దేశంలో పేరు లేని ఎయిర్ పోర్ట్ ఇదే. విమానాశ్రయం పేరు గొడవల్లో చిక్కుకోవడంతో కేవలం ‘ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్’ అనే బోర్డులు మాత్రమే సర్వత్రా కనిపిస్తాయి.
చండీగడ్ లో ఉన్న ఇంటర్నేషనల్ విమానాశ్రయ చరిత్రలో కొత్త శకం 2015 లో మొదలయింది. మొహాలిలో ఉన్న ఈ విమానశ్రయంలో జాతీయ,అతర్జాతీయ విమానాసర్వీసులకోసం ఉద్దేశించిన కొత్త, ఆధునిక టర్మినల్ ను సెప్టెంబర్ 11 ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుకె లకు పంజాబ్ నుంచి ఇంటర్నేషనల్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. అందువల్ల కొత్త టర్మినల్ తో చండీగడ్ విమానాశ్రయం దేశంలోని ఒక ప్రధాన ఎయిర్పోర్ట్స్ లలో ఒకటి అవుతుంది.
సాధారణంగా కొత్త ఎయిర్ పోర్టు వచ్చినా, లేదా కొత్త ప్రభుత్వం వచ్చినా మొదట చేసేది పేర్చు మార్చడమే. చండీగడ్ ఎయిర్ పోర్ట్ ను ఆధునీకరించగానే పేరు పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉబలాటపడుతుంది. ప్రతి ప్రభుత్వ తన ఐడియాలజీకి అనుకూలమయిన వ్యక్తుల పేర్లనే పెడుతుంది. ఇది చండీగడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కు మాత్రం పేరు సమస్య వచ్చి పడింది. ఎందుకు? దీని వెనక ఆసక్తికరమయిన వివాదం ఉంది. అదిభగత్ సింగ్ గురించిన వివాదం.
మార్చి 23న భగత్ సింగ్ అమరుడయిన రోజున. ఆ రోజు ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ లోని షాదాన్ చౌక్ జైలులో ఉరితీసింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ గురించి మననం చేసుకోవాలి. ఈ సమయంలో టక్కున గుర్తుకొచ్చేది చండీగడ్ విమానాశ్రయం.
వివాదం ఎందుకు?
చండీగడ్ విమానాశ్రయానికి తొలి నుంచి పేరు లేదు. చండీగడ్ విమానాశ్రయమనో, అది మొహాలి ప్రాంతంలో ఉంది కాబటి మొహాలి విమానశ్రాయనో పిలుస్తూ వస్తున్నారు. ఈ విమానాశ్రయం, మూడు ప్రభుత్వాల ప్రాపర్టీ. ఇందులో ఒకటి పంజాబ్. రెండోది హర్యానా.విమానాశ్రయ నిర్మాణంలో హర్యానా ఇన్వెస్టు మెంట్ 24.05 శాతం. అందువల్ల పేరు పెట్టడంలో తన ప్రమేయం ఉండాలని హర్యానా వాదన.
2008లో పంజాబ్ అసెంబ్లీ ఒక తీర్మానం చేస్తూ ఈ విమనాశ్రయానికి షహీద్-ఇ-ఆజామ్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానశ్రయం అని పేరు పెట్టాలని నిర్ణయించింది. 2015 సెప్టెంబర్ 11 కు ముందు ఈ విమనాశ్రయానికి మొహాలి విమనాశ్రయంగా పేరు పడింది.ఎందుకంటే, ఇది పంజాబ్ లో విమనాశ్రయం ఉండే రెవిన్యూ జిల్లా పేరు. సివిల్ ఏవియేషన్ అధారిటీ నియమాల ప్రకారం విమనాశ్రయానికి ఆప్రదశపు రెవిన్యూ జిల్లా పేరు పెట్టడం సబబే.
అయితే, ప్రతిదీ రాజకీయమవుతున్న ఈ రోజుల్లో విమనాశ్రయాల పేర్లను కూడా పార్ట్లీలు రాజకీయాలకు వాడుకోవడం దేశంలో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా పంజాబ్ ప్రభుత్వం షహీద్ భగత్ సింగ్ పేరును ప్రతిపాదించింది. భగత్ సింగ్ పేరు పెట్టడం హర్యానాకు ఇష్టం లేదు. అందువల్ల దీనికి అంగీకరించలేదు.
దానికి తోడు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ నాయకత్వంలోని హర్యానా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. ఒక ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుడి పేరు విమానాశ్రయానికి సూచించింది. ఆయన పేరు డాక్టర్ మంగల్ సేన్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చెందిన డాక్టర్ మంగల్ సేన్ ఇపుడు బిజెపిలో ఉన్న హర్యానా నాయకులందరికిగురువు. ముఖ్యమంత్రి ఖత్తర్ కూడా గురువే. గతంలో ఆయన హర్యానా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. భగత్ సింగ్ మీద తొలి నుంచి బిజెపికి పూర్తి విశ్వాసం లేదు. అలాగని భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమర త్యాగధనుని వదులుకోలేదు. తాను సొంతంచేసుకుంటున్న స్వాంతంత్య్ర సమర యోధుల జాబితాలోకి ఎక్కించనూ లేదు. అందుకే పంజాబ్ ప్రభుత్వం భగత్ సింగ్ పేరు తెస్తూనే మనస్పూర్తిగా స్వాగతించ లేకపోయింది.
దీనికితోడు ఏకంగా ఆర్ ఎస్ ఎస్ నాయకుడైన మంగల్ సేన్ పేరు ప్రతిపాదించడం తో బిజెపికి భగత్ సింగ్ మీద ఉన్న వైఖరి అందరికి తెలిసిపోయింది. నిజానికి తొలుత భగత్ సింగ్ పేరు సూచించిందెవరో కాదు భారతీయ జనతా పార్టీ కి మిత్రపక్షమయిన అకాలీ దళే. భగత్ సింగ్ పేరు లేకపోతే, మొహాలీ ఇంటర్నేషనల్ పేరైనా కొనసాగించాలనేది పంజాబ్ వాదన.
మొహాలీ పేరుకూడా హర్యానా కు ఇష్టం లేదు. ఎందుకంటే, మొహాలీ పంజాబ్ భూభాగం. ఈ రెండు పేర్లకు బదులు కేంద్ర పాలిత ప్రాంతమయిన చండీగడ్ పేర చండీగడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరుపెట్టండనేది హార్యానా వాదన.
అయితే, సిక్కు జాతియోధుడయిన భగత్ సింగ్ కు సరైనా న్యాయం జరగలేదని, దానికి తోడు భగత్ సింగ్ ను యోధుడిగా, త్యాగధనుడిగా భారతదేశమంతా నిర్వివాదంగా గుర్తించినందున ఆయన పేరు పెట్టాలని పంజాబ్ పట్టుబడుతూ ఉంది. పంజాబ్ ప్రభుత్వం మొహాలీలో విమనాశ్రయానికి 300 ఎకరాల భూమిని అందించింది. అందువల్ల మొహాలీ పేర దానిప్రత్యామ్నాయ ప్రతిపాదన.
ఎయిర్ పోర్ట్లో వాటాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ 24.05 శాతం, హర్యానా 24.05 శాతం, ఎయిర్ పోర్ట్స్ అధారిటీ 51 శాతం. విమానాశ్రయానికి పేరు పెట్టే బాధ్యతను ఎయిర్ పోర్ట్స్ అధారిటి రాష్ట్రాలకు వదిలేసింది. ఒకే రాష్ట్రం ఉంటే ఏ సమస్యా రాదు. మొహాలీ ఎయిర్ పోర్టు రెండు రాష్ట్రాల జాయింట్ వెంచర్ కావడం, సైద్ధాంతికంగా రెండు రాష్ట్రాలలో వ్యతిరేకమయిన ప్రభుత్వాలు ఉండటంతో వివాదం ఎంతకు తెగడం లేదు.
రెండురోజుల్లో భగత్ సింగ్ అమరవీరడయిన దినం ఉంది. ఆయన భారత జాతి నివాళులర్పించనుంది. ఈ సందర్భంగా రెండు ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చి భగత్ సింగ్ పేరు ను ఖరారు చేసి ప్రకటిస్తాయని ఆశిద్దాం.