బడిలో పాఠం చెప్పిన మేయర్ శిరీష

తిరుపతి  యం.జీ.యం హైస్కూల్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన నగర పాలక మేయర్ డాక్టర్ శిరీష.

 

తిరుపతి నగరపాల సంస్థ మేయర్ డాక్టర్ శిరీష బుధవారం మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ సందర్శించారు. మొదటగా మరుగుదొడ్లను పరిశీలించి నిర్వహణపై పలు సూచనలు చేశారు. గతవారం స్కూల్ ల్యాబ్ లో పెచ్చులు ఊడి పడిన పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత ఐదోవ తరగతి సందర్శించి విద్యార్థులను తెలుగు పాఠ్యాంశాల పైన చదివించి ప్రశ్నలు వేశారు, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చక్కగా విని బాగా చదువుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో జరిగే పాఠ్యాంశాలను ఇంటి దగ్గర కూడా చదవాలని, ప్రతిరోజు హోంవర్క్ రాయాలని తెలిపారు.
అంగనవాడి సెంటర్లో తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

అంగన్వాడి వంటగదిని పరిశీలించి తయారవుతున్న వంటిని పరిశీలించారు.

ఆ తర్వాత భవిత సెంటర్ విద్యార్థులతో మాట్లాడారు.
9వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులను హిందీ, సోషియల్ సబ్జెక్టును చదవమని అడిగారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో బాగా చదివి ఉండాలని తెలిపారు.
ఎన్.ఎం.ఎం.ఎస్ కి సెలెక్ట్ అయిన విద్యార్థులను ముగ్గురిని మేయర్ అభినందించారు.
ఉపాధ్యాయులను మరియు అంగన్వాడి టీచర్లను ఉద్దేశించి విద్యార్థుల్లో మంచి ప్రతిభ ఉండేటట్లు తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి చేతి వ్రాత యందు మెలకువలు సూచించాలని తెలిపారు, ప్రతిరోజు మెనూ ప్రకారం పిల్లలకు భోజనాలు వడ్డించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి జగనన్న విద్యా కానుక మరియు జగనన్న గోరుముద్ద విద్యార్థులందరికీ అందించాలని, ఇందులో అలసత్వం వహించరాదని ఉపాధ్యాయులను ఆదేశించారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సూచనలు చేశారు.
ఉపాధ్యాయులు కోరిక మేరకు అంగన్వాడి విద్యార్థుల కొరకు మరుగుదొడ్లును నిర్మాణం చేపడతామని తెలిపారు. మేయర్ వెంట కార్పొరేటర్ తూకివాకం శాలిని రెడ్డి, స్థానిక నాయకుడు తూకివాకం మహేష్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హేమాద్రి బాబు, డి.ఈ. మహేష్, ఉపాధ్యాయులు బండి మధుసూదన్ రెడ్డి, అమినిటి సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *