeat him.
(Parliament of India website నుంచి)
జైపాల్ రెడ్డి మృతి
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి ఈ అర్థరాత్రి 1:28 లకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
జైపాల్ రెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 16 జనవరి 1942 లో జన్మించారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై మక్కువ ఎక్కువ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీష్ లిటరేచర్,BCJ అభ్యసించారు.
OUలో విద్యార్థి నాయకుడిగా ఉంటూ 1969లో తొలి సారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
1969 నుంచి 1984 దాకా కాంగ్రెస్ జనతా పార్టీల అభ్యర్థిగా కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందుతూ వచ్చారు.
1984 లో తెలుగుదేశం పార్టీ పొత్తు తో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారి విజయం సాధించారు.
1998లో కూడా మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. అనంతరం 1999.. 2004 సంవత్సరాలలో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు.
2009లో చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఎంపీగా విజయం సాధించారు 1990,1996 లలో రాజ్యసభ సభ్యుడిగా కూడా జైపాల్ రెడ్డి కొనసాగారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. 2004 ,2009 కాంగ్రెస్ హయాంలో కూడా కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.