చైనాలో కోవిడ్ స్థితి గురించి కొన్ని వాస్తవాలు

 

  సేకరణ, అనువాదం : డాక్టర్. యస్. జతిన్ కుమార్

అవార్డు గ్రహీత జర్నలిస్ట్ సిమోన్ గావో ప్రస్తుత కోవిడ్ -19 స్థితి మరియు వాస్తవ మరణాల సంఖ్య గురించి చైనా అబద్ధాలను  చెబుతోందని  రాస్తోంది.  ఆమె చైనాలో ప్రవేశించి వాస్తవాలను చూసి, ఋజువుగా చాయా చిత్రాలను , వీడియోలను  సేకరించి  రాస్తున్నదా  అంటే కాదు, తాను ఒక్కతే కాదు పాశ్చాత్య మీడియా చాలావరకు పాక్షిక దృష్టితోనే  వార్తలను వక్రీకరించి ప్రచురిస్తున్నాయి. 

చైనా ప్రజలు గుంపులు గుంపులుగా గా చనిపోతున్నారని, ప్రతిచోటా మృతదేహాలు ఉన్నాయని ,వాటిని మరియు ఏమి చేయాలో ఎవరికీ తెలియటం లేదు అని ఆమె రాస్తుంది. ఇలాటి పాశ్చాత్య  రాతల ఆధారంగానే భారతీయ మీడియా కూడా వార్తలు వడ్డిస్తోంది. స్వతంత్రమైన, ప్రత్యక్ష పరిశీలనల ఆధారంగా విషయాలు చెప్పటం లేదు. పైపెచ్చు చైనా ప్రభుత్వం ఇచ్చిన సమాచారం, గణాంకాలు అబద్దాల పుట్టలని, అక్కడ మొత్తం ప్రెస్  ప్రభుత్వ ఆధీనంలోనే వుండటం వల్ల అది నమ్మశక్యం కానిదని  ముందే దురభిప్రాయం తో  కొందరు రాస్తున్నారు.  రోజు కోట్ల మంది కోవిడ్ బారిన పడుతున్నారని, లక్షలాదిమంది  చనిపోతున్నారని వార్తలు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలపై కూడా అనుమానాలు  లేవనెత్తుతున్నారు.

మొన్నటి వరకు కోవిడ్  ఆంక్షలు, నిబంధనలు పాటించినందుకు చైనా ప్రభుత్వాన్నినిరంకుశత్వంగా నిరసించిన వాళ్ళు, ఇప్పుడు ఆ ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఎత్తివేసినందున, కొన్ని వెసులుబాట్లు కల్పించినందున వ్యాధి విజృంభించిందనీ , ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిందని దుష్ప్రచారం చేస్తున్నారు.  అయితే ఆదేశంలోని బ్లాగర్లు. సోషల్ మీడియాలో కొందరు ప్రజలు పెడుతున్న వార్తలు, వార్తా చిత్రాల ద్వారా భిన్నమైన కథనాలు, వాస్తవాలు మన ముందుకు వస్తున్నాయి.      

ఈ వ్యక్తి – వాస్తవానికి చైనాలో నివసిస్తున్నాడు. అతను నగరం అంతటా ప్రయాణిస్తాడు.అతను ఇప్పటికే వ్యాధి బారిన పడి కోలుకున్నాడు కనుక అతడు మాస్క్ కూడా  ధరించలేదు.

లాక్డౌన్లను ఖచ్చితంగా పాటించేలా చూడటానికి చైనా ప్రభుత్వం చిత్రీకరించిన భయానక  చిత్రం కారణంగా మొదట్లో చైనీయులు కోవిడ్ 19 గురించి చాలా భయపడ్డారు. వారు ఆసుపత్రులలో  కిక్కిరిసిపోయారు అని కొందరు రాశారు.  కానీ  ప్రస్తుతం పరిస్థితి అలా లేదు అని ఇతను చెబుతున్నాడు. ప్రస్తుతం చైనా అనుసరిస్తున్న “ డైనమిక్ జీరో పోలసీ” వల్ల కొన్ని సర్దుబాట్లు చేశారు. వ్యాధి కారక వైరస్ బలహీన పడటం వల్ల  వైరస్  నిరోధం పట్ల కంటే, వ్యాధి తీవ్రత ను తగ్గించటానికి, మరణాలను అరికట్టడానికి వైద్య రంగం ప్రాధాన్యత నిస్తోంది. ముప్పు సంభవించగల జన సమూహాలపై దృష్టి కేంద్రీకరించి  మిగిలిన ప్రజలకు కొన్ని సడలింపులు ఇచ్చింది.   

