యుద్ధం ఆగిపోకపోతే, యుక్రెయిన్ దేశంలోని ఖార్కివ్ పట్టణంలో ఒక హృదయ విదారక సంఘటన ఎదురుకాబోయే ప్రమాదం ఉంది. అక్కడి జంతుప్రదర్శన శాలలో ఉన్న క్రూర మృగాలను చంపేయాల్సి వస్తుందని ఒక ప్రయివేటు జూ యజమాని అలెగ్జాండర్ ఫెల్డ్ మన్ అన్నారు.
రష్యాసైనికులు కురిపిస్తున్న బాంబుల వర్షంలో ఇప్పటికే జూ నాశనమయిందని జంతువుల బోనులకు రంధ్రాలు పడ్డాయని, బోనులు నాశనమయితే, జూలోని సింహాలు పులులు తప్పించుకుని నగరంలోకి పారిపోతాయని ఆయన ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే ఖార్కివ్ ప్రజలు ప్రాణభయంతో భయంతో బతుకుతున్నారు. ఈ జంతువులు నగరంలో సంచరించడం మొదలయితే, ప్రజల ప్రాణాలకు మరింత మప్పు ఎదురవుతుందని, తమక మనుషుల ప్రాణాలే ఇపుడు ముఖ్యమని ఫెల్డ్ మన్ అన్నారు.
More tragic news. 🇷🇺 bombardment destroyed the #Kharkiv Eco Park.
Owner said if by the end of today he doesn’t find proper transportation, lions & tigers will be put down. They’re scared & confused. Can’t let them roam free in residential areas”. #StandWithUkraine#StopRussia pic.twitter.com/cSIxmNGJpE— olexander scherba🇺🇦 (@olex_scherba) April 5, 2022
’ఇంకొక్కసారి బాంబులు పడితే, జూలో ఉన్న సింహాలు,పులులు, ఎలుగుబంట్లు, ఇతర ప్రమాదకరమయిన జంతువులు నగరంలోకి, చుట్టపక్కల గ్రామాల్లోకి పారిపోతాయి. ఇది జరగడానికి వీళ్లేదు. ఇప్పటికే కంగారు వంటి జంతువులను మరొకచోటికి తరలిండం జరిగింది. ఈ పెద్ద మృగాలను తరలించడం సాధ్యం కాదు,’ అని ఆయన అన్నారు.
ఈ జూ పేరు ఫెల్డ్ మన్ ఎకో పార్క్.
జంతువులను తరలించడం సాధ్యం కాదు కాబట్టి వాటిని శాశ్వత నిద్రలోకి పంపడమే మార్గమన్నట్లు కనిపిస్తూ ఉందని ఆయనఅన్నారు.
అదృష్టవశాత్తు ఇంతవరకు సింహాలకు, పులులకు బాంబు ముప్పు ఎదురుకాలేదని చెబుతూ ఫెల్డ్ మన్ ఎకో పార్క్ నాశనమయిందపోయిందని, అది అడ్రసులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలు dailymail.co.uk లో ఉన్నాయి.