అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ట్రబుల్ షూటర్ గా ఎక్కడ చూసినా కనిపించిన తన్నీర్ హరీష్ రావు ఎన్నికల తర్వాత మటుమాయం అయ్యారు.ఆయన స్థాయి ట్రబుల్ షూటర్ నుంచి సిద్ధిపేట్ ఎమ్మెల్యే స్థాయికి కుదించుకుపోయింది.
నియోజకవర్గంలో అక్కడక్కడా జరిగే కార్యక్రమాల్లో తప్ప మునుపటిలాగా హై ప్రొఫైల్ కార్యక్రమాల్లో ఎక్కడ కనిపించడంలేదు.ఆయన ఇక క్రియాశీల రాజకీయాల్లో ఉండేరేమో నని అనుమానం సర్వత్రా ప్రబలేందుకు కారణంఇదే.ఇది నిజమా అన్నట్లు ఆయన పేరు ఇపుడు లోక్ సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో నుంచి కూడా మాయమయింది.
పార్టీ తరఫును ప్రచారంచేసే నాయకుల పేర్ల జాబితా టిఆర్ ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందించింది. ఇందులో 20 మంది లీడర్ల పేర్లున్నాయి. స్పష్టంగా కనిపిస్తున్న లోటు హరీష్ పేరు లేకపోవడం. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెశిడెండ్ తారాక రామారావుతోపాటు ఎమ్మెల్సీీీల పెర్లు ఉన్నాయి.
జాబితాలో పదకొండుమంది మంత్రులున్నారు. వివరాలివే…
తలసాని శ్రీనివాస్ యాదవ్
గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి
మహమూద్ అలీ
ఇంద్రకరణ్ రెడ్డి
కొప్పుల ఈశ్వర్
ఎర్రబెల్లి దయాకర్ రావు
నిరంజన్ రెడ్డి
ప్రశాంత్ రెడ్డి
శ్రీనివాస్ గౌడ్
కేటీఆర్
కేశవరావు
సంతోష్ రావు
బండ ప్రకాష్
పల్లా రాజేశ్వర్ రెడ్డి,
శేరి సుభాష్ రెడ్డి,
శ్రవణ్ కుమార్ రెడ్డి
రవీందర్ రావు
సి హెచ్ మల్లారెడి
హారీష్ రావును పార్లమెంటుకు పంపించి ఆయన భార్యను సిద్దిపేట ఎమ్మెల్యే గా పోటి చేయిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ హరీష్ కు పార్లమెంటు స్థానం కేటాయించలేదు. మరో వైపు హారీష్ కు రెండో జాబితాలో కూడా మంత్రి పదవి దక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన హారీష్ కేవలం సిద్దిపేట ఎమ్మెల్యేగానే పరిమితం అయ్యారు. దీంతో హారీష్ కు పార్టీలో ప్రాధాన్యం తగ్గి పోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.