ఈ రోజు అక్కడ అనేక  గ్రాస్ రూట్ [అతి ప్రాధమిక] క్లినిక్ లు, ఫీవర్ క్లినిక్ లు ఉన్నాయి. వీటిలోనే  రోగులు ఎక్కువగా చికిత్స పొందుతున్నారు.బీజింగ్ లోని ఫీవర్ క్లినిక్ లు మరియు గ్రాస్ రూట్ క్లినిక్ లకు వెళ్లిన 10,600 పాజిటివ్ రోగుల గురించి  మా వ్లాగర్ తెలుసుకున్నారు. వీరిలో కేవలం 24 కేసులు మాత్రమే ఆసుపత్రిలో చేర్చ తగినంత తీవ్రంగా ఉన్నాయి, అందులో మూడు కేసులు మాత్రమే  ఊపిరితిత్తుల పని విధానం దెబ్బతినడం తో ఐసియులో చేర్చబడ్డాయి .అంటే 3500 మందిలో ఒకరు ఐసీయూ లో, 460 మందిలో ఒకరు ఆసుపత్రిలో చేరవలసి  వచ్చింది. లక్షల మందికి పరీక్షలు పాజిటివ్ గా వస్తున్నాయి కానీ  వారిలో ఐసియులో చేరవలసిన  ఆవశ్యకత, సంభావ్యత చాలా తక్కువ.అనారోగ్యంతో ఉన్న ప్రతి  వారికి  అవసరమైతే మంచం లభిస్తుంది

ఉదాహరణకు వుహాన్ లో నిన్న 50 తీవ్రమైన కేసులు ఆసుపత్రిలో చేరాయి, వారిలో అతి పిన్న వయస్కుడు 43 సంవత్సరాలు, రెండవ అతి పిన్న వయస్కుడు 78 సంవత్సరాలు. అందరికంటే పెద్దవాడు 97 సంవత్సరాలు.

బీజింగ్ లో నివసిస్తున్న మరొక వ్లాగర్ సైరస్ జన్నెసెన్. ఈయన అక్కడి ప్రజలతో మాట్లాడి సవిస్తరమైన సమాచా రాన్ని పొందుపరిచారు. మరణాలు కనిష్టంగా ఉన్నాయని  ఆయన స్పష్టం చేస్తున్నారు.

 

చైనా ప్రస్తుత పాలసీ కింద-కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించిన రోగి శ్వాసకోశ వైఫల్యం, ఎ ఆర్ డిఎస్, సిఓపిడి లేదా న్యుమోనియా వల్ల  మరణిస్తే అది కోవిడ్ మరణంగా పరిగణించబడుతుంది.8/12/22 నుండి బీజింగ్ లో 24 మరణాలు , 8/12/2022 నుండి చైనా ప్రధాన భూభాగంలో 77 మరణాలు కోవిడ్ 19 వల్ల నేరుగా సంభవించాయని ప్రభుత్వం నివేదించింది  

హ్యాపీ పీపుల్ –డైన్ ఇన్ లు, కాఫీ షాపులు జనంతో నిండి వుంటున్నాయి. సాధారణ జీవితం ఏ మాత్రం చెదిరిపోలే దని ఆయన రిపోర్టు చేశారు.

100.5 నుండి 102 డిగ్రీల జ్వరం ఉన్నవారు గ్రాస్ రూట్ క్లినిక్ [అతి దగ్గరలో వుండే ప్రాధమిక క్లినిక్] కు  వెళతారు. 102 నుండి 104.5 డిగ్రీల జ్వరం ఉన్నవారు ఫీవర్ క్లినిక్లకు వెళతారు. ఒక్క బీజింగ్ నగరం లోనే గతంలో  వున్న  90  ఫీవర్ క్లినిక్ లను ఈ వారం, పది రోజులలో 1050 కి పెంచారు. జ్వరం 104.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ లేదా ఆక్సిజన్ [ఎస్పీ02] 92% కంటే తక్కువ వున్నవారికి అంబులెన్స్ వస్తుంది. అలాటి వారికి  ఎక్స్ రే చేయిస్తారు. ఊపిరితిత్తులు బాగుంటే – కొన్ని పాక్సోలిడ్ యాంటీవైరల్ మందులు ఇచ్చి చికిత్స చేస్తారు. ఆక్సిజన్ 96% లేదా అంతకంటే ఎక్కువకు పెరిగి నప్పుడు ఇంటికి  పంపిస్తారు. 8 గంటల్లో చేసిన పరీక్షల్లో   కనీసం 3 రీడింగులలో నయినా 96% వుండాలి. అప్పుడే ఇంటికి పంపుతారు. SP02 88% లేదా అంతకంటే తక్కువకు పడిపోయినప్పుడు రోగిని  ఆక్సిజన్ గల ఛాంబర్ కు పంపుతారు.  8 గంటల తరువాత పరిస్థితి మెరుగుపడకపోతే – రోగిని ఐసియులో చేరుస్తారు 

ఇది ఒక  రెస్టారెంట్,  చాలా రద్దీగా ఉంది. వ్లాగర్ కూర్చోవడానికి గంట సేపటి వరకు స్థలం పొందలేకపోయాడు

