కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘రైతు వ్యతిరేక విధానాలను’ నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో జాతీయ రహదారుల దిగ్బంధం నిర్వహించారు. రైతుల దగ్గిరనుంచి వరిధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని టిఆర్ ఎస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. మోదీ డౌన్ డౌన్ , బిజెపి డౌన్ డైన్ నినాదాలు చేశారు. అనేక చోట్ల ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు.