ఈ మబ్బులు వర్షిస్తే బాగుణ్ణు
ఎంతసేపు అలా
ఉగ్గ పట్టుకుని ఉంటాయో తెలియదు!
మూడు రోజులుగా ఊరిస్తూనే ఉన్నాయి!
మబ్బులను స్పర్శించాలని ప్రయత్నించిన ప్రతిసారి
ఎందుకో పవనుడు పట్టు తప్పుతున్నాడు!!
ఈ మబ్బులు వర్షిస్తే బాగుణ్ణు!
గాలికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న
దొంగమబ్బులు
కొంచెం మెత్తబడితే బాగుణ్ణు!
ముఖాలు వేలాడేసుకుని చూస్తున్న చెట్లు
మొక్కలకు పురుడు పోయాలని చూస్తున్న నేలతల్లి
పచ్చదనాన్ని విస్తరిం చేయాలని ఎదురు చూస్తున్న ప్రకృతి
ఆశలు అడియాసలు కాకుండా ఉంటే బాగుండు!!
ఈ మబ్బులు వర్షిస్తే బాగుండు!
ఈ ఉక్క పోతలు తొలగిపోతే బాగుండు!!
డా.గూటం స్వామి
(9441092870)