ఏప్రిల్ 16, 1853 ప్రాముఖ్యం తెలుసా?

సరిగ్గా 170 యేళ్ల కిందట భారతదేశంలో తొలి  ప్యాసెంజర్ రైలు నడిచింది ఈ రోజునే.  ఏప్రిల్ 16, 1853న బోరీ బందర్ నుంచి   తానా కు ఈ  మొదటి రైలు నడిచింది.   14  బోగీలున్న రైలు అది. దానిని మూడు ఇంజన్లు లాగేవి. ఆ ఇంజన్ల పేర్లు సుల్తాన్, సింధ్, సాహిబ్.  అది ఇండియాలోనే కాదు, మొత్తం ఏసియాలో నే మొదటిరైలు.

బోరీబందర్ నుంచి ఈ రైలు ప్రారంభమయింది. ఆ బోరీ బందరే  తర్వాత విక్టోరియా టర్మినస్ అయింది. ఇపుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (CSMT) గా మారింది. నాటి గమ్యస్థానం తానా ఇపుడు థానే గా మారింది. బోరిబందర్ నుంచి తానా  దూరం 21 మైళ్లు. ఈ ప్రయాణానికి 57నిమిషాల సమయం పట్టింది. అపుడు ఈ రైలును గ్రేట్ ఇండియన్ పెనిన్స్యుల రైల్వే (Great Indian Peninsula Railway ) నడిపింది. అదే ఇపుడు సెంట్రల్ రైల్వే అయింది.

ఈ రైలుకు ముందు కూడా దేశంలో రైళ్లు నడిచాయి. అవి కేవలం నిర్మాణాలకు సామాన్లను మోసుకుపోయేందుకు మాత్రమే వినియోగించారు. కమర్షియల్ ప్యాసెంజర్ ట్రెయిన నడిచింది మాత్రంఏప్రిల్ 16, 1853న.  మధ్యాహ్నం మూడున్నర గంటలకు. ట్రైయిన్  400 మంది ప్రయాణికులతో కదిలింది. రైలుకు 21 గన్ శాల్యూట్ ఇచ్చి వీడ్కోలు చెప్పారు.

ఇండియన్ రైలు జర్ని ఇలా మొదలయింది…

1835లో మద్రాసు చింతాద్రి పేట లో ఒక ప్రయోగాత్మక రైలును నడిపారు. రెడ్ హిల్స్ రైల్ రోడ్  లైన్ కోసం  ప్రాక్టీస్ గా దీనిని నడిపారు. రెడ్ హిల్స్ రైల్ రోడ్ నిర్మాణం 1836లో మొదలయింది.  1837లో రైలు మార్గం పూర్తయింది. మొదట్లో పట్టాలమీద జంతువులు బరువులను లాగేవి. సమీపంలోని గని నుంచి గ్రానైట్ ను మోసుకువచ్చేందుకు ఈ రైలు మార్గం వేశారు. తర్వాత ఇంజన్లు కూడా వాడినట్లు సమాచారం ఉంది.

A small piece of railway has been laid down near the Chintadrapettah Bridge, which is worth the inspection of the good people of Madras who have not visited England since railways have been common. To show how little labour is required on a road of this description, a cart is placed upon the rails, loaded with stones, which is easily moved up a slightly inclined plane by one hand from where it returns by its own weight from the place it was first propelled. అని మే 4, 1836న  Madras Gazette రాసింది.

ఇలా మొదలయిన భారతీయ రైలు యాత్ర 2022 నాటికి ప్రపంచంలోనే ఇది నాలుగు  పెద్ద రైలు వ్యవస్థ అయింది. 2021 డిసెంబర్ నాటికి 67,956 కిమీ రైలు వ్యవస్థగా ఎదిగింది. ఇందులో 45,881 కిమీ (75శాతం) బ్రాడ్ గేజీ ఉంది. ఈ మార్గమంతా విద్యుదీకరణ అయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రైల్వే 121.23 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. రోజు  13,169రైళ్లను నడపుతుంది.  7,325 స్టేషన్ల గుండా రైళ్లు  ప్రతిరోజూ ప్రయాణిస్తాయి. భారతీయ రైళ్లు సగటు వేగం గంటకు  50.6 కి.మీ. గరిష్ట వేగం గంటకు160 కిమీ(గతిమాన్ ఎక్స్ ప్రెస్)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *