పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ (దిగువ సభ)ని దేశాధ్యక్షుడు డా. ఆరిఫ్ ఆల్వి రద్దు చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహా మేరకు సభని రద్దు చేస్తున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
ఇమ్రాన్ పిటిఐ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ప్రతిపాదించి న అవిశ్వాస తీర్మానమ్ చెల్లదని డిప్యూటీ స్పీకర్ ప్రకటించాక జరిగిన పరిణామం ఇది.
The President of Pakistan, Dr Arif Alvi, has approved the advice of the Prime Minister of Pakistan to dissolve the National Assembly under the Article 58 (1) read with Article 48(1) of the Constitution of the Islamic Republic of Pakistan.
— The President of Pakistan (@PresOfPakistan) April 3, 2022
మరోవైపు మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు పిలుపు నిచ్చారు.
లోక్ సభ రద్దు కావడంతో ఫెడరల్ కాబినెట్ కూడా రద్దు అయిందని, అయితే ఇమ్రాన్ ఖాన్ రాజ్యాంగం లోని 224 అధికరణం కింద ప్రధానిగా కొనసాగుతారరని విశేషంగా మంత్రి సిహెచ్ ఫవాద్ హుసేన్ ఉర్దూలో ట్వీట్ చేశారు.
آئین کے آرٹیکل 224 کے تحت وزیر اعظم اپنی ذمہ داریاں جاری رکھیں گے کابینہ تحلیل کر دی گئ ہے
— Ch Fawad Hussain (@fawadchaudhry) April 3, 2022
రాజ్యాంగమ్ ప్రకారం, లోక్ సభ రద్దు అయ్యాక
90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి.
అంతకుముందు జాతినుద్దేశించి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ డబ్బుతో ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారారు. లోక్ సభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ప్రతిపక్షాలు ఖర్చు చేశాయని ఆరోపించారు.’ నన్ను దించే అధికారం విదేశీ శక్తులకు, అవినీతి సభ్యులకు లేదు. ఆ అధికారం ఉన్నది, మీకు (పాక్ ప్రజలకు) మాత్రమే” అని ఆయన అన్నారు.