ప్రజలు గుంపులు గుంపులుగా గా చనిపోతున్న నగరం ఇలా వుంటుందా? అదే జరిగితే ఏ దేశంలోనయినా ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి పోతారు. బయటకు ప్రయాణించడం గురించి ఆందోళన చెందుతారు. చైనా ప్రజలు తమ  నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటానికి విదేశాలకు వెళ్ళటానికి  చాలా మంది  వీసాల కోసం అప్లయి చేసుకున్నారు. దేశీయంగా  పర్యాటక స్థలాల ప్రయాణాలకోసం పెద్దఎత్తున విమాన టికెట్లు కొంటున్నారు. కోవిడ్, నిబంధనలు, ఆంక్షలు  సడలించిన తరువాత జన జీవనం అతీత్వరగా మారిపోతున్నది.  పాశ్చాత్య మీడియా చిత్రిస్తున్నట్లు వ్యాధి ఉదృతంగా వుంటే ప్రజలు ఈ విధంగా ప్రయాణాలు, వినోద కార్యక్రమాలు పెట్టుకుంటారా? ప్రభుత్వం నిబంధనలు ఎత్తివేసినా  ప్రజలు తమ స్వంత జాగ్రత్తలు తీసుకోరా?

ఇది ఒక  ఆల్ నైట్ రెస్టారెంట్. అది ఎంత నిండుగా ఉందో చూడండి

ప్రజలందరూ మాస్కులు కూడా ధరించిలేరు. పరీక్షించుకోవడం, కొందరు పాజిటివ్ గా తేలడం, తేలికపాటి అనారోగ్యా నికి గురికావడం, ఎక్కువ మంది 3 లేక 4 రోజుల్లో కోలుకోవడం జరుగుతోంది.

ఆగస్టు 2021 ప్రారంభంలో మా వ్లాగర్ అనారోగ్యానికి గురైనప్పుడు, కోలుకోవడానికి అతనికి 8 రోజులు పట్టింది కీళ్ళలో నొప్పి, అలసట వంటివి తగ్గటానికి 40 రోజులు పట్టింది. ఇప్పుడు వైరస్ బలహీనంగా వుంది, అయితే  దాని సంక్రమణ శాతం మాత్రం ఎక్కువ. కనుక ప్రస్తుతం అధిక సంఖ్యలో పాజిటివ్ లు వున్నా వారు కొలుకోవటానికి  స్వల్పసమయ మే పడుతున్నది. అందరూ బాగుపడతారు. మరణాల సంఖ్య చాలా తక్కువ. ముప్పు అధికంగా సంభవించే అవకాశం వున్న వృద్ధులు, ఇతర జన సమూహాల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. వారికి అదనంగా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నారు. వ్యాక్సిన్ల కంటే చాలా మంది వృద్ధ  చైనీయులు సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ను ఎక్కువగా విశ్వసిస్తారు. వాటితో  తమ రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసుకుంటున్నారు. అందుకే చనిపోయిన వారిని తీసుకెళ్లే అంబులెన్స్ లు  కనపడటం లేదు.

మన వ్లాగర్ కుర్రాళ్ళు చైనాలోనే  నివసిస్తున్నారు, వారికి క్కడ ఇళ్లు వున్నాయి. వారి కుటుంబాలు అక్కడే  ఉన్నాయి, వారు చైనా అంతటా తిరుగుతూ ప్రజలతో మాట్లాడతారు. వారి బ్లాగులను పోస్ట్ చేస్తారు, వారు తైపీ లేదా న్యూయార్క్ లేదా లండన్లో నివసిస్తున్న సిమోన్ లేదా ఇతర జర్నలిస్టుల మాదిరిగా తెలిసీ, తెలియని  ట్విట్టర్ ఫీడ్లపై ఆధారపడి కథనాలు వండరు. తాము చూడనిది రాయరు. ఆ నేలపై ఉండి వాస్తవాలను గ్రహించి రిపోర్ట్ చేస్తారు.

ఈ వ్లాగర్లు –  పాశ్చాత్య ప్రచారాన్ని నెమ్మదిగా ఛేదించేలా చూడటానికి సహాయపడతారు. వాస్తవ వార్తలను కోరుకునే వాస్తవిక వాదులు ,హేతువాదులు – పాశ్చాత్యులు ఎంత అబద్ధం చెబుతున్నారో ఇప్పుడు తెలుసు కుంటున్నారు. మరింత మంది  బ్లాగర్లు, చైనా లోని వాస్తవ పరిస్థితిని గురించి  మరిన్ని వీడియోలు, మరింత  నమ్మదగిన సమాచారం అందిస్తారని ఆశిద్దాము. పాశ్చాత్య ప్రచారం ఎప్పటిలాగే సగం ఉడికిన అబద్ధాల సమూహంగా కనిపిస్తుంది. ప్రపం చానికి వాస్తవం చూపిస్తున్న వ్లాగర్స్ ధన్యవాదాలు .

[ యూట్యూబ్ లో వ్లాగ్గర్  లైట్ ఫుట్ చైనా గురించి  పెట్టిన అనేక వీడియోలు లభ్యమవుతున్నాయి]

(ఇందులో వ్యక్తికరించినవన్నీ రచయిత అభిప్రాయాలు)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *