విజయవాడ, డిసెంబర్ 24:
ప్రాచీన తెలుగు భాష మూలాలను వెలుగులోకి తెస్తూ, “తెలుగు భాషకు ఆద్యులు – తెనుగోళ్ళు” సంకలన గ్రంథాన్ని ప్రచురణ చేయించిన పి.వి.ఎల్.ఎన్. రాజు, శ్రీమతి పిల్లి లక్ష్మీతులసి దంపతులను భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.
క్రీ.శ. 575 సo.లోనే రేనాడు రాజ్యాన్ని పరిపాలిస్తూ తొలిగా తెలుగుభాషకు సంపూర్ణ అక్షర రూపం కల్పించి, వాక్య నిర్మాణం చేసి తెలుగును తమ రాజ్యంలో రాజభాష (అధికార భాష)గా చేసి తొలి తెలుగు శాసనం కడపజిల్లా కమలాపురం తాలూకా కలమళ్లలోని శ్రీ చెన్నకేవస్వామి ఆలయ ప్రాంగణంలో వేయించారు.
శాసనపూర్వక ఆధారాలతో రాజు దంపతులు సంకలన గ్రంథ రూపంలో ప్రచురణ చేయించారని విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, వెంకయ్యనాయుడికి వివరించారు.
రాజు దంపతులు శనివారం ఉదయం వెంకయ్యనాయుడుని కలసి గ్రంధాన్ని అందించి శ్రీ షిరిడిసాయి బాబా శాలువాతో సత్కరించారు. ఈ గ్రంథము పై వెంకయ్యనాయుడు స్పందిస్తూ తెలుగు భాష ప్రపంచవ్యాప్తికి ఇలాంటి గ్రంథాలు దోహదపడగలవని అన్నారు..
రచయితల మహాసభలకు విచ్చేసి ముఖ్య అతిథులకు, ప్రతినిధులకు సంకలన గ్రంథం అందచేత
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరియు సభలకు హాజరు అయిన ప్రతినిధులందరికీసంకలన గ్రంథాన్ని ఉచితంగా అందజేయడంపై పలువురు ప్రస్తుతించారు.
ఈ మహాసభల్లో ఆత్మీయ అతిధిగా తొలితెలుగు దివ్వె సంఘ అధ్యక్షురాలు శ్రీమతి పిల్లి లక్ష్మీతులసి పాల్గొన్నరు.
ఈ సభల్లో పాల్గొన్న తొలి తెలుగు దివ్వె, తెలుగు మూలాల అధ్యయన సంఘం, అధ్యక్షులు, సంకలన కర్త, గ్రంథంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఎండకు ఎండి, వానక తడిచి శిధిలమైపోతున్న తొలి తెలుగు శాసనాలకు రక్షణ కల్పించి, భావితరాల కోసం తొలి తెలుగు శాసనాలన్నింటిని ఒకచోటకు చేర్చి మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరియు పురావస్తు శాఖ వారి దృష్టికి తీసుకు రావాలని, వారు స్పందించకపోతే తెలుగు భాషాభిమానులందరు ప్రతి ఒక్క ఒక్క రూపాయి ఇస్తే ఈ తొలితెలుగు శాసనాలు పాడవకుండా కాపాడతానని ఆవిడ తెలియజేశారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తనను గౌరవ అతిథిగా ఆహ్వానించిన సభల గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ కి, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జి.వి. పూర్ణచందు కు కృతజ్ఞతలు తెలియజేశారు.