రాయలసీమలో హైకోర్టు (ఉత్తిదే) హుళ్లిక్కే!రాయలసీమ ప్రాంత ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వైస్సాఖ్యానించారు. ఆయన ప్రకటన:
అమరావతిలోని హైకోర్టును(జుడిషియల్ క్యాపిటల్) రాయలసీమలోని కర్నూల్ లో ఏర్పాటు చేయబోతున్నామని కేంద్ర న్యాయశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని చందమామ కథలు చెప్పిన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నిన్న సుప్రీంకోర్టు సాక్షిగా ప్రభుత్వ న్యాయవాది ఏపీ హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతుంది అని చెప్పడం పై సీమప్రాంత ప్రజాప్రతినిధులు సమిష్టి ప్రకటన చేయాలి!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నేళ్లు అధికారంలో ఉన్నాము,ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నాము అన్నది ముఖ్యం కాదు పదవి ఉన్నంతలో సీమలో భారీ పరిశ్రమలు, నీటి ప్రాజెక్టులు,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఎన్ని కల్పించాము అన్నదానిపై అధికార పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి!రాయలసీమ ప్రాంతం కరువుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత చాలీచాలని జీతాలతో వ్యసనాలకు బానిసలై జీవితం అంధకారం చేసుకుంటున్నారు !రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు నిధులు కేటాయించి నీటి ప్రాజెక్టులు పూర్తిచేసి పరిశ్రమల స్థాపనకు సహకరించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అదే మహాభాగ్యం!రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పుణ్యకాలం పూర్తవుతున్నా రాజధాని ఎక్కడో ఇప్పటివరకు క్లారిటీ లేదు, కర్నూల్ కు హైకోర్టును తీసుకొస్తారా లేదా అన్నదానిపై సీమ ప్రాంత ప్రజా ప్రతినిధులకు కనీసం స్పష్టత కూడా లేకపోవడం శోచనీయం!రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ పార్టీలకతీతంగా జెండాలు,అజెండాలు పక్కనపెట్టి మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేసి ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకురావాలి,రాయలసీమకు న్యాయం జరగాలి!రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు,మేధావులు,విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను!రాయలసీమకు న్యాయం చేయాలని,సీమ ప్రాంత ప్రజల జీవితాలతో దాగుడుమూతలు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాయలసీమ వాసిగా డిమాండ్ చేస్తున్నాను!నవీన్ కుమార్ రెడ్డిరాయలసీమ పోరాట సమితి కన్వీనర్