ఉసురుపై ముసురు పంజా
***
ముసురు ముసురుకొని
జడివాన జడలు విప్పుకొని
కుండపోతగా విజృంభించికురుస్తూ
ఉసురులను ఉసురుసురనిపిస్తూబతుకులను అతలాకుతలం చేస్తున్నది
కుండల్లోకి మెతుకులు వచ్చే దారి మూసేస్తున్నది
వామనరూపంలో వచ్చినవాన జలచక్రబంధమై జాడిస్తున్నది రోడ్లన్నీగుంతలే
పంటపొలాలు కుంటలను తలపిస్తున్నయి
నేలకనిపిస్తున్నా
కాలుపెట్టు జాగాలేక
బతుకుపయనం కకావికలం
ఇండ్లుకూలిబతుకులు
బజార్లవడు తుంటే
రెవెన్యు కవరేజ్ రేంజ్ లో అనుకున్నంత అప్రమత్తంగాలేదు
పసిపిల్లల ఆటమైదానం
తోకముడుచుకొని పండుకున్న పిల్లి
వణుకుడు తప్పించుకోనికె తండ్లాడుతున్న ముసలోళ్లు
కడుపుకింత తిండి దొరికే వీలులేక
అడుగు దాటడం లేని
ఆటో రిక్షాలు రిక్షాలు
ఇళ్లలోకి నీళ్లు జోర్రి ఇళ్లుకూలి
కలుగుల్లోంచి బయటపడిన ఎలుకల్లా తండ్లాడుతున్నరు జనాలు
ఎన్నాళ్ళు ముంచేస్తుందో ఈ జడివాన
తెగినకుంటలు చెరువులు జలవిహార
కేంద్రాలైనయి
బతుకుపై ఆశతో రైతులుఒకకంట కన్నీరు పారుతుంటే
మరో కంట సంతోష జలం స్రవిస్తున్నరు
పెదాలపై చిరునవ్వు
గుర్తులొస్తున్నా
బతుకుచూపులో గుడ్డితనం జోరబడి
భయపెడుతున్నది
ఇప్పుడు బతుకు కన్నీటి వరద భయాల బురద
బతుకులను పరేషాన్
చేస్తున్నది
ముసురు ఉసురుపై
పంజా విసరడం ఆగే దెప్పుడో!
ఆపేదెప్పుడో?
నేల దాహం బతుకు దాహం సజావుగా తీరేదెప్పుడో!?
-వల్లభాపురం జనార్దన
9440163687