యోగా ప్రశాంతమైన జీవనానికి, ఆరోగ్యకరమయిన జీవన శైలికి సాధనం అనే నినాదంతో ఈ రోజు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కెవిఐసి దక్షిణ భారత అధ్యక్షులు పేరాల శేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మనస్సుకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుందని అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యానికేకాదు, మనవాళి మేలుకోసమే ప్రధాని నరేంద్రమోదీ జూన్ 21న యోగా దినం పాటించేందుకు నిర్ణయించారని అన్నారు. ఆయన కృషి వల్లనే ఈరోజునుఅంతర్జాతీయ యోగాదినంగా పాటిస్తున్నారని శేఖర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు, క్రీడాకారులు, వాకర్స్ పాల్గొన్నారు. వారితో పాటుతెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ జగదీష్ యాదవ్, సహకార్యదర్శి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా క్రీడాభి వృద్ధి సంస్థ అధికారివెంకటేశ్వరరావు,జిల్లా విద్యాధికారి శైలేందర్ రావు, SAT డైరెక్టర్ చంద్రారెడ్డి రాఘవరెడ్డి, నారాయణరెడ్డి, